నీలి చిత్రం అంటే ఏమిటో అనుకున్నా నీళ్ళ వై 'చిత్రం ' అన్న మాట శుభోదయంజిలేబి
నీలి మబ్బులు గగనాన నిండు కతన కొండ లన్నియు మఱి యును కువలయమును వారి సహితము నీ లమై మారె నచట యెంత యందము ? వర్ణించ యెవరి తరము ?
జిలేబీ గారూ, చాలా కాలానికి ఇటు తొంగిచూశారు. సంతోషం. _/\_.*****పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
సవ్వడి జేసే జలధికిదవ్వుల నామేఘములకు ధరముల కటులన్నెవ్వరు బూసిరి నీలము?మవ్వపు వర్ణమ్మునవియె మనసే దోచెన్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.*****వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:అండగ నిల్చి యందరకు నన్నము బెట్టగ నన్నపూర్ణవైకొండలు జుట్టి వచ్చితివి కోనల సీమల నాదరింపగాగుండెల నిండ ధైర్యమును గూర్చెడి దానవు నీవు పావనీ!దండము లందజేసెదను తన్మయ మొందితినమ్మ గౌతమీ.పాపికొండలు జుట్టి పరవసింపగజేసి ****** రమణీయమైనట్టి ప్రకృతి జూపనీలంపు గగనమే నీలోన దాగెనా****** నిండైన వర్ణంబు నీకు కలుగ,స్వచ్ఛ జలంబుల సాదు తత్వము గల్గి ****** చల్లంగ చూచుచున్ మెల్లగాను సాగుచుందువు నీవు స్వాగతింతుము మేము ****** సస్యము ల్పండింప శక్తి నీవు!పావనంబైన గౌతమి పారుచుండ ధాన్య రాసులు పండును ధరణి లోన భాగ్యదాయని తానౌచు వరములిడగ పద్యసుమముల నర్చించి ప్రణతు లిడుదు.
గమ్యంబేదియు లేదు గాని బహువేగంబొప్పుచున్ నౌకపైసామ్యంబో మరి దూరమౌనొ యెఱుగన్ జాలంగనైతిన్ కదారమ్యంబౌ సువిశాల సాగర జలారణ్యంబునన్ బ్రోచి మ త్కామ్యార్థంబులఁ బొందజేయుము హరా! గంగాధరా! శంకరా!
నీట పరివర్తనముచెంద నింగినుండివచ్చిన రవి శిఖలు, నీలి వర్ణమయ్యెనది జలమ్ములు, ముదమున మదిచెలంగె (మతిపొంగె ముదముతోడ)సుందరమగు దృశ్య మచట చూడగానె
శ్రీపతి శాస్త్రి గారూ,మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.*****సంపత్ కుమార్ శాస్త్రి గారూ,మీ పద్యం చాల బాగుంది. అభినందనలు.******అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
గగనమున వెలిగెడి కాంతులుసగభాగంబవని కబ్బి సంద్రము పొంగన్నిగనిగ లాడెడి కిరణము నీలపు గిరియైసొగసులు గూర్చుచు కనులకు సుఖమునొ సంగెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.1,3వ పాదలలో గణదోషం. ఒకటవ పాదాన్ని ‘గగనమున వెలుగు కాంతులు’ అనండి. మూడవపాదాన్ని ‘నిగనిగల నీలగిరియై’ అనండి.
వెన్నెల్లోగోదారినివన్నెల్లో చూచి మురిసి పరవశమాయెన్!కన్నుల్లో కౌముదియై!యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.‘వెన్నెల్లో’ అనడం వ్యావహారికం. ‘వెన్నెలలో, వన్నెలలో, కన్నులలో...’ అనండి.
సీ. నీలాల రాశులు నేలను రాలగపాపికొండలమద్య పారుచుండెపావన గోదారి పాపలు తొలగించికోనసీమకుకొత్త సొగసు లిచ్చెగలగలా పారేటి గోదారి గంగమ్మమిలమిలా మెరిసేటి నీలమణులనొడినిండ నింపుకొనొయ్యారి నడకతోతలుకులు మెరయుచు తరగ లెసగతే.గీ.తరలి వచ్చిన తల్లిని తనివి తీర చూడ వేవేల కన్నులుఁ జాలవంతనీలి వర్ణాల సొబగుల నిన్నుఁ బొగడనేను యంతటి వాడిన నీరజాక్షి?
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:వెన్నెలలో గోదారినివన్నెలలో చూచి మురిసి పరవశమాయెన్!కన్నులలో కౌముదియై!యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!
శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఈ పద్యము పై దృశ్యమునకు చక్కని వర్ణన నీలిజలంబు నీలిధరణీవలయంబు వినీల శైలముల్నీలి తరుప్రపంచములునీలియనంతము - యెందు జూచినన్నీలిమ; నీలిమాకలితనిర్భర కంఠము పిల్చినట్లు నానీలిమదేహపంజర వినిర్గతమై పరుగెత్తె నెంతయున్.
శ్రీపతి శాస్త్రి గారూ, అనుభూతి ప్రధానమైన కవిత్వాన్ని చెప్పే శేషేంద్ర గారి అద్భుతమైన పద్యాని పరిచయం చేసి ఆనందింపజేసారు. ధన్యవాదాలు.
నీలి చిత్రం అంటే
రిప్లయితొలగించండిఏమిటో అనుకున్నా
నీళ్ళ వై 'చిత్రం '
అన్న మాట
శుభోదయం
జిలేబి
నీలి మబ్బులు గగనాన నిండు కతన
రిప్లయితొలగించండికొండ లన్నియు మఱి యును కువలయమును
వారి సహితము నీ లమై మారె నచట
యెంత యందము ? వర్ణించ యెవరి తరము ?
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిచాలా కాలానికి ఇటు తొంగిచూశారు. సంతోషం. _/\_.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
సవ్వడి జేసే జలధికి
రిప్లయితొలగించండిదవ్వుల నామేఘములకు ధరముల కటుల
న్నెవ్వరు బూసిరి నీలము?
మవ్వపు వర్ణమ్మునవియె మనసే దోచెన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅండగ నిల్చి యందరకు నన్నము బెట్టగ నన్నపూర్ణవై
కొండలు జుట్టి వచ్చితివి కోనల సీమల నాదరింపగా
గుండెల నిండ ధైర్యమును గూర్చెడి దానవు నీవు పావనీ!
దండము లందజేసెదను తన్మయ మొందితినమ్మ గౌతమీ.
పాపికొండలు జుట్టి పరవసింపగజేసి
****** రమణీయమైనట్టి ప్రకృతి జూప
నీలంపు గగనమే నీలోన దాగెనా
****** నిండైన వర్ణంబు నీకు కలుగ,
స్వచ్ఛ జలంబుల సాదు తత్వము గల్గి
****** చల్లంగ చూచుచున్ మెల్లగాను
సాగుచుందువు నీవు స్వాగతింతుము మేము
****** సస్యము ల్పండింప శక్తి నీవు!
పావనంబైన గౌతమి పారుచుండ
ధాన్య రాసులు పండును ధరణి లోన
భాగ్యదాయని తానౌచు వరములిడగ
పద్యసుమముల నర్చించి ప్రణతు లిడుదు.
గమ్యంబేదియు లేదు గాని బహువేగంబొప్పుచున్ నౌకపై
రిప్లయితొలగించండిసామ్యంబో మరి దూరమౌనొ యెఱుగన్ జాలంగనైతిన్ కదా
రమ్యంబౌ సువిశాల సాగర జలారణ్యంబునన్ బ్రోచి మ
త్కామ్యార్థంబులఁ బొందజేయుము హరా! గంగాధరా! శంకరా!
నీట పరివర్తనముచెంద నింగినుండి
రిప్లయితొలగించండివచ్చిన రవి శిఖలు, నీలి వర్ణమయ్యె
నది జలమ్ములు, ముదమున మదిచెలంగె (మతిపొంగె ముదముతోడ)
సుందరమగు దృశ్య మచట చూడగానె
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం చాల బాగుంది. అభినందనలు.
******
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గగనమున వెలిగెడి కాంతులు
రిప్లయితొలగించండిసగభాగంబవని కబ్బి సంద్రము పొంగన్
నిగనిగ లాడెడి కిరణము నీలపు గిరియై
సొగసులు గూర్చుచు కనులకు సుఖమునొ సంగెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
1,3వ పాదలలో గణదోషం. ఒకటవ పాదాన్ని ‘గగనమున వెలుగు కాంతులు’ అనండి. మూడవపాదాన్ని ‘నిగనిగల నీలగిరియై’ అనండి.
వెన్నెల్లోగోదారిని
రిప్లయితొలగించండివన్నెల్లో చూచి మురిసి పరవశమాయెన్!
కన్నుల్లో కౌముదియై!
యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వెన్నెల్లో’ అనడం వ్యావహారికం. ‘వెన్నెలలో, వన్నెలలో, కన్నులలో...’ అనండి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వెన్నెల్లో’ అనడం వ్యావహారికం. ‘వెన్నెలలో, వన్నెలలో, కన్నులలో...’ అనండి.
సీ. నీలాల రాశులు నేలను రాలగ
రిప్లయితొలగించండిపాపికొండలమద్య పారుచుండె
పావన గోదారి పాపలు తొలగించి
కోనసీమకుకొత్త సొగసు లిచ్చె
గలగలా పారేటి గోదారి గంగమ్మ
మిలమిలా మెరిసేటి నీలమణుల
నొడినిండ నింపుకొనొయ్యారి నడకతో
తలుకులు మెరయుచు తరగ లెసగ
తే.గీ.తరలి వచ్చిన తల్లిని తనివి తీర
చూడ వేవేల కన్నులుఁ జాలవంత
నీలి వర్ణాల సొబగుల నిన్నుఁ బొగడ
నేను యంతటి వాడిన నీరజాక్షి?
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
రిప్లయితొలగించండివెన్నెలలో గోదారిని
వన్నెలలో చూచి మురిసి పరవశమాయెన్!
కన్నులలో కౌముదియై!
యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!
రిప్లయితొలగించండిశ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఈ పద్యము పై దృశ్యమునకు చక్కని వర్ణన
నీలిజలంబు నీలిధరణీవలయంబు వినీల శైలముల్
నీలి తరుప్రపంచములునీలియనంతము - యెందు జూచినన్
నీలిమ; నీలిమాకలితనిర్భర కంఠము పిల్చినట్లు నా
నీలిమదేహపంజర వినిర్గతమై పరుగెత్తె నెంతయున్.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅనుభూతి ప్రధానమైన కవిత్వాన్ని చెప్పే శేషేంద్ర గారి అద్భుతమైన పద్యాని పరిచయం చేసి ఆనందింపజేసారు. ధన్యవాదాలు.