26, ఆగస్టు 2015, బుధవారం

సమస్యాపూరణ - 1770 (ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్.
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)

38 కామెంట్‌లు:

  1. పండుగ దినముల యందున
    మెండుగ నగలన్నిబెట్టి మీరిన ప్రేమన్
    తండ్రిని జేరిన తనయ చా
    ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్

    రిప్లయితొలగించండి
  2. అండగ గుడిలో కొలువై
    దండిగ భక్తుల మొరలను దయతో వినుచున్
    నిండుగ బలమొసగెడి చా
    ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్.

    చాముండ=పార్వతీదేవి
    మగడు=మానవుడు,పురుషుడు.

    రిప్లయితొలగించండి

  3. శ్రీగురుభ్యోనమ:

    మెండగు విషయమ్ములతో
    పండిన యీ పద్యతోట పరికించుటకై
    యండగ నంతర్ జాల
    మ్ముండను, వీక్షించి మగఁడు మోదము నందెన్.

    రిప్లయితొలగించండి
  4. రండో బాలకులారా
    దండిగ జూచితిరి దూరదర్శన మంచున్
    దండించ,నంతర్జాల
    మ్ముండను వీక్షించి మగడు మోదము నందెన్.

    రిప్లయితొలగించండి
  5. పెండిలినాటివి చిత్రము
    లండీ ! యని కళ్ళజోడు నదించంగా
    మెండుగ గన చత్వార
    మ్ముండను, వీక్షించి మగఁడు మోదము నందెన్.

    రిప్లయితొలగించండి
  6. అండగ నిలిచెడు దేవిని
    పండగ రోజంటు భార్య భక్తిన గొలవన్
    దండిగ శోభించిన చా
    ముండను వీక్షించి మగడు మోదము నందెన్

    రిప్లయితొలగించండి
  7. కొండను కొలువై యుండియు
    గుండెల నెలవైనయట్టి గోవిందుండే
    యండగ నుండిన యాదే
    ముండను వీక్షించి మగఁడు మోదము నందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం.
      కొండను కొలువై యుండియు
      గుండెల నెలవైనయట్టి గోవిందుండే
      యండగ జూడ తమకు శుభ
      ముండను వీక్షించి మగఁడు మోదము నందన్

      తొలగించండి
  8. పండుగ రోజున ద నసతి

    మెండుగ నాభరణ ములను మెడనున్మ ఱి యు

    న్నిండుగ బూలను గలిగిన

    ముండను వీ క్షించి మగడు మోదము నందెన్

    రిప్లయితొలగించండి
  9. గుండముఁబడి మరణించిన
    చండిక తానుద్భవించె చలిమల పట్టై
    కొండదొర ప్రియపుతనూజ కోమలియౌ చా
    ముండను వీక్షించి మగడు మోదము నొందెన్

    రిప్లయితొలగించండి
  10. పండు ముసలి తాతయ్యలు
    మెండుగ బంధువులు హితులు మిత్రులు గురువుల్
    నుండు తనయూరు బండా
    ముండను వీక్షించి మగడు మోదమునొందెన్!!!

    బండముండ(బండా)= ఒడిశా లో ఒక వూరు

    అండగనుండే తల్లిని
    నిండుమనమ్మున గొలుచుచు నిశ్చలభక్తిన్
    కొండదొర కూతురగు చా
    ముండను వీక్షించి మగడు మోదము నొందెన్!!!

    రిప్లయితొలగించండి
  11. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

    మెండుగఁ దనతో ననువుగ
    నుండెడి తన భార్య చేష్ట లూహను గలుగన్
    దండిగ మనసున గారవ
    ముండను వీక్షించి మగఁడు మోదము నొందెన్.

    రిప్లయితొలగించండి
  12. భూసారపు నర్సయ్య గారు అంటున్నారు...
    “నీనాటి సమస్యకు కవిమిత్రు లందరి పూరణలు బాగున్నవి. గోలి హనుమచ్ఛాస్త్రి గారి, ఆంజనేయులు శర్మ గారి పూరణలు చక్కని అన్వయశుద్ధితో అలరారుతువ్నవి. అందరికి అభివందనాలు, అభినందనలు.”

    రిప్లయితొలగించండి
  13. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘తండ్రిని జేరు తనయ చా...’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ మూడవపాదంలో గణదోషం. ‘దండిగ నంతర్జాల| మ్ముండను...’ అందామా?
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వల్లూరు మురళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దేవుడు’ శబ్దాన్ని ‘దేముడు’ అనడం గ్రామ్యం. ‘గోవిందుండే| యండగ జూడ తమకు శుభ| ముండను...’ అందామా?
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    సమస్య పాదానికి అన్వయం కుదిరినట్టు లేదు. ‘...నిండుగ శుభములు గల గృహ| ముండను...’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘కొండదొర తనయ యగు చా|ముండను...’ అందామా?
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘గురువుల్+ఉండు’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘గురులు| న్నుండు...’ అనండి.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మిత్రుల పూరణలను చదివి స్పందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మెండగు భక్తిన్ దంపతు
    లండ శివుండంచుఁ గొలువ నా సతి కడుపున్
    బండించెను శ్రీగిరి సో
    ముం డనువీక్షించి - మగఁడు మోదము నొందెన్!

    రిప్లయితొలగించండి
  15. డా. విష్ణు నందన్ గారూ,
    ‘సోముండు+అనువీక్షించి’ అని వైవిధ్యమైన విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. కొండలదిగి పద్మావతి
    గుండెల తలనుంచి తూ గు కోరిక తోడన్
    మెండౌ సుమసౌందర్య
    మ్ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్!
    (మగఁడు = వేంకటపతి)

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి నమస్కారములు
    శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణమును వీక్షించే జంట ను ఊహించి పూరణ జేసాను

    పండగ దినమున మెండగు
    ఎండను లెక్కించకుండ ఇంతిని గూడీ
    మండపమేగీ శ్రీరా
    ముండను వీక్షించి మగడు మోదము నందెన్

    రిప్లయితొలగించండి
  18. నిండగు ప్రేమను మరువక
    మొండిగ పతి ప్రాణమెంచి పోరున సతి మా
    ర్తాండ సుతు గెల్వ నలరి య
    ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్!
    ( సతి =సావిత్రి, మగఁడు=సత్యవంతుడు)

    రిప్లయితొలగించండి

  19. ని౦డుగ తిలకము ముఖమున
    గండయుగము ముకురమువలె కన్యవధువు లో
    మె౦డుగ లక్ష్మీ వైభవ
    ము౦డను వీక్షించి మగడు మోదము నొందెన్

    రిప్లయితొలగించండి
  20. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘..గూడీ, ఏగీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
    ‘శ్రీరాముండను’ అన్నది కూడా అన్వయించడం లేదు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘యముండను’కు అన్వయం?
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. అండగ వెన్నెలవెలుగులు
    బండగ?వరలక్ష్మిపూజ పండుగరాగా
    నిండైన నియమ వ్రతపు చా
    ముండను వీక్షించి మగడు మోదము నందెన్|
    2.గుండెను దాగిన దానవు
    అండగ నీగుండెయండ హాయిని గూర్చన్
    పండుగకున్ వచ్చిన చా
    ముండను వీక్షించిమగడు మోదము నందెన్

    రిప్లయితొలగించండి
  22. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భండనమున గూలె ననగ
    కొండలరావుని పడతికి కురులను దీయన్
    గండము గట్టెక్కి బ్రతికి
    ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్.

    గుండిగల పాలు త్రాగుచు
    చండిని చాముండ ననుచు సవ్వడి జేయన్
    తండాలోగల తన చా
    ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్.

    రిప్లయితొలగించండి
  23. నమస్తే అన్నయ్యగారు.మూడవ పాదం
    "దండను నంతర్జాల/మ్ము "
    అంటె సరిపోతుందా.రెండవ పాదంలేనూ' దండిగ 'అనే పదం వచ్చిందని.
    దండ =దగ్గర

    రిప్లయితొలగించండి
  24. కొండకు కూనగు గౌరిని
    నిండుగ సతియటు గొలిచియు నేపున పతిచే
    మెండుగ నా శిశుగొన,చా
    ముండను వీక్షింఛి మగడు మోదమునందెన్

    అండజ యానలు దేవిని
    నిండుగ శుభముల నిడుమని నేరిమినడుగన్
    మెండగు పూజను ,వెస,చా
    ముండను వీక్షించి మగడు మోదమునందెన్

    నిండుగ కొండకునేగియు
    మెండుగ నీలాలనిచ్చి,మిక్కిలి భక్తిన్
    గుండున నెదుటను నిలిచిన
    ముండను వీక్షించి మగడు మోదమునందెన్

    మెండగు రాక్షసి శక్తియు
    నిండగు కేశాలనుండ,నేరిమి దానిన్
    గుండును గొరుగగ నొకరుడు
    ముండను వీక్షించి మగడు మోదమునందెన్

    రిప్లయితొలగించండి
  25. చండిక యేయన క్రీడా
    భండనమున పోరుచున్న పత్నికి గెలుపే
    పండగ యౌనను నమ్మక
    ముండను వీక్షించి మగడు మోదమునందెన్!!!


    రిప్లయితొలగించండి
  26. గురుదేవులకు ధన్యవాదములు. అన్వయలోపాన్ని సవరించిన పద్యాన్ని దయతో పరిశీలించ ప్రార్థన :
    నిండగు ప్రేమను మరువక
    మొండిగ పతి ప్రాణమెంచి పోరున సతి మా
    ర్తాండ సుతు గెల్వ కుశల
    మ్ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్!
    ( సతి =సావిత్రి, మగఁడు=సత్యవంతుడు)

    రిప్లయితొలగించండి
  27. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మూడవపాదంలో గణదోషం. ‘నిండగు నియమ వ్రతపు చా...’ అనండి.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    ఉమాదేవి గారూ,
    మీ సవరణ చక్కగా సరిపోతుంది. సంతోషం!
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సహదేవుడు గారూ,
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. మాస్టరు గారికి, భూసారపు వారికి ధన్యవాదములు.
    విష్ణునందన్ గారి విరుపు అద్భుతం...వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులతో...

    కొండొకఁడు సతీ యుతుఁడై
    మెండుగ హరిఁ గొల్చియు, "ధన మి"మ్మన, దయ వి
    ష్ణుం డిడె! సతిపైఁ గనక
    మ్ముండను వీక్షించి, మగఁడు మోదము నందెన్!!

    రిప్లయితొలగించండి
  30. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. డా. విష్ణునందన్ గారూ,
    భూసారపు నర్సయ్య గారు (ఫోన్‌లో) ఇలా తెలియజేసారు....
    “డా. విష్ణునందన్ గారి పూరణ చదివిన తర్వాత చాలాసేపు అనిర్వచనీయైన ఆనందంలో మునిగిపోయాను. ఎవ్వరూ ఊహించని వైవిధ్యమైన విరుపుతో శ్రీగిరి సోముని అనువీక్షింపజేసి అలరించినందుకు వారికి అభివాదాలు తెలియజేయండి.”

    రిప్లయితొలగించండి
  32. మాన్య మనస్వి భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు....

    రిప్లయితొలగించండి
  33. అనువీక్షించు అనుపదమును గురించి వివరించమనవి.

    రిప్లయితొలగించండి
  34. అండగ నుండుము నాకని
    కొండొక పరదేశిని గని కోరగ,... పెండ్లిన్
    నిండు ముఖమ్మున తిలక
    మ్ముండను, వీక్షించి మగఁడు మోదము నందెన్

    రిప్లయితొలగించండి
  35. గోదావరి భాష:

    చండిని బోలెడు నావిడ
    పండుగ పూటందు చంటి పాపను తేగా
    చెండును బోలెడి బోడిది
    ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్

    రిప్లయితొలగించండి