3, ఆగస్టు 2015, సోమవారం

సమస్యాపూరణ - 1750 (పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్.

27 కామెంట్‌లు:

 1. పరమాత్ముని పూజించుచు
  తరుణీమణి కోరుకొనగ తనయుని కొరకై
  కరుణించి వరమిడ పరమ
  పురుషుఁడు - గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్.

  రిప్లయితొలగించండి
 2. పెరిగిన విజ్ఞానముతో
  వరుసగ శోధించినట్టి ఫలితం బిదియే
  జరుపగ శస్త్రచికిత్సలు
  పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్ .

  రిప్లయితొలగించండి
 3. పరమేశుడు వరమీయగ
  పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్
  పరిపరి విధముల సృష్టిని
  నరనా రాయణుల కెపుడు హర్ష మటంచున్

  రిప్లయితొలగించండి
 4. హరహర శ్రీధర గంగా
  ధర పాహియనుచు నశిశ్వి తపమున్ జేయన్
  వరమొసగెనంతట పరమ
  పురుషుడు, గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్ .

  రిప్లయితొలగించండి
 5. పరిణయ మాయెను వలపుల
  సరసున మునుకలను వేసె జంటయు విడచెన్
  తరుణిని ప్రేమను తేజము
  పురుషుఁడు, గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్.


  రిప్లయితొలగించండి
 6. హరి మోహిని గా మారగ
  హరుడే తా హరినిజేర, నా వేళన నా
  హరిహర సుతుకొరకు, పరమ
  పురుషుడు, గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్ .

  రిప్లయితొలగించండి
 7. .కం: ధరణీపతి యవనాశ్వుడు
  పొరపాటున త్రావె మంత్ర పూతజలంబున్
  వరమొసగ శచీపతి యా
  పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్

  రిప్లయితొలగించండి
 8. అరయుము లోకపు తీరిది
  పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియె
  న్వెరవుంగా ననిపించిన
  ధరలో కలియుగ మహిమలు దనరును నిటులన్

  రిప్లయితొలగించండి
 9. తరుణులు పెట్టెడు బాధలు
  భరియించుట కష్టమంచు, వరియించంగన్
  గరితగ మార్పును బొందిన
  పురుషుడు గర్భమ్ముఁదాల్చి పుత్రుని గనియెన్

  రిప్లయితొలగించండి
 10. దొరలిన పొరబాటు వలన
  జరిగెనచట లింగమార్పు ' జంబలకిడి పం
  బ' రకమున భలె! నొకప్పటి
  పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్!

  రిప్లయితొలగించండి

 11. సిరి పలికెను 'నాథా!నే
  భరియించగ లేను ప్రసవ బాధను గానీ
  కరవీరి జేయు'మన శ్రీ
  పురుషుడు గర్భమ్ముఁదాల్చి పుత్రుని గనియెన్

  రిప్లయితొలగించండి
 12. శ్రీ అయ్యప్పస్వామి జననము........

  సురగణముల రక్షించెడు
  వరకారణమున మహా శుభంబు కలుంగన్
  పరమేశు కరుణను పరమ
  పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్.

  రిప్లయితొలగించండి
 13. గురుభ్యోనమ:

  హరు బూజించెను భువనే
  శ్వరిదేవి వివేక సుతుని బడయగ పతితోన్
  కరుణించుచు వరమిడె త
  త్పురుషుఁడు, గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులకు మనవి,
  ప్రయాణంలో ఉన్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 15. మరుపున-కచ బూడిదతో
  పురుషుడు గర్భమ్ముఁదాల్చి పుత్రుని గనియెన్
  మరుగున శుక్రుని కడుపున
  నరుదెంచిన శిష్యుదంత?నందగవిద్యన్|
  శుక్రా చార్యునికడజేరిన శిష్యునితోటిమిత్రులుచంపి
  బూడిదజేసిగురువుగారికి సురాపానములోగలిపిత్రాగించ
  గా?తెలసికొన్నగురువు సంజీవనివిద్యదెలిపి శిష్యుడు
  బయటికి రావటంపురుషుడు పుత్రునిగనుటే?
  గురువనగా?తండ్రివంటివారే నన్నభావన

  రిప్లయితొలగించండి
 16. అరయును వంశము తానటు
  పురుషుడు-గర్భమ్ముదాల్చి పుత్రునిగనియెన్
  తిరముగ నాతని భార్యయు
  వరమా పుత్రునివలననె వంశము నిలచెన్

  పురుషుడు శివుడా,శివాని
  యరయగ వనితౌ,నిరువురు నటునిటు మారన్
  చిరమాశివానె విష్ణువు
  పురుషుడు గర్భమ్ముదాల్చి పుత్రునిగనియెన్

  (విష్ణువు నాభి కమలాన బ్రహ్మ పుట్టుక-ఐతిహ్యం)

  నరనారాయణు లిరువురు
  వర పార్ధుడు,కృష్ణుడనుచు,వరల సుభద్రన్
  వరియించి గూడ,నరుడా
  పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రునిగనియెన్

  బిరమున నీయగ జన్నపు
  పురుషుడు,గర్భమ్ము దాల్చి పుత్రునిగనియెన్
  వరకౌసల్య,దశరధుడు
  మురిసెను నాతడు కొడుకును ముద్దులనాడెన్

  రిప్లయితొలగించండి
 17. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  (పింగళి సూరన కళాపూర్ణోదయమందుఁ గాళికామాత మహిమ[బ్రహ్మవాక్కు, సరస్వతీవరము]చే సుముఖాసత్తిగ మాఱిన మణిస్తంభుఁడు...మణిస్తంభునిగ మాఱిన సుముఖాసత్తి వలన...గర్భముం దాల్చి, కళాపూర్ణునిం బ్రసవించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

  తరుణిగ మాఱిన పురుషుఁడు,
  పురుషునిగను మాఱినట్టి ముదిత సురతినిన్
  మురియఁగఁ; దరుణిగ మాఱిన
  పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్!

  రిప్లయితొలగించండి


 18. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

  హరుడా పూరుషు డయ్యెను
  హరియే సతికాగ పుట్టె నయ్యప్పగదా !
  సిరిమగడు పురుషు డేకద
  పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్.  రిప్లయితొలగించండి
 19. 4, ఆగస్టు 2015, మంగళవారం
  శ్రీ కృష్ణ దేవరాయలు వారి 506 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం

  జైశ్రీరామ్.

  ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
  తేదీ 07 - 08 - 2015 న
  సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి
  506 వ పట్టాభిషేక దినోత్సవమును
  శ్రీ గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
  సాయంత్రం 4 గంటలకు
  జరిపించ తలపెట్టినారు.
  ఈ కార్యక్రమమున తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ సాహితీవేత్తలుపాల్గొనుచున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించగలిన, వారికృషిని ప్రశంసించుచు పరిశ్రమించిన ఎనిమిది మందికి అష్ట దిగ్గజముల పేర సత్కారములను కూడ అందింప నున్నారు.
  కార్యక్రమము జరుగు చిఱునామా:-
  శ్రీ గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి,
  15, మొదటి దశ. (1St Phase)
  జయప్రకాశ నారాయణ్ నగర్,
  వయా మియాపూర్,
  హైదరాబాదు,
  500 049.
  దూర వాణి. 9177945559.
  ఈ సందర్భముగా
  సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
  బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
  జై హింద్.

  రిప్లయితొలగించండి
 20. ప్రయాణంలో ఉండి మీ పూరణలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
  చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు....
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  మిస్సన్న గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  డా. బల్లూరి ఉమాదేవి గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  శ్రీపతి శాస్త్రి గారికి,
  కె. ఈశ్వరప్ప గారికి,
  మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.
  ******
  అన్నపరెడ్డి వారూ,
  శ్రీకృష్ణ దేవరాయలవారి 506 వ పట్టాభిషేక దినోత్సవమును గురించిన వివరాలు అందించినందులు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 21. ("చంద్రమా మనసో జాతః")

  కరచుచు మోడీ నిప్పుడు
  తిరకాసులు బెట్టి బూతు తిట్టులనిడుచున్
  తిరిగెడు చంద్రుండను తొలి
  పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్

  రిప్లయితొలగించండి
 22. మరునిన్ కొలిచెడు ప్రియసతి
  పరుపున చేరుచు మగనిని పరిపరి పిలువన్,
  తరచుగ పత్నిని కూడగ
  పురుషుఁడు, గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్

  రిప్లయితొలగించండి