శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘మీదనైన’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
యమహ వాహనమెందుకు "యాక్కు"! వద్దు
రిప్లయితొలగించండియముని వాహనమే చాలు యమగనుండు
నడుగువేయును తైలమ్ము నడుగకుండ
గడ్డిమేయుచు మోయు మార్గమున నన్ను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
యమ! హాయనుకొని యెక్కితి
గమనమ్మున వేగమేమి కనబడదయ్యా!
తమరెట్లు సాగుచుందురొ
క్రమము నీ దున్నపోతు కదలనిదగుచో.
బండి మీద యైన బఱ్ఱె మీదైనను
రిప్లయితొలగించండిఅర్థి తోడ బాలు డాడు చుండు
ఆకలనక దాహమనక దిరుగు చుండ
ముదము నందు కాదె మురిసి తల్లి.
బాలు డొక్కడు కూర్చుండి బర్రె పైన
రిప్లయితొలగించండిపోవు చుండెను జూడుము భువన తలము
చుట్టి వచ్చు నే మో మఱి చూడ వలయు
నతని పయనము సాగునో నెంత వరకు ?
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మీదనైన’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గేదెపై పయనమ్మును మోదమలర
రిప్లయితొలగించండిచేయుచుండెను పల్లెలో చిన్నవాడు
చిఱుతప్రాయపు చేష్టలు మెరిసె మదిని
వెడలి మనసుమా యూరికి వేగముగను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
బండి మీద యైన బఱ్ఱె మీదైనను
రిప్లయితొలగించండిఅర్థి తోడ బాలు డాడు చుండు
ఆకలనక దాహమనక దిరుగు చుండ
ముదము నందు కాదె మురిసి తల్లి.
పాలనిచ్చెడు గేదెయె బాలకునకు
రిప్లయితొలగించండిపంచకళ్యాణి కాబోలు, పరవశమున
స్వారి జేయుచు తిరిగెడు భరతసుతుడు
భావి భారతి నేలెడు బాల రాజు
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దూడదుగ్దము ద్రాగిన వాడునెక్క
రిప్లయితొలగించండిఈర్ష్య లేనట్టిదై నిల్చె ఎనుముజూడ|
ఎనుము పాలివ్వ మరువకనెంచినోడు
పచ్చిగడ్డినిమేపగ బాలుడెంచె.
2.ఎనుమునెక్కినోడు ఎనలేని కీర్తిచే
-----ఈలపాటబాడి నెదుగలేద [నాటకానరఘురామయ్య]
గొడ్డుమేపినవాడు పడ్డ కష్టము మాన్పె
-----రాజకుమారుని రక్ష కొరకు [సినిమాయందురాజకుమార్]
పచ్చిగడ్డినిమేప ?నచ్చినపాలిచ్చి
----పెరుగు,మజ్జిగ,నేతిచే పెరుగజేయు
జంతు జాలమునందు వింత పోకడలుండు
-----చేసిన మేలును జెప్పబోక
సాక సద్గుణ వంతులు|సాకుకొరకు
ఎనుము పాలిచ్చి వారిని నెదుగజేయు
వీపుపైనున్న బాలుడే కాపుగాన?
సంతసంబును బంచి ప్రశాంత బరచు
పిల్లల యల్లరి చేష్టలు
రిప్లయితొలగించండిపల్లెలలో గాంచి నంత బహు రమ్య మగు
న్నుల్లము రంజిలు రీతిగ
గొల్లలు పశువుల సవారి కోరు కొనంగా
తెలతెల వారక మునుపే
రిప్లయితొలగించండిపిలవాడా గేదె మేపు వేడుక నీదా?
తెలవారును జీవితమదె
పలకయు బలపములఁ బట్టి బడికేగుమయా!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.