8, ఆగస్టు 2015, శనివారం

పద్య రచన - 978

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. మిన్నంటెను ధరలన్నియు
    నన్నమ్ముననింత కూర యైనాలేదే
    యున్నయొక యుల్లిపాయను
    తిన్నగ వ్రేళ్ళాడదీసి తృప్తిగ గనుమా

    రిప్లయితొలగించండి
  2. తెల్లని యన్నము తినుటకు
    నల్లని పామరున కిపుడు నంజు కొనంగా
    నుల్లిని గాంచుచు మురియగ
    పుల్లని మజ్జిగ నునైన పొందని బడుగౌ

    బడుగు = అశక్తుడు

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కూరయైనను లేదే’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నంజుకొనంగన్’ అనండి.

    రిప్లయితొలగించండి

  4. ఆ.వె: ఉల్లి జేయు మేలు తల్లి చేయదనెడి
    సూక్తి నాడు మదికి సుఖమొ సంగె
    పేదవారి కెల్ల పెన్నిధిగా నున్న
    ఉల్లి ధరయు పెరిగి ఉట్టి కెక్కె.

    రిప్లయితొలగించండి

  5. ఆ.వె: ఉల్లి జేయు మేలు తల్లి చేయదనెడి
    సూక్తి నాడు మదికి సుఖమొ సంగె
    పేదవారి కెల్ల పెన్నిధిగా నున్న
    ఉల్లి ధరయు పెరిగి ఉట్టి కెక్కె.

    రిప్లయితొలగించండి
  6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఉల్లి పాయ ధరలు నుడుమార్గ మునుజేర
    పామ రుం డొకండు భద్ర ముగను
    నుట్టి వోలె పైన నోలలా డగ జేసి
    చూచు చన్న ము దిను చుండె సామి !

    రిప్లయితొలగించండి
  8. ఉల్లిచేయు మేలు తల్లైన చేయునా
    అనుచు నుంద్రు బుద్ధు లనవరతము
    నుల్లి రేటు నేడు యుడిపథమునకేగ
    కాంచు చుండె యుల్లిఁగాంచ రుచిని

    రిప్లయితొలగించండి
  9. ఏడుకొండలెక్కి నేడ్పించ నాయుల్లి
    కనగ వలెను గాని తినగ లేము
    ప్రియము గూర్చు ననుచు పేదవారిప్పుడు
    నుల్లి గనుచు తినరె యోగిరమ్ము!

    రిప్లయితొలగించండి
  10. తఱిగిన కన్నులు మండెడు
    సురుచిరమగు నీదు ధరయె చుక్కల నంటన్
    కొరకక నెదురుగ బెట్టుకు
    మరి యన్నము దినుచునుండె మఖగంధకమా!!!

    రిప్లయితొలగించండి
  11. ఉల్లియే నిజముగ తల్లితొ సమురాలు
    వెలను గాంచినంత వెలుగు చుక్క
    ఉల్లి దినగ వలదు నుట్టిపై పెట్టుము
    ఘాటు తలచు కొనుము కడుపు నిండు

    రిప్లయితొలగించండి
  12. ఉల్లియే నిజముగ తల్లితొ సమురాలు
    వెలను గాంచినంత వెలుగు చుక్క
    ఉల్లి దినగ వలదు నుట్టిపై పెట్టుము
    ఘాటు తలచు కొనుము కడుపు నిండు

    రిప్లయితొలగించండి
  13. అందరి కారోగ్య మందించు టుల్లియే
    -----కొందరియిళ్ళలో కొలువుదీరె|
    పంటపొలములందు వంటక మందున
    -----కంటబడదుగాన?కంటతడియె|
    ఊహ కందని ధర లుయ్యాల లూపగ?
    ------సాహసంబున నిల్పు సాయమేది?
    కాయగూరలచెంత కలువని ఉల్లియే
    ------స్వంత పార్టీవలె సాగుచుండ?
    ఆకలార్పెడి అన్నము|సోకమొసగు
    ఉల్లి నుయ్యాల చిత్రమే నూగుచుండ?
    ఆశ నార్భాట మందున నారగించు
    నేటి దుస్థితి స్వార్థమే చాటుటాయె|
    2ఉల్లి పొరల చీరలుగట్టు ఉవిదవోలె|
    కష్ట జీవుల కండగా యిష్ట పరచి
    ఉల్లి తల్లిగ నారోగ్యమల్లుననగ?
    అన్న,అన్నము ప్రక్కననున్నఫలమ?

    రిప్లయితొలగించండి
  14. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘తల్లి+ఐన’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘తల్లియైనను జేయ|దండ్రు...’ అనండి. ‘ఉడుపథము’ సాధురూపం.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి