9, ఆగస్టు 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1755 (బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.

35 కామెంట్‌లు:

  1. చుట్టాలఁ వీడి తను చే
    పట్టెను సన్న్యాస దీక్ష ఫలితముగా సం
    ఘట్టిత చేలము వీడెను
    బట్టలు లేకుండ దిరుగు వాడె ఘనుండౌ.

    రిప్లయితొలగించండి
  2. పెట్టెల నిండుగ గుడ్డలు
    పెట్టుకొన ప్రయాణమందు బరువగునని తా
    గట్టిగ నమ్ముచునెక్కువ
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ

    రిప్లయితొలగించండి
  3. పట్టణపు వింత పోకడ
    లొట్ట యటంచున్ వచించి రూఢిగ తను చే
    పట్టిన విధమున చిరిగిన
    బట్టలు లేకుండ దిరుగు వాడె సుజనుడౌ.

    రిప్లయితొలగించండి
  4. పొట్టేలును వెంబ డించగ
    బట్టలు లేకుండఁ , దిరుగువాఁడె సుజనుఁడౌ
    పట్టిన ప్రణయపు నూర్వశి
    పెట్టిన గడువంత రించ వెడలెను దివికై

    రిప్లయితొలగించండి
  5. బట్టలు మనసంస్కృతికవి
    పెట్టిన కోటలు ఘనమగు పెన్నిధి యవియే
    కుట్టిన పరాను కరణపు
    బట్టలు లేకుండదిరుగు వాడె సుజనుడౌ

    రిప్లయితొలగించండి
  6. జుట్టులు పిచ్చిగ పెంచుకు
    కట్టులు వద్దంటు చాటు కవితలు వ్రాసెన్
    దిట్టడు కాడా వేమన ?
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ!!!

    రిప్లయితొలగించండి
  7. బట్టలు మనసంస్కృతికవి
    పెట్టిన కోటలు ఘనమగు పెన్నిధి యవియే
    కుట్టిన పరాను కరణపు
    బట్టలు లేకుండదిరుగు వాడుసుజనుడౌ

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘పొట్టేలు ననుసరించగ..’ అనండి.
    పొట్టేలుకు, ఊర్వశికి సంబంధమేమిటో, ఆ కథ ఏమిటో నాకైతే తెలియదు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వద్దంటు’... ‘వద్దనుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. కట్టెదురా వైకుంఠపు
    దిట్టడిఁ గనులారఁ జూడఁ దిరుమల గుడిలో
    కట్టడి మేర నిషేధిత
    బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!

    రిప్లయితొలగించండి
  10. కం : బట్టలు మెండుగ నుండిన
    పట్టణమున మోయుట సులభము కాదనుచున్
    కట్టినవి గాక యెక్కువ
    బట్టలు లేకుండ దిరుగు వాడు సుజనుడౌ.

    రిప్లయితొలగించండి
  11. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    శంకరయ్యగారూ,
    సోదరి రాజేశ్వరిగారి పూరణలోని "యూర్వశి పురూరవుల కథ" భారతములోనిది. ఊర్వశి ప్రాణప్రదముగఁ జూచుకొనుచున్న పొట్టేలును దెచ్చుటకై దిసమొలతో వెడలిన పురూరవుని విడనాడిన యూర్వశి చర్య నిట ననుసంధానించుకొనునది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. కం : బట్టలు మెండుగ నుండిన
    పట్టణమున మోయుట సులభము కాదనుచున్
    కట్టినవి గాక యెక్కువ
    బట్టలు లేకుండ దిరుగు వాడు సుజనుడౌ.

    రిప్లయితొలగించండి
  13. పట్టుదలగ మనదేశపు
    పుట్టములను గట్టుకొనుడు పురజనులారా!
    కట్టక పరాయి దేశపు
    బట్టలు లేకుండ దిరుగువాడె సుజనుడౌ!!!



    పెట్టు విబూది నొసట చే
    బట్టును కంకాళ మెపుడు వలువము వలెనే
    చుట్టుకొనుచు పులితోలును
    బట్టలు లేకుండ దిరుగు వాడె సుజనుడౌ!!!

    రిప్లయితొలగించండి


  14. మట్టిపనిఁ గట్టిపెట్టియు
    నట్టులె బట్టలనుఁ గట్టి యట్టిట్టులఁ దా
    గట్టులఁ బట్టఁగ మాసిన
    బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!

    రిప్లయితొలగించండి
  15. చుట్టా లబ్బాయే యా
    బట్టలు లేకుండ దిరుగువాడె, సుజనుడౌ
    కట్టడి జేయగ దుష్టుల
    నట్టిటు నిక మారకుండ నందరు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    దేవాలయానికి సంప్రదాయపు దుస్తులు ధరించి వెళ్ళాలనే మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    తక్కువ లగేజీతో ప్రయాణం సుఖమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.
    మాసిన బట్టలు లేనివాని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి నమస్కారం. మీరిచ్చిన సమస్యకు నాకు తోచిన రీతిలో పూరణ చేశాను. దయచేసి పరిశీలించి తప్పులున్న తెలుపగలరు.
    అట్టడుగు జనుల గని తా
    నట్టులె నుండవలెననిత నపైవలువలే
    వట్టివనె మహాత్ముడు గద
    బట్టలు లేకుండ దిరుగువాడె సుజనుడౌ!!

    రిప్లయితొలగించండి
  18. 15బట్టలుగట్టనివయసున
    కట్టడిలేనట్టి బ్రతుకు కలుషిత మేదీ
    పట్టని పసి బాలుండిల
    బట్టలు లేకుండ దిరుగు వాడె సుజనుడౌ

    రిప్లయితొలగించండి
  19. పుట్టిన గడ్డను మరువక
    మట్టిని నమ్ముచు జనహితమౌచర్యల చే
    పట్టుచు దురహంకారపు
    బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!



    రిప్లయితొలగించండి

  20. శ్రీగురుభ్యోనమ:

    కట్టడు శ్రావణబెళగొళ
    పట్టనమున తీర్థకరుడు వస్త్రంబులనే
    పట్టుగ దీక్షా దక్షుడు
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.

    రిప్లయితొలగించండి
  21. గట్టిగ జెప్పిరి యప్పుడు
    ముట్టకుడు విదేశ వస్త్ర ముల ఖాదీనే
    కట్టుమని యిపుడు ఖాదీ
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.

    రిప్లయితొలగించండి
  22. కట్టును బొట్టును మరువక
    బెట్టగు మనదేశ వలువ విలువలఁగనుచున్
    గుట్టును దాచని మ్లేచ్ఛుల
    బట్టలు లేకుండఁదిరుగు వాఁడె సుజనుడౌ

    రిప్లయితొలగించండి
  23. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    గుట్టుగ నుంచెడి యంగము
    లెట్టుల కనబడగ వలెనొ నేర్పెడిరీతిన్
    గట్టక ,రోతను గొల్పెడి
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.

    రిప్లయితొలగించండి
  24. గురువులకు నమస్కారములు
    సోదరులు శ్రీ గుండు మధుసూదన్ గారు వివరించినది ఆధారముగానేను వ్రాసాను .అది ఊర్వశీ పురూరవుల కధలోనిది . " పురూరవ చక్రవర్తికి ఊర్వశి మూడు నియమాలను పెడుతుంది 1 . నేను నెయ్యిమాత్రమె తింటాను .2.నాకు రండు పొట్టేళ్ళు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా కాపలా కాయాలి 3 . ఒక్కసమయంలో తప్ప ఎప్పుడూ దిగంబరంగా కనబడ కూడదు . వీటిని అతిక్రమించిన తక్షణం నిన్ను విడచి వెళ్ళి పోతాను అని " దేవేంద్రుడు ఊర్వసితో ఉన్న సమయంజూసి పొట్టేళ్ళ అరుపులను పర్జన్యుని మెరుపులను సృష్టించడంవలన దిగంబరంగా పరుగిడిన పురూరవుని చూస్తుంది అదన్నమాట .గురువులకు సోదరులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  25. కొట్టినటులుండు మాటలు
    ముట్టిన దూరంబనుచును మూతి విరుపులున్
    తట్టెడుకుళ్ళును, చిరిగిన
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    నట్టింటను నడిరోడ్డున
    కట్టిన వలువలను జూడ కనువార లిసీ!
    కొట్టుడు, మృగమే వీడను
    బట్టలు లేకుండ దిరుగు వాడె సుజనుడౌ

    రిప్లయితొలగించండి
  27. పుట్టినప్పుడులేని బట్ట పుడమి వీడగలేదు జూడ
    కట్టుబాట్లను తోడులేక కాలమందున వేమన|”మన
    మట్టిజన్మల కేలయనుచు?మాయమర్మము లుంచునట్టి
    బట్టలు లేకుండ దిరుగు వాడె సుజను డౌను యనెను|

    రిప్లయితొలగించండి
  28. క్షమించాలి
    పురూరవుడు ఊర్వశితో ఉన్నసమయంచూసి దేవేంద్రుడు అని ఉండాలి

    రిప్లయితొలగించండి
  29. బట్టలు లేకయె తిరుగుచు
    నట్టిట్టుగ నాటవెలదులందము జెప్పెన్
    గట్టిగ వేమన నీతుల,
    బట్టలులేకుండ తిరుగువాడె సుజనుడౌ

    బట్టలు ధరించి సగమే
    గట్టిగ దేశస్థితినటు గాంధీ జూపెన్
    నెట్టెను నాంగ్లుల చివరకు
    బట్టలు లేకుండ తిరుగువాడె సుజనుడౌ

    వట్టిగ మాటలు పలుకక
    గట్టిగ తాపసులు తాము కరుణాయుతులై
    బిట్టుగ వెలుగును నిడరే
    బట్టలు లేకుండ తిరుగువాడె సుజనుడౌ

    గట్టిగ దర్పము జూపుచు
    నెట్టన పలుకుచు వలువల నింపుగ దాల్పన్
    దట్టపు తిమిరము వీడుచు
    బట్టలు లేకుండ తిరుగువాడె సుజనుడౌ

    బట్టలు గట్టని వయసున
    పట్టుగ మోసము నెరుగము పాపలు నగుటన్
    అట్టుగ జూడగ జగతిని
    బట్టలులేకుండ తిరుగువాడె సుజనుడౌ

    రిప్లయితొలగించండి
  30. వేదుల సుభద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. సరిగణంగా జగణం (నపైవ) వచ్చింది. ‘తన పయి వలువలె లే’ అనండి.
    *****
    నాగరాజు రవీందర్ గారూ
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణలో ‘బట్టలు లేకుండఁ దిరుగు; వాఁడె సుజనుఁడౌ’ అని విరామచిహ్నాన్ని పెడితే పూరణ అర్థవంతంగా ఉంటుంది.
    రెండవపూరణ చివర ‘ఔను+అనెను’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘ఔ ననె గద’ అనండి.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఎప్పుడో చిన్నప్పుడు చదివి మరిచిపోయిన కథను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. గట్టిగ పదినెల లుండక
    నట్టింటను నాట్యమాడ నలసట మీరన్
    గుట్టుగ వ్రేలిని చీకుచు
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ

    రిప్లయితొలగించండి
  32. కట్టగ రోలున పరుగిడి
    మట్టిని మెండుగ తినుచును మారామున వే
    తిట్టిన దొంగిలి వెన్నను
    బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ

    రిప్లయితొలగించండి