శ్రీ కృష్ణ దేవరాయలు వారి 506 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం
ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2015 న
సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి
506 వ పట్టాభిషేక దినోత్సవమును
శ్రీ గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
సాయంత్రం 4 గంటలకు
జరిపించ తలపెట్టినారు.
ఈ కార్యక్రమమున తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ సాహితీవేత్తలుపాల్గొనుచున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించగలిన, వారికృషిని ప్రశంసించుచు పరిశ్రమించిన ఎనిమిది మందికి అష్ట దిగ్గజముల పేర సత్కారములను కూడ అందింప నున్నారు.
కార్యక్రమము జరుగు చిఱునామా:-
శ్రీ గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి,
15, మొదటి దశ. (1St Phase)
జయప్రకాశ నారాయణ్ నగర్,
వయా మియాపూర్,
హైదరాబాదు,
500 049.
దూర వాణి. 9177945559.
ఈ సందర్భముగా
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
రాజ్య పట్టాభి షేకమ్ము రమ్యముగను
రిప్లయితొలగించండిజరుపు కొనునట్టి రాయల వారి కిడుదు
వందన శతములు మఱి నేను భక్తి తోడ
నంద జేయుడు దయజేసి యార్యులార !
గురువుగారూ,
రిప్లయితొలగించండిమీరు వస్తున్నారా ?
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివస్తున్నాను. మొన్న తార్నాకా సమావేశానికి అనారోగ్యం వల్ల రాలేకపోయాను.
గురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండికవి పండిత శ్రేష్టులు మీ అందరు కార్యక్రమము నందు పాల్గొన్న సుమ సౌరభాలను మాకందించ మనవి
గురువులకు నమస్కారములు.రాజేశ్వరి అక్కగారితో బాటు సుమసౌరభాలనందుకోడానికి ఎదురుచూస్తున్నాం.
రిప్లయితొలగించండిశ్రీ కృష్ణదేవరాయల పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వ్రాసిన కవిత నిచట పంచుకోవచ్చా.(పద్యాలు కాదు)
రిప్లయితొలగించండిసభ విశేషాలు అందించే ప్రయత్నం చేస్తాను.
రిప్లయితొలగించండి*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తప్పక మీ కవితను ఇక్కడ ప్రకటించుకొండి.
మాస్టరు గారూ...భువన విజయపు..విశేషాలకోసం..ఎదురుచూస్తుంటాము...
రిప్లయితొలగించండి