6, ఆగస్టు 2015, గురువారం

న్యస్తాక్షరి - 32 (ప్ర-మా-ద-ము)

అంశం- వాహనములు... ప్రమాదములు.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘ప్ర - మా - ద - ము’ ఉండాలి.

34 కామెంట్‌లు:

 1. మిత్రులందఱకు నమస్సులు!

  ప్రథిత వాహన చోదక ప్రముఖులయ్యు
  మానవత వీడి వేగ ప్రమాదములను
  రికిఁ జేర్చుచు నుండిరి దయయు లేక!
  ముదము కాదిది కనఁగాను మదము కాదె?

  రిప్లయితొలగించండి
 2. ప్రతిభ జూపగ కొందరు వాహ నముల
  మాయ మెలికలు దిరుగుచు భయము లేక
  దయను దాక్షిణ్యమును వీడి త్రాగి నడుప
  ముదము నొందుచు జేయుప్ర మాద ములను

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. ప్రతిదినమ్ము ప్రమాదాల వార్త లెన్నొ
   మాధ్యమాలు ఘోషీంపగ మార్పులేదు
   దవ్వు జేరంగ మితిమీరి దవుడు లోన
   ముప్పు దప్పదు, తెలియరే మూర్ఖ జనులు

   తొలగించండి
 4. ే.గీ:ప్రజల సేమము నరయుచు బాధ్యతెరిగి
  మార్గ ము లరయుచు సరిగ మసలు చుండు
  దక్షిణస్థుడీతండిలన్ దక్షుడంచు
  ముదము తోడ మెత్తు రితని సదయు లెల్ల.

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవపాదంలో యతి తప్పింది. ‘మాయ మెలికలు దిరుగుచు మాని భయము’ అనండి.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘ఘోషింపగ...’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. సోదరి రాజేశ్వరి గారి పూరణమందలి నాలుగవ పాదమందును యతి/ప్రాసయతి తప్పినది.

  రిప్లయితొలగించండి
 7. గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు. నేను గమనించలేదు.
  ఆ పాదాన్ని ‘మోద మందుచు జేయు ప్రమాదములను’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 8. ప్రజలు మితిమీరి నడిపించ వాహనములు
  మార్గమున కొని దెచ్చు ప్రమాదములను
  దశల వారిగ నియమాల తరచి చూడ
  ముదము గూర్చును జనులకు చోదనమ్ము!!!

  రిప్లయితొలగించండి
 9. ప్రబలమై క్రమ్ము మృత్యువు వాహనములు
  మార్గమందున నడుపుచు మాటలాడ
  దర్పమున పట్టి సెల్లును. తప్పదపుడు
  మున్ను వచ్చెడి మృత్యువున్ ముందు కనరు.

  రిప్లయితొలగించండి
 10. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నాల్గవపాదంలో ప్రాసయతి తప్పింది. ‘మోదముం గూర్చు జనులకు చోదనమ్ము’ అనండి.
  *****
  చింతా రామకృష్ణారావు గారూ,
  బహుకాలానికి ఉత్తమపూరణతో నన్ను కటాక్షించారు. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. ప్రబల వేగాంధకారమ్ము క్రమ్ముకొనఁగ
  మార్గమేదియు గానక మత్తులోన
  దర్పమును జూపుచుందురే, తత్త్వమెద్ది?
  ముచ్చటలు చాలు గలుగవే ముచ్చెమటలు.

  రిప్లయితొలగించండి
 12. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణలు

  ప్రజ్ఞ గలవారమని దెల్ప వాహనమున
  మార్గమందున నురుకుచు మ్రంది,యముని
  దరిని జేరెడు వారలీ ధరణి వీడి
  ముదము గూర్చరె ! ప్రజలకు ముందు ముందు

  ప్రధమ పంక్తిని మృతులందు బడయ గోర
  మార్గమియ్యదెయని దెల్ప, మర్త్యులిపుడు
  దమకు తోడుగ పథికుల దండునిలిపి
  ముదము నొందగ వాహనములనడుపరె!

  రిప్లయితొలగించండి
 14. ప్రమదమున్ గాంచ కడువేగ వాహనముల
  మార్గమున పయనించుట మానవలయు
  దర్పమునువీడి వర్తించ తనివిగల్గు
  మునుగు కొంపలు లేకున్న ముంధుచూపు

  రిప్లయితొలగించండి
 15. ప్రజలు తమవాహ నంబులు వడి వడి గను
  మార్గ మంచున నడిపిన మైమరచుచు
  దరిని జేరగ గష్ట మై ధరను బడు ను
  ముప్పు రాకుండ నడుపగ ముదము కలుగు

  రిప్లయితొలగించండి
 16. ప్రతి దినమ్మంతు లేనట్టి వాహనపు ప్ర
  మాదములు జర్గు చుండెను మత్తుతోడ
  దర్పమున నడ్పు వారికి తప్పకుండ
  ముంచు కొని చావు వచ్చును ముక్తి లేదు.

  రిప్లయితొలగించండి
 17. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. ప్రకట నందున దెల్పిన భద్రతలను
  మానకెప్పుడు వాహన మాన్యులార
  దమ్ముగలదంచు వేగమ్ము నమ్మకెపుడు
  ముఖ్య గమనిక లందునే ముందుకెళ్లు
  2.ప్రతిభ జూపించుమోజున పడుటకద్దు
  మార్గదర్శక సూత్రాలు మరువకెపుడు
  దరువు వీడిన పాటలా పరుగుదీయ?
  ముప్పుగలుగును వేగంబు తప్పుగాద

  రిప్లయితొలగించండి
 19. ప్రమదమగును మితివేగపు ప్రగమనము
  మాన్యులందరు నడచిన మంచి పధము
  దర్పమెన్నడు నెరగని దయయు కరుణ
  ముదముగలిగించు నెపుడును ముప్పు లేక

  రిప్లయితొలగించండి
 20. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  వేదుల సుభద్ర గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీరు నిస్సందేహంగా చక్కని పద్యాలను వ్రాయగలరు. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం ఉంది. ‘ప్రమద మగు నతివేగపు ప్రగమనమ్ము’ అనండి. స్వస్తి!

  రిప్లయితొలగించండి
 21. ధన్యవాదాలు గురువుగారు. తప్పక మారుస్తాను.

  రిప్లయితొలగించండి
 22. ప్రధమ ప్రాముఖ్యత జనుల ప్రాణమనుచు
  మాన్య చోదక వర్యులు మనసు నిల్పి
  దర్ప శోభిత నడతను దప్పి నడుప
  ముదము మీకును మీతోడి మెదలువార్కి

  రిప్లయితొలగించండి
 23. శ్రీగురుభ్యోనమ:

  ప్రజ్ఞ కొరవడె నడిపెడు వాహకులకు
  మార్గములు జూడ గుంతలమయములాయె
  దరిని జేరగ నాత్రంబు తరుముచుండ
  ముసురుచుండె ప్రమాదము లుసురు దీయ

  రిప్లయితొలగించండి
 24. నమస్కారములు
  పొరబాటు తెలిపిన గురువులకు ,సోదరులు మధుసూదన్ గారికీ ధన్య వాదములు
  అవునూ ! రెండవ పాదంలో " మాయ మెలికలు దిరుగుచు భయము లేక " అంటే " మాయ - భయము = య కి య ప్రాసయతి ? అలాగే నాల్గవ పాదంలో " ముదము నొందుచు జేయుప్ర మాద ములను " ముదము " ద " మాద " ద " ప్రాసయతి " సరిపోతుందనుకున్నాను పొరబడితె ఏముంది ???????????????????

  రిప్లయితొలగించండి
 25. ప్రతిభ సరియైన రీతిని వర్ధిలంగ
  మానకుండ శిక్షణఁ బొంది మనుజులెల్ల
  దక్షతనుఁ గల్గి నడుపగ దారిలోన
  ముప్పు గలుగదు; నేరికి ముదము కలుగు.

  రిప్లయితొలగించండి
 26. ప్రబల వేగమ్ముతో నడిపి వాహనమ్ము
  మార్గమందున లేకున్న మలుపులన్ని
  దమ్ము జూపించ వంకరల్ తామె పోవ
  ముప్పు తప్పదుగ యువక ! మేలుకోర.

  రిప్లయితొలగించండి
 27. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  ప్రాసాక్షరం ముందు లఘు గురువుల సామ్యం ఉండాలన్న నియమాన్ని మీరు మరిచిపోయారంటే నమ్మలేకపోతున్నాను. ప్రాసకు ముందు గురువుంటే ఇతరత్రా గురువే ఉండాలి. లఘువుంటే లఘువే ఉండాలి.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  చివరిపాదంలో యతి తప్పింది. ‘ముప్పు తప్పదుగ యువక! యొప్పుకొనుము’ అందామా?

  రిప్లయితొలగించండి
 28. ప్రబల వాహన యానాలు ప్రబలమయ్యె
  మాని సూత్రాలనందరు మహిని నడువ
  దగ్గరయ్యె ప్రమాదాలు దారులందు
  ముదము కాదుర జనముల మూర్ఖతదియ

  ప్రబలమయ్యె ప్రమాదాలు వాహనముల
  మాన్యమయ్యెను త్రాగుడు,మానకుండ
  దక్షతెంతయు లేకుండ దారినడిపి
  ముగియ జేతురు ప్రాణాల పుడమి జంపి

  ప్రముఖ వాహనములవెన్నొ వచ్చెనిపుడు
  మాన్య వేగంబె ముఖ్యమై,మనుజులనిల
  దమము నొనరించి ప్రాణాల దారులందు
  ముదము నందరె వేగాన మూర్ఖులగుచు

  ప్రబల వేగంబు,చోదకవరుల పాట్లు
  మాన్య రహదారి గోతులు,మహిత రద్ది,
  దట్టమైనట్టి పొగమంచు,త్రాగుడదియ
  ముప్పుగూర్చు ప్రమాదాల పూర్తికతము

  రిప్లయితొలగించండి
 29. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. మాస్టరుగారూ ! ధన్యవాదములు...చిన్న సవరణతో...  ప్రబల వేగమ్ముతో నడిపి వాహనమ్ము
  మార్గమందున లేకున్న మలుపులన్ని
  దమ్ము జూపించ వంకరల్ తామె పోవ
  ముప్పు తప్పదు తమకని చెప్పుచుంటి.

  రిప్లయితొలగించండి