14, ఆగస్టు 2015, శుక్రవారం

సమస్యాపూరణ - 1760 (రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. ప్రేమలొలకబోయు ప్రియురాలి సరసంబు
    లింతయంతననుచునంతులేక
    చెలఁగుచుండు సరణి పులకరించు మనోభి
    రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు

    రిప్లయితొలగించండి
  2. అప్సరసల పొందు! నాలు శచీ విందు!
    కంటఁ బడిన స్త్రీల కౌగిలింత!
    పదవి నిల్పు కొనగ పచ్చి తార్పుడట! సు
    త్రాముఁడుండు చోటఁ గాముఁడుండు!

    రిప్లయితొలగించండి
  3. అప్సరసల పొందు! నాలు శచీ విందు!
    సందు దొరికిన, ముని సతి పసందు!
    పదవి నిల్పు కొనగ పచ్చి తార్పుడట! సు
    త్రాముఁడుండు చోటఁ గాముఁడుండు!

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. సకల సంప దలును సమకూరు ధర లోన
    రాము డుండు చోట, గాము డుండు
    నాడ మగనొ కదరి యడయాడు చుండిన
    నమ్ము డా ర్య ! మీరు నాదు మాట

    రిప్లయితొలగించండి

  6. దశరథాత్మ జుండు ధరణిజ సోముండు; పతిత పావనుండు భద్రమూర్తి;కామితార్థ దుండు;కల్ప తరు సముడు; రాముడుండు చోట గాముడుండు .

    రిప్లయితొలగించండి

  7. దశరథాత్మ జుండు ధరణిజ సోముండు; పతిత పావనుండు భద్రమూర్తి;కామితార్థ దుండు;కల్ప తరు సముడు; రాముడుండు చోట గాముడుండు .

    రిప్లయితొలగించండి
  8. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కవి రామమునిరెడ్డి (రామా మునిరెడ్డి?) గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. బూసారపు నర్సయ్య గారి పూరణ.......

    ఆత్మయందు లోక మావిర్భవించెను
    చిత్ర మేమి లేదు చిన్మయంబె
    యఖిలలోక మనఁగ నంద ఱుందురు గదా
    రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు.

    రిప్లయితొలగించండి
  10. బుసారపు నర్సయ్య గారూ (నిజానికి “నర్సన్నా” అనాలి... కాని తప్పదు!),
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. బూసారపు నర్సయ్య గారి రెండవ పూరణ........

    కాముఁ డుండకున్న రాముఁ డెట్లుండును?
    రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు;
    మొదలులేని చివర మొదటనే లేదయా
    మొదలు చివర కలియ మోక్షమౌను.

    రిప్లయితొలగించండి
  12. మఘవుడు సతతమ్ము మదను పాలి బడుచు
    తిరుగుచుండునెపుడు తరుణి వెంట
    కరము తృష్ణ తోడ, కాన సురపతి సు
    త్రాముఁడుండుచోటఁగాముఁడుండు

    రిప్లయితొలగించండి
  13. బూసారపు నర్సయ్య గారూ,
    మీ రెండవ పూరణ వేమన పద్యాన్ని తలపించింది. పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురుభ్యోనమ:

    నూత్న యవ్వనమున నూనూగు మీసాల
    సోయగములు గలిగి సుందరుండు
    శివుని ధనువు విరచి సీతను జేరిన
    రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. చూచి రామవిభుని శూర్పణఖ తలచె
    నేమి సొగసు వీని దేమి ఠీవి!
    వలచి వీని నిపుడె వలపించుకొందును
    రాముడుండుచోటఁ గాముడుండు.

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    మనసు మనసు కలిసె! మనువాడ మనసయ్యెఁ!
    బెద్ద లనుమతింపఁ బ్రేమతోడి
    విరులుఁ గురిసె! నట్టి ప్రేయసీ హృదయాఽభి
    రాముఁ డుండు చోటఁ, గాముఁ డుండు!

    రిప్లయితొలగించండి
  19. 14.8.15.ప్రేమలెక్కువైన?పెత్తనమున్నట్లు
    మంచియున్న చోట?వంచనుండు|
    ధర్మ మున్నచో?నధర్మముజతగుండు
    రాముడుండుచోట గాముడుండు|
    2.సిరులు మెండుగున్న?చింతలు యున్నట్లు
    కండబలముయున్న?కలతలట్లు
    నిండుమనసుయున్న?నిష్టూర మున్నట్లు
    రాముడుండు చోట?గాముడుండు|

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
    కవి పండితులందరికీ ముందుగా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు..
    ==============*===============
    అనవరతము భక్త హనుమంతుడు నిలచు
    రాముఁ డుండు చోటఁ, గాముఁ డుండు
    ఖలుల నిలయ మైన కలియుగమందున
    రాజ్యమేలు చుండు రక్కసి వలె!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    రంభ మేనకలకు ప్రముఖత గల్పించి
    తాపసులిల కామ దాసులవగ
    పదవి నిలుపు కొనుచు భయముతో బ్రతుకు సు
    త్రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు.

    రిప్లయితొలగించండి
  22. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘వంచన+ఉండు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘జతగ+ఉండు= జతగనుండు’ అవుతుంది. ‘చింతలు+ఉన్నట్లు, బలము+ఉన్న, మనసు+ఉన్న’ అన్నచోటుల్లో సంధి నిత్యం. యడాగమం వస్తుంది. ‘నిష్ఠురము’ సరియైన శబ్దం.
    *****
    కందుల వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ధర్మరూపుడతడు తారకరాముడు
    సీతయందె తానుచెందుకోర్కె,
    నడవియైనగాని,యామెతో కలసియు
    రాముడుండు చోట గాముడుండు

    విష్ణువతడు తలప వే సీత భర్తయే
    కనగనతని సుతుడె కాముడెలమి
    ఒకతె పత్నియనుచు నొప్పెడు సీతతో
    రాముడుండు చోట గాముడుండు

    సీత రావణుండు జేకొని పోవగా
    రాముడామె కొరకు రాజితముగ
    కుములుచుండ,నామెకొరకటు వెదికెడి
    రాముడుండు చోట గాముడుండు

    గాము=తాపము

    రావణుండు తాను రాముని భార్యను
    తస్కరింపగాను,తాపమందె
    రామ తాపమదియె రావణుజంపెగా
    రాముడుండుచోట గాముడుండు

    గాము=తాపము

    రిప్లయితొలగించండి

  24. కామవాంచ రేపు కాంతల చందమ్ము
    అర్ధ నగ్న రీతి నతిశయించి
    వేల్వరించి జూపు వీడుల మదనాభి
    రాముడుండు చోట కాముడుండు

    రిప్లయితొలగించండి
  25. సీత భర్త యగును సేమంపు శ్రీకర
    రాము,డుండు చోట కాముడుండు.
    సోముడుండు చోటు శోభనకరమౌను
    దీనికింత యేల?తెగని చర్చ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "శరము లెక్కుపెట్టు శాస్త్ర పారీణుడు
      మదను బాణములకు మరులు గోనగ
      సీతతోడ గలసి ఏకాంతమందుండ
      రాముడుండుచోట కాముడుండు"

      తొలగించండి
  26. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండుపూరణాలలో ‘గాము-డుండు’ అని పదచ్ఛేదం చేసారు. ‘డుండు’ అర్థరహితమౌతున్నది కదా!
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మంథా శ్యామల గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. ఆ.వె:రాముడనెడి వాడు కాముడనెడివాడు
    మంచి స్నేహితులట మహిని;కాముఁ
    గూర్చి యడుగ పల్కె గూఢముగ నొకడు
    రాము డుండు చోట కాము డుండు.

    రిప్లయితొలగించండి
  28. ముద్దు మోము జూడ మునులు దమ్ము మరచి
    మోహపారవశ్య మొనరగా వి
    వశులగు విధమరయ వైకుంఠపతి రఘు
    రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు

    రిప్లయితొలగించండి
  29. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి