15, ఆగస్టు 2015, శనివారం

సమస్యాపూరణ - 1760 (మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు 

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.
నిజానికి ఇందులో సమస్య లేదు. కేవలం పాదపూరణమే. 
దీనిని పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:


 1. కొవ్వెక్కిన యాంగ్లేయుల
  దవ్వుగ దేశమ్మునుండి తరిమిరి యోధుల్
  నవ్వుల పువ్వులు విరిసెను
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

  రిప్లయితొలగించండి
 2. ఎవ్వీధిని కాంచినను
  రివ్వున గాలికి యటునిటు రెపరెపమనుచున్
  రువ్వుచు ధగధగ కాంతుల
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

  రిప్లయితొలగించండి
 3. అవ్విను వీధిని గాంచుడు
  రివ్వున పైపై తిరుగుచు రెపరెప లాడన్
  దవ్వుల కాంతులు జిమ్ముచు
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  రిప్లయితొలగించండి
 4. అవ్వా ! వచ్చె స్వరాజ్యము
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్
  నవ్వెను నవ భరతావని
  పువ్వుల వర్షమ్ము గురిసె ముదముంప్పొంగెన్.

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. కొవ్వెక్కిన తెల్ల దొరల
   కొవ్వునణచినట్టి యోధకూటమి స్వేచ్ఛన్
   నవ్వులు భారతి కొసగన్
   మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

   తొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘స్వేచ్ఛానవ్వులు’ అనడం దుష్టసమాసం. ‘స్వేచ్ఛన్| నవ్వులు...’ అందామా?

  రిప్లయితొలగించండి
 7. సవ్వడి యయ్యెను వీధుల
  రువ్వుచు వేవేల ప్రభలు రోదసిలోనన్
  నవ్వులు భువిపై విరియగ
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

  రిప్లయితొలగించండి
 8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ రెండవపూరణ కూడ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం... ‘ఎవ్వీథిని వీక్షించిన’ అనండి.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గువ్వ! చుడుము నేడిల
  సవ్వడులను నింపుచుండె జనులందరిలో
  నవ్వులపువ్వులు విరియుచు
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  రిప్లయితొలగించండి
 11. ధన్యవాదాలు మాష్టారు...సవరించిన పద్యం
  ఎవ్వీధిని వీక్షించిన
  రివ్వున గాలికి యటునిటు రెపరెపమనుచున్
  రువ్వుచు ధగధగ కాంతుల
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

  రిప్లయితొలగించండి
 12. పువ్వుల రేకులు రువ్వుచు
  దవ్వున నొక తెల్ల గువ్వ ధాటిగ నెగురన్
  చివ్వలు వలదని నవ్వుచు
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

  రిప్లయితొలగించండి
 13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  దవ్వుల నుండెడి మ్లేచ్ఛులె
  ఱివ్వున నెగిరెగిరి వచ్చి రిపులైనిలువన్
  కవ్వడులై తరిమితిమని
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  రిప్లయితొలగించండి
 14. అవ్వా ! చూడుమ యచ్చట
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరె
  న్బువ్వుల వర్షము గురియుచు
  నెవ్వడు మఱి యెగురవేసె నిప్పుడు దానిన్ ?

  రిప్లయితొలగించండి
 15. అవ్వ|నిదేమి విచిత్రము
  సవ్వడి లేనట్టిశాంతి సమరముచేతన్
  ఇవ్వ స్వాతంత్ర్యమునే
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.
  2.కవ్వించగ నాంగ్లేయులు
  రవ్వంతయు భయములేక రక్షగ శాంతిన్
  రువ్వి స్వాతంత్ర్యముగా
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  రిప్లయితొలగించండి

 16. శ్రీగురుభ్యోనమ:

  పువ్వులు పూచిన లతలా,
  తువ్వాయిల నాట్యమట్లు, తోయపు టలలా,
  దివ్వెల వెలుగుల రీతిగ
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  రిప్లయితొలగించండి
 17. గురుదేవులకు, కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు స్వాతంత్ర్యదిన శుబాకాంక్షలు

  అవ్వారు హిందువులనుచు
  నివ్వారిని ముస్లిములని యెంచక శాంతిన్
  దివ్వెగ, ధర్మము నడతగ
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్!

  రిప్లయితొలగించండి
 18. నాచిన్నతనంలో గ్రామంలో గల ఎడ్లబళ్ళన్నిటికి జాతీయ జండా కట్టుకొని ఊరేగింపులో పాల్గొనేవారు.
  మువ్వలు గలగల లాడగ
  రివ్వున జోడెడ్ల బండ్లు రీతిగ సాగన్
  పువ్వులు విసరగ వనితలు
  మువ్వన్నెలకేతనంబు ముదమున నెగసెన్

  రిప్లయితొలగించండి
 19. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం (టైపాటు కావచ్చు!). ‘గువ్వా చూడుము...’ అనండి.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటిపూరణ మూడవపాదంలో గణదోషం. ‘సమరముచే తా| నివ్వగ స్వాతంత్ర్యమునే’ అనండి.
  రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘రువ్వియు స్వాతంత్ర్యమునే’ అనండి.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్య్హనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. క్రొవ్వెక్కిన రిపుమూకల
  కవ్వింతల వమ్ముజేసి గగనపువీధిన్
  రివ్వున రెపరెప లాడుచు
  మువ్వన్నెలకేతనంబు ముదముననెగిరెన్ !!!

  రిప్లయితొలగించండి
 21. బూసారపు నర్సయ్య గారి పూరణ....

  నవ్వినది భారతావని
  దివ్వెలు పలుదెసల వెలిగె దేదీప్యముగన్
  బువ్వుల వర్షము గురిసెను
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  రిప్లయితొలగించండి
 22. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బూసారపు నర్సయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి 23. మువ్వన్నెలు తనవేనని,

  మువ్వన్నెల సోయగముల మొదముతోడన్;

  మువ్వన్నెల మురిపించుచు,

  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ .

  రిప్లయితొలగించండి
 24. కవి రామముని రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 25. నెవ్వల పడి నేతలు నా
  డ వ్విధి స్వాతంత్ర్యసమర మందు జయించన్
  నివ్వటిలుచు గగనమ్మున
  మువ్వన్నెల కేతన౦బు ముదముగ నెగిరెన్

  రిప్లయితొలగించండి
 26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 27. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలతో...

  దవ్వుల నుండియు వచ్చియు
  నెవ్వలఁ గలిగించు శ్వేతనీచులు పోవన్
  ఱువ్వఁగ "నహింస" ఱాళ్ళను
  మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్!

  రిప్లయితొలగించండి

 29. గురువుగారికి మిత్రులకు స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు ! వందనములు !

  రివ్వున నింగికి నెగయుచు
  గువ్వలు స్వాతంత్ర్యదీప్తి గుప్పింపంగా
  జవ్వని భారతి నగువుల
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  రిప్లయితొలగించండి
 30. చివ్వకు బోకను గాంధీ
  యవ్విధి చేగొనె నహింస యాయుధముగ తా
  గువ్వను నెహ్రూ విడువగ
  మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

  మువ్వన్నె మతపు రంగులు
  నవ్వియు వెలుగొందెగాదె నాకసమందున్
  రివ్వున నెఱ్ఱని కోటను
  మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

  అవ్విధి పింగళి వెంకయ
  మువ్వన్నెలగూర్చెజెండ,మోదముదానిన్
  చివ్వను నేతలు చేగొన
  మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

  నెవ్వగ తీరెను భారతి
  కవ్వ్ధిధి దాస్యము తొలగగ,గర్వము తోడన్
  అవ్విధి వెలిగెను నెత్తున
  మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

  రిప్లయితొలగించండి
 31. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ధన్యవాదాలు. సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. ఎవ్వీరుల వదనంబులు
  నవ్వుచు గగనంబు నందు అగుపడెనేమో
  పువ్వులు వెదజల్లుచు, ఆ
  మువ్వన్నెల కేతనంబు ముదముగ నెగిరెన్

  రిప్లయితొలగించండి
 33. మంథా శ్యామల గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో యతి తప్పింది. ‘నవ్వుచు గగనంబునఁ గననయ్యెనొ యేమో’ అనండి. (అఖండయతి నాకిష్టం లేకున్నా మీకోసం ఒక మెట్టు దిగాను.)

  రిప్లయితొలగించండి