28, ఆగస్టు 2015, శుక్రవారం

పద్య రచన - 993

కవిమిత్రులారా,
కవిమిత్రులకు వరలక్ష్మీ వ్రత మహోత్సవ శుభాకాంక్షలు!
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. కరుణా కటాక్షములతో
    నెరవేర్చుము కోర్కెలన్ని నీవేతల్లీ
    తరుణుల సౌభాగ్యమ్ముల
    వరలక్ష్మీ కావుమమ్మ వందనమమ్మా

    రిప్లయితొలగించండి
  2. కరిరాజేంద్రునిఁబ్రోచినట్టివిధిఁ మాకాపట్యమాలిన్యముల్
    అరిషడ్వర్గములున్ జగద్విషయమాయాలోలచిత్తభ్రమల్
    హరిచక్రాయుధకాంతితో తఱిమిమాయజ్ఞానమున్ బాపుమా!
    వరలక్ష్మీ! తడుపమ్మ మమ్మునికనీ వాత్సల్యదృక్ధారలన్ ||

    రిప్లయితొలగించండి
  3. కరివర దునిసతి వనుచును
    కరములు జోడించి మ్రొక్కి కావు మటంచున్
    శరణంటిని వరలక్ష్మీ నిను
    సరితూగదు నాదు భక్తి సమ్మతి నిమ్మా

    రిప్లయితొలగించండి
  4. నిరతము నిన్నే వేడుచు
    శరణంచును కల్పవల్లి సన్నుతి జేతున్
    కరుణనుసౌభాగ్యమ్ముల
    సిరులొసగుచు గావుమమ్మ శ్రీవరలక్ష్నీ!!!

    రిప్లయితొలగించండి
  5. అమ్మా వందన మమ్మా !

    రమ్మా మాయింటి కిపుడు రయమున లక్ష్మీ !

    కొమ్మా పూజలు నాయవి

    యిమ్మా మఱి శాంతి నాకు నెప్పుడు భువిలోన్

    రిప్లయితొలగించండి

  6. శ్రీగురుభ్యోనమ:

    మురిపెముతోడ భక్తులకు పుణ్యఫలంబుల నందజేయగన్
    వరములనిచ్చు తల్లి కొలువైనది నేడిట క్రొత్తకాంతితో
    నిరతము నిచ్చు సంపదలు నిండుమనమ్మున గొల్చువారికిన్
    కరములు మోడ్చి మ్రొక్కెదను కామునితల్లికి విష్ణుపత్నికిన్

    రిప్లయితొలగించండి

  7. వరముల నిచ్చెడితల్లిని

    వరలక్ష్మిగ పూ జ సేయ వరముల నిచ్చున్

    అరమరిక లేక యుండగ

    సరియగు పద్దతిన మీరు సలుపుడు పూ జల్ .





    వరలక్ష్మి వ్రతము రోజున

    వరువాత నె లే చి మీ రు వదలని భక్తిన్

    వరలక్ష్మి పూజ చేసిన

    వరలక్ష్మి యె నిచ్చు గాత !వరములు మీ కున్ .

    రిప్లయితొలగించండి
  8. 1.ఆ.వె: సిరుల నొసగు తల్లి శ్రీదేవి నిను గొల్తు
    కోర్కె దీర్చ వమ్మ కూర్మి తోడ
    వరము లొసగు నట్టి వరలక్ష్మివే నీవు
    వెతలు దీర్చి మాకు వేడ్క నొసగు.
    2.ఆ.వె: శ్రావణంబు నందు చారులోచనలెల్ల
    చేరి యాచరింత్రు శ్రీలు కోరి
    కరుణ తోడ నమ్మ కామితార్థ మొసగ
    వెల్లి విరియు నింట వింత శోభ.
    3.ఆ.వె:సకల శుభము లొసగు శ్రావణ మాసాన
    సుదతు లెల్ల జేరి సూక్త రీతి
    కరుణ జూపు మంచు కలుముల రాణిని
    కోరి వ్రతము చేయ కోర్కె దీరు.

    రిప్లయితొలగించండి
  9. వరచేతోభవులై ప్రసన్నతములై స్పర్ధావిహీనాఢ్యులై
    కరముల్ మ్రోడ్చి విశుద్ధ భక్తియుతులై కళ్యాణ సంప్రాప్త బం
    ధురమై సర్వ శుభప్రదాయక గుణస్తోమంబునై పొల్చు శ్రీ
    వరలక్ష్మీవ్రత మాచరించ కలుగున్ వైభవ్య సంతోషముల్

    రిప్లయితొలగించండి
  10. ముత్తయిదువలంత ముదముతో కొలిచెడు
    ఆది లక్ష్మి రూపమవని యందు
    వరములిచ్చు వేల్పు వరలక్ష్మి యంచును
    విశ్వసింతురంట విమల జనులు

    రిప్లయితొలగించండి
  11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గూడ రఘురాం గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మహాలక్ష్మీదేవీ! మహితచరణా! మారజననీ!
    మహాపద్మాసీనా! వరములనిడన్ మాకొఱకునై
    మహాదుగ్ధాంబోధిన్ వెలసితివి శ్రీమాత! హరిణీ!
    మహావిష్ణ్వర్థాంగీ! కరుణగనవే మమ్ము నెపుడున్.

    శ్రీదేవీ! కరుణాతరంగిత! రమా! శ్రీవిష్ణుహృద్వాసినీ!
    నీదివ్యామృతదృక్కులన్ సిరులరాణీ! మమ్ము వీక్షించవే
    మా దౌర్భాగ్యములెల్ల తూలిపడగా మా కొంగుబంగారమా!
    పాదాబ్జంబుల వాలి మ్రొక్కెదము ప్రాపై! లక్ష్మి! దీవించవే!

    వరలక్ష్మీభృగువారము
    వరలక్ష్మికి పూజసేయ భక్తిప్రపత్తిన్
    వరముల సిరుల నొసంగును
    కరుణాలయ పద్మనాభుకాంత బిరానన్.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    మీ లక్ష్మీస్తుతి పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు.
    విరులమరిన దండలతో
    వరదాయిని వనుచు నిన్ను ప్రార్థన జేయన్
    వరలక్ష్మీ మము కావుము
    నిరతము నీ పాదసేవ నీమము మాకున్!

    రిప్లయితొలగించండి
  15. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. వరలక్ష్మీ వ్రత మెంచువారలకు సర్వాభీష్టసౌకర్యముల్
    వరముల్ వంతుగ బంచబూనునట |నార్యావర్తనంబందునన్
    మరువన్ జాలరు శ్రావణాన బడతుల్ మాంగల్య భాగ్యంబుకై
    పరివారంబున జేయుపండుగట సంప్రాప్తించు నైశ్వర్యముల్|

    రిప్లయితొలగించండి
  17. సుకవి మిత్ర బృందమునకు వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలతో...

    మదమాత్సర్యవిమోహలోభయుతకామక్రోధషడ్వర్గమున్
    మదిలో నుండఁగ నీఁక, నిత్యమును సన్మాన్యార్హతన్ గూర్చుచున్,
    సదయన్ సౌఖ్య విశేష మిచ్చి, మహదష్టైశ్వర్యముల్వేగఁ జే
    ర్చి, దగన్ బూజలఁ గొల్వ మెచ్చి, వరలక్ష్మీమాత మమ్మోమెడున్!

    రిప్లయితొలగించండి

  18. ధరలోనఁ జల్లఁగా మముఁ
    గరుణనుఁ గనుమమ్మ! వెతలు కలుగక యుండన్
    సరగునఁ గాపాడుచు నో
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    నరులను సురలనుఁ బ్రోచుచుఁ
    దరుణముఁ గని రాక పోకఁ దనరించుచు వే
    గిరముగఁ గటాక్ష మిడు నో
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    సిరులకు నిక్కయి, సతతము
    పరమార్థ మ్మిడుచు, జనుల ప్రార్థనములనున్
    గరుణనుఁ జేకొని, ప్రోచెడు
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    చిరయశము గలుగవలెనని
    స్థిరముగ మేమంత నిన్నుఁ జేరి కొలువ స
    త్వరముగ దరిఁజేర్చియు నిఁక
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    వరదాయి! విష్ణువల్లభ!
    కరుణామయి! సింధుకన్య! కమలాలయ! సుం
    దర దరహాస కటాక్షిణి!
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    -oO: శుభం భూయాత్ :Oo-

    రిప్లయితొలగించండి
  19. ఎప్పుడో అష్టాదశ వర్ష ప్రాయంలో రచించిన ' కనక ధారా స్తోత్ర ' ఆంధ్రీకరణం !

    సేవక వ్రాతమునకు విశేష కరుణ
    సకల కామ్యార్థ సౌభాగ్య సంపదలిడు
    నిను మురారిప్రియను గొల్తు నే సతమ్ము
    భక్తిఁ ద్రికరణ శుద్ధిగాఁ బ్రణుతిఁ జేసి

    (యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః
    సంతనోతి వచనాంగ మానసై స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే )

    కమల ! కమలాక్షు రాణి ! నీ ఘన దయార్ద్ర
    దృక్కులను నా పయినఁ బ్రసరించుమమ్మ !
    దీనులం బ్రథముండగు మానవుఁడను ;
    నీ యనుగ్రహార్హుఁడను ; సంధింపుము కృప !

    (కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితై రపాంగైః
    అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః )

    చారు బిల్వాటవీ మధ్య సరసి యందుఁ
    గల సహస్ర దళాన్విత కమలమందుఁ
    దనరు స్వర్ణాంబుజాత హస్తవు గదమ్మ !
    పసిడి మైచాయ గల తల్లి ! ప్రణతులివియె !

    (బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్ర పత్రే సుఖ సన్నివిష్టాం
    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీం )

    ధనికులిండ్ల ముంగిట నిల్చి దైన్యమొంది
    వారి నర్థింపఁగా బ్రహ్మ వ్రాసినట్టి
    వ్రాత నమ్మ! నీ కాలితో రాచి వైచి
    మాలిమిని జూపుమో జగన్మాత ! జోత !

    (కమలాసన పాణినా లలాటే లిఖితా మక్షర పంక్తి మస్య జంతోః
    పరిమార్జయ మాత రంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ధ్రీం )

    పొలతి ! లక్ష్మి ! తామర నీకుఁ బుట్టినిల్లు ;
    మెత్తనగు హరి హృదయమ్ము మెట్టినిల్లు ;
    రమ్ము ! నా హృదయారవిందమ్ము నిపుడు
    మహిత లీలా గృహమ్ముగా మలచికొనుము !

    (అంభోరుహం జన్మ గృహం భవత్యాః వక్షస్స్థలం భర్తృ గృహం మురారేః
    కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలా గృహం మే హృదయారవిందం )

    రిప్లయితొలగించండి
  20. మేఘవిస్ఫూర్జితవృత్తము:
    రమా! లక్ష్మీ! క్షీరాబ్ధ్యధిపతిసుతా! రమ్య! సంస్తుత్య వంద్యా!
    నమో దేవీ! సంపత్ప్రద! సుచరితా! నన్ గటాక్షించు తల్లీ!
    సమీక్షింతున్ పద్మాసన! సువదనా! సత్యమౌ నాదు భక్తిన్!
    క్రమమ్మీవున్ సంపత్కరివియవుటం గాంక్షితమ్మీవె మాతా!


    -:౦O:: శుభం భూయాత్ ::O౦:-

    రిప్లయితొలగించండి
  21. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఆర్యావర్తము’ ఉంది, ‘ఆర్యావర్తనము’ లేదు. అక్కడ ‘ఆర్యావర్తదేశంబునన్...’ అందామా? అలాగే ‘భాగ్యంబునకై’ అని ఉండాలి. అందువల్ల ‘మాంగల్యభాగ్యార్థులై’ అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ వరలక్ష్మీ స్తుతి పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    ‘నూనూగు మీసాల నూత్నయౌవనమున కనకధారాస్తోత్ర మనువదించి’ నట్టి మీ ప్రజ్ఞావిశేషానికి నమస్సులు! ఆనాటి సుమధుర పద్యాలను అందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. లక్ష్మీదేవినిఁ బూజసేసి కడు స్వారస్యంబుగా వంటల,
    న్నాక్ష్మాజంబుల పూల, బండ్లనిడుచున్ నైవేద్యముల్ నోర్మితోన్
    సుక్ష్మారూపులె తాముగా; వివిధమౌ స్తోత్రంబులన్ పాడుచుం
    ద్రా క్ష్మాభృత్సదృశంబునైన హృదిలో దాక్షిణ్యమున్ వేడుచున్.

    రిప్లయితొలగించండి