28, ఆగస్టు 2015, శుక్రవారం

సమస్యాపూరణ - 1772 (క్రిస్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
క్రిస్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము.

31 కామెంట్‌లు:

  1. వర్ణ భేదము లేదిది స్వర్ణ యుగము
    కొలువ భక్తిని దైవము నిలచి యుండు
    అల్ల శుభమస్తు వారింట మల్లె చెట్టు
    క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  2. ఆర్ష సంస్కృతి నెల్లను ఆకలించి
    పుణ్య వ్రతములన్నింటిఁబొసగజేసి
    ముక్తి కలుగగ సద్భుద్ధి భక్తిఁ
    జోషి
    "క్రిస్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము"

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    ఏ కులంబైన మతమైన నేమి ఫలములు
    నాస్తికులము గా మనమున్న వాస్తవముగ
    యాస్తికులమైన కులమత మడ్డు రాదు.
    క్రిస్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము.

    రిప్లయితొలగించండి

  4. దైవ పూజను జేయుట త ప్పు లేదు
    ఏమతము వారై నను,జేయ నీయ వచ్చు
    ననెడి సిద్ధాంత మనదియౌ య గుట వలన
    క్రిస్టినా జేయును వరలక్ష్మీ వ్ర తమ్ము

    రిప్లయితొలగించండి


  5. తే.గీ:హిందు దేశము నందున హెచ్చు తగ్గు
    లెంచక ముదమున మగువ లెల్ల చేయ
    వివరములను దెల్సు కొనుచు వేడ్క తోడ
    క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము.
    2.తే.గీ: ఆంధ్రుడొక్కడు పరిణయమాడె నొక్క
    యాంగ్ల నారి నమెరికాలో ;యాచరించ
    దలచె పూజల నట, యంత తరుణ మొదవ
    క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము.

    రిప్లయితొలగించండి
  6. సుకవి మిత్రులందఱకు వరలక్ష్మీ వ్రత దినోత్సవ శుభాకాంక్షలు!

    కృష్ణవేణియనెడి దెలుఁగింటి వనిత
    యమెరికావాసి నొకనిఁ బెండ్లాడె వలచి!
    పేరు క్రిస్టినాగా మారెఁ! బ్రేమ నేఁడు
    క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము!!

    రిప్లయితొలగించండి
  7. క్రిష్టినా యన మనసైన కృష్ణమూర్తి
    కలసి జీవించ పెళ్లాడ గతులు మారి
    క్రిస్మసును జేయు చుండెను కృష్ణమూర్తి
    క్రిష్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  8. సర్వ ధర్మ సమభావనమున
    ఖదీజా కొనియాడును దీవాళీ
    కమల కొనియాడును క్రిస్సుమస్సు
    క్రిస్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము :)


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. చిత్ర రంగాన్ని శాసించు చిన్నదొకతి
    అందముల నార బోయుచు నాంధ్రజనుల
    చిత్తములదోచి నటియించె, చిత్రమందు
    క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  10. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

    ఆఫ్రిను ఖురానుఁ జదువుఁ దా నైదుమార్లు;
    మహిమగల యేసు క్రీస్తును మదినిఁ దలఁచు
    క్రిస్టినా; చేయును వరలక్ష్మీవ్రతమ్ము
    భాగ్య; యెవరెట్లు చేసినన్ భక్తి యొకటె.

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వల్లూరు మురళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో ‘సంస్కృతి నెల్ల తా నాకళించి’ అనండి.
    రెండవపాదంలో గణదోషం. ‘వ్రతము లన్నింటినిఁ బొసఁగఁజేసి’ అనండి.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. టైపాటు కావచ్చు.‘ఫలము’ అంటే సరి!
    ‘వాస్తముగ+ఆస్తికుల’ మన్నప్పుడు యడాగమం రాదు. ‘వాస్తవముగ| నాస్తికులమైన కులమతా లడ్డురావు’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘ఏ మతస్థులైనను జేయ...’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘...నారి నమెరికలో నాచరింప’ అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    మంచి భావాన్ని అందించారు. మీ భావానికి నా ఛందోరూపం.....
    సర్వ ధర్మ సమత్వ ప్రశస్త గుణము
    నా ఖతీజ మెచ్చుకొను దీపావళి మఱి
    కమల కొనియాడు క్రిస్మసు నమలమతిని
    క్రిస్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  12. శ్రావణమ్మున శుక్రవారమ్ము నాడు
    తల్లి లక్ష్మిని పూజింప నుల్లమలర
    కలుగు శుభములు మాయమ్మ కనుము నేడు
    క్రిస్టినా! చేయును వరలక్ష్మీవ్రతమ్ము.

    రిప్లయితొలగించండి
  13. క్రిష్టినా యన మనసైన కృష్ణమూర్తి
    కలస జీవించ పెళ్లాడ గతులు మారి
    క్రిస్మసును జేయు చుండెను కృష్ణమూర్తి!
    క్రిష్టినా చేయును వరలక్ష్మీవ్రతమ్ము!
    (గురుదేవుల మౌసు జార్చిన నా పూరణ సమీక్ష నిమిత్తం మరోసారి)

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ‘గుండు, గుండాలు’ ఒకరి క్రింద ఒకరుండి తికమక పెట్టడం వల్ల జరిగిన పొరపాటు అది. మన్నించండి.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  15. సిరులు సౌభాగ్య సంపదల్ చేరుటకును
    పిల్ల పాపలు భర్తయు చల్లగాను
    బ్రతుకు సాగింప నిది యొక వ్రత మనుచును
    క్రిస్టినా; చేయును వరలక్ష్మీవ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. నామ మేదైన నడయాడు భూమి యొకటె
    మతము లేవైన మానవ హితము కొరకె
    కులము లేవైన త్రాగెడు జలము లొకటె
    పద్ధతులు వేరువేరైన ప్రార్థనొకటె
    శాంతిలేనట్టి దేశాన సుఖము గనము
    ధనము ధాన్యము లేక జీవనము లేదు
    గంగచేయును జేయును గౌసియమ్మ
    క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము !!!

    రిప్లయితొలగించండి
  18. చర్చి నందున ప్రార్థనల్-చర్చలనగ
    క్రిష్టినా చేయును”వరలక్ష్మీవ్రతమ్ము
    భారతీయుల సంస్కృతీ భాగ్యమనుచు
    శ్రావణపు శుక్రవారముజరుప బడును”.

    రిప్లయితొలగించండి
  19. ఆంధ్ర సంస్కృతి మెచ్చెనో యాంగ్లవనిత
    వెంకటేషును ప్రేమించి బెండ్లియాడి
    కొత్త కోడలి గావచ్చి యత్త తోడ
    క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము!!!

    రిప్లయితొలగించండి
  20. మందపీతాంబర్ గారూ,
    తేటగీతికలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గంగచేయును జేయును గౌసియమ్మ’ పాదం అర్థం కాలేదు.
    ‘ప్రార్థన+ఒకటె’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘భక్తి యొకటె’ అంటే సరిపోతుందనుకుంటాను.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చర్చియందున’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. క్రీస్రు భక్తురాలు ధృతితో కృష్ణు భక్తు
    పెండ్లి యాడేను ప్రేమించి వేంకటపతి
    మండపమునందు, నప్పటినుండి కోరి
    క్రిష్టినా చెయును వరలక్ష్మీ వ్రతము

    రిప్లయితొలగించండి
  22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. వరలక్ష్మి అను పేరు గల ఉద్యోగిని తన అధికారితో:

    "లేదు, కుదర" దనక నాకు రేపు పూట
    సెలవు దయసేయుమయ్యరో! చిన్న పనులు
    క్రిస్టినా చేయును,వరలక్ష్మీ వ్రతమ్ము
    చేసికొనినంత విధులకు చేరుకొందు.

    అధికారి వరలక్ష్మితో :
    అర్ధదిన విధినిర్వహణాంతరమ్ము
    నీకిడుట యుచితమె గాని, నీ పనినెట
    క్రిస్టినా చేయును? వరలక్ష్మీ! వ్రతమ్ము
    చేసికొని పిదప కచేరిఁ జేరుకొనుము.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ శంకరయ్య గారు నమస్కారము.
    భిన్న మతాలకు ప్రతీకలుగా గంగ ,గౌసియ మరియు క్రిస్టినా
    యిలా అన్ని మతాలవారు సర్వ జనశ్రేయస్సుకొరకు తమ ధనధాన్య
    సమృద్ధి కొరకు ,సుఖ శాంతుల కొరకు తమతమ పద్ధతులలో వరలక్ష్మి (వారివారి దేవతలను ప్రార్థిస్తారు)
    వ్రతాన్ని చేయుదురన్న అర్థంలో పూరించాను




    రిప్లయితొలగించండి
  25. ఊకదంపుడు గారూ,
    వరలక్ష్మి అనే ఉద్యోగిని కథనంగా మీ రెండు పూరణలు వైవిద్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    గౌసియా వలె ‘గంగ’ ఒక స్త్రీపేరు అని అర్థం చేసుకోలేదు.అందువల్ల పొరబడ్డాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ మీరు సూచించిన సవరణ బాగున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి