గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భూసారపు నర్సయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ సందేహము సరియైనదే. హిమవంతుఁడు శివునకుం బార్వతి నిచ్చి పెండ్లి సేసినాఁడు. నేను పార్వతికి శివుని నిచ్చి పెండ్లి సేసెనని వ్రాసితిని. దీనిని సవరించుచుంటిని.
శ్రీ కంది శంకరయ్య గారు, సుబ్బారావు గారి పద్యంలో రెండవ పాదంలో భ్రుకుటి శబ్దమే సాధువు, దాన్ని భృకుటిగా మారిస్తే యతి భంగమవుతుంది కదా, కనుక దానినలాగే ఉండనిద్దాం.
డా. విష్ణునందన్ గారూ, అద్భుతమైన పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు. సుబ్బాగారు పూరణలో ‘భ్రుకుటుని’ అన్నారు. నా దృష్టి అంతా ‘టు’ మీద ఉండి దానిని ‘భృకుటిని’ అని చెప్పాలని భ్రు, భృ లలో ఏది టైపు చేస్తున్నానో గమనించలేదు. నా పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, ‘నయనముల్+ఒకచో= నయనము లొకచో’ అవుతుందని, యడాగమం రాదని చెప్పాను. మీరు మళ్ళీ అదే పొరపాటు చేసారు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘చలువఁనకల్క"...? ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నికరము ప్రకృతి యందము
రిప్లయితొలగించండివికటించగ భ్రమణ మందు పెను జీకటియౌ
నొక కక్షను జేరి నిలువగ
ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్
రిప్లయితొలగించండిసుకుమారి చ౦ద్రముఖిలో
నొకచో సూర్యుండు జంద్రు డొప్పిరి జ౦టన్
భ్రుకుటిని తిలకము రవిగా
ప్రకటిత మయె చంద్రుడింక వదనమునండున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, మూడవ పాదాలలో గణదోషం. ౧) నికరమ్ము ప్రకృతి యందము, ౨) ...నొక కక్షఁ జేరి నిలువగ... అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వికటించగ వైరాగ్యము,
రిప్లయితొలగించండిప్రకటించిన విశ్వరూపుఁ బ్రార్థుడుఁ గనియెన్
వికసించు పద్మ నయనము
లొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విశాల కనుగవ’ అనడం దుష్టసమాసం. ‘విభా| ప్రకట నయన ద్వయముతో’ అందమా?
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి ,మిత్రులకు అభివందనములతో ;
రిప్లయితొలగించండిపకపక నవ్వుచు మోహిని
సుకరముగా సుధను బంచఁ జొక్కుచుఁ ద్రిదశుల్
సుఖముగ మెసగెడు వేళ
న్నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్ !
నికరముగా జగమున్ కడు
రిప్లయితొలగించండిసుకరముగానేలు స్వామి సొగసగు కన్నుల్
ప్రకటమ్మయ్యెన్, పలికితి
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.
భూసారపు నర్సయ్య గారి పూరణ....
రిప్లయితొలగించండిప్రకటించె విశ్వరూపము
సకలము దనయందుఁ దోఁచఁ జక్రధరుండే
యకటా నయనద్వయముగ
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
లోకంబులు లోకేశులు
రిప్లయితొలగించండియేకాలమునొదలక నుతియించెదరోనా
సకలార్ధసాక్షి చక్షువు
లొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(హిమవంతుఁడు శివపార్వతుల కళ్యాణమునకు దేవతల నాహ్వానింపఁగ సూర్యచంద్రులును వచ్చిన వైనము)
సకలాత్ముని హరునిఁ దన పు
త్రిక గిరిజకు నిచ్చి పెండిలిం దగఁ జేయన్
సక లానిమిషులఁ బిలువఁగ
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి(శివుఁడు త్రిపురాసుర సంహారముం జేయుటకుఁ బూనుకొనఁగా భూమి రథముగాను, సూర్యచంద్రులు రథచక్రములుగాను, వేదము లశ్వములుగాను, బ్రహ్మ సారథిగాను, నొప్పిన సందర్భము)
ప్రకట త్రిపురాసుర హిం
సకునకు సారథిగ విధియు, స్యందనమౌ భూ
మికిఁ జక్రద్వయముగఁ దా
మొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసకలార్థంబుల నొసగెడు
తొలగించండివికచాబ్జానని భవాని విశ్వవినుత నా
సిక సంపంగి నయనముల్
నొకచో సూర్యుడును జంద్రుడొప్పిరి జంటన్
నా మూఁడవ పూరణము:
రిప్లయితొలగించండి(దేవదానవ యుద్ధమందు రాక్షసులు దేవతల నోడించి యమరావతిని స్వాధీనము జేసికొనఁగ సూర్యచంద్రులతోఁ బాటుగ దేవతలందఱును విష్ణువును శరణు కోరి పలికిన సందర్భము)
వికలాత్ములైన సురలా
యకలంకుని హరినిఁ జేరి యసురుల కృతమున్
సకల మెఱిఁగించుచుండఁగ
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!
సకలురుచూచుచు నుండగ
రిప్లయితొలగించండిఒకచో సూర్యుడును జంద్రుడొప్పిరి జంటన్
సుకుమారుడు గణ నాథుడు
తకతకనాట్యంబు జేయు తరుణమునందే|
వల్లూరు మురళి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘లోకేశులు+ఏకాలము’ అన్నప్పుడు యడాగం రాదు. ‘వదలక’ను ‘ఒదలక’ అన్నారు. నా సవరణ.... ‘లోకేశ్వరు| లేకాలము వదలక...’
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
ఒక సందేహం...‘హిమవంతుడు శివునకు తన కూతురు నిచ్చాడా? శివుణ్ణి తన కూతురుకు ఇచ్చాడా?’
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సకలార్థ సిరులు’ దుష్ట సమాసం. ‘సకలార్థంబుల నొసగెడు’ అనండి. ‘వికచాబ్జానన’ సరైన రూపం. ‘నయనముల్+ఒకచో= నయనము లొకచో’ అవుతుంది. ‘నా|సిక సంపంగి కనులఁ గన| నొకచో...’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సకల జనులు గనుచుండగ| నొకచో...’ అనండి.
నా నాలుగవ పూరణము:
రిప్లయితొలగించండి(ఒకానొకప్పుడు మహిష సంహారమునకై సురనారీ తేజము దేవిగా మారఁగా, సూర్యచంద్రు లామె నేత్రద్వయముగఁ బ్రకాశించిన సందర్భము)
సకల సుర వధూ తేజ
స్సకలాసుర హంత్రి దేవి చక్షుద్వితయ
ప్రకటీకృత దీప్తులుగా
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!
ధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండిమీ సందేహము సరియైనదే. హిమవంతుఁడు శివునకుం బార్వతి నిచ్చి పెండ్లి సేసినాఁడు. నేను పార్వతికి శివుని నిచ్చి పెండ్లి సేసెనని వ్రాసితిని. దీనిని సవరించుచుంటిని.
సకలేశుఁడు హరునకుఁ బు
త్రిక గిరిజను నిచ్చి పెండిలిం దగఁ జేయన్
సక లానిమిషులఁ బిలువఁగ
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిసకల జగమ్ములు తనలో
వికసింపగ జేసి జూపి విశ్వంభరుడే
ప్రకటించెను నయనములని
ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ నాల్గవ పూరణ, సవరించిన మొదటి పూరణ బాగున్నవి. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివికచాంభో రుహ లోచని
భ్రుకుటుని నేదిలక మిడగ బోలెను రవియు
న్వికసితమౌ చంద్రుండును
నొ కచో సూర్యుడును జంద్రు డొ ప్పిరి జంటన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'భృకుటిని' అనండి.
ఒక కంట రౌద్ర రస మిం
రిప్లయితొలగించండికొకటన్ శృంగార రసము నువిద రణమునన్
బ్రకటించె నరిని హరిఁ గని
యొకచో సూర్యుఁడును జంద్రుఁడొప్పిరి జంటన్!!!
సకలంబును హరిలోగని
రిప్లయితొలగించండిముకుళించె నరుడు కరములు ముగ్ధుండగుచున్
ప్రకటముగా కన్నులలో
నొకచో సూర్యుడు ను జంద్రుడొప్పిరి జంటన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారు, సుబ్బారావు గారి పద్యంలో రెండవ పాదంలో భ్రుకుటి శబ్దమే సాధువు, దాన్ని భృకుటిగా మారిస్తే యతి భంగమవుతుంది కదా, కనుక దానినలాగే ఉండనిద్దాం.
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు డా. విష్ణు నందన్ గారూ! మీ పూరణము సత్యభామాదేవి వీరశృంగారముల వర్ణనతో నలరారుచున్నది.
రిప్లయితొలగించండినాకు మీ పూరణముం జూడఁగనే..."హరిఁ జూచుం బరుఁ జూచు...." ననెడి పద్యము స్ఫురణమునకు వచ్చినది.
అభినందనలు.
సకలము నెఱిగిన శ్రీహరి
రిప్లయితొలగించండిపకపక నవ్వుచు నమృతముఁసొగసగు రూపున్
చకచక పంచగ ,గాంచుచు
నొకచో సూర్యుడును జంద్రుడొప్పిరి జంటన్.
2.ఒక కంటను వేడి వెలుగు
రిప్లయితొలగించండినొక కంట చలువఁనకల్క నొసగెడి శౌరిన్
నికటమున నరుడు జూడగ
నొకచో సూర్యుడును జంద్రు డొప్పిరి జంటన్.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఒక పతి జన్మదినమునకు
ప్రకటించిన సెల్లుగాక పసిడి గొలుసు కా
నుకగానిడ సతిముఖమున
ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఒక పతి జన్మదినమునకు
ప్రకటించిన సెల్లుగాక పసిడి గొలుసు కా
నుకగానిడ సతిముఖమున
ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.
చకచక గీసెను బొమ్మల
రిప్లయితొలగించండినొకనొక గ్రహణమ్ము జూప నొక "ఎగ్జాం " లో
సుకుమారి కాగితమ్మున
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.
డా. విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
సుబ్బాగారు పూరణలో ‘భ్రుకుటుని’ అన్నారు. నా దృష్టి అంతా ‘టు’ మీద ఉండి దానిని ‘భృకుటిని’ అని చెప్పాలని భ్రు, భృ లలో ఏది టైపు చేస్తున్నానో గమనించలేదు. నా పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
‘నయనముల్+ఒకచో= నయనము లొకచో’ అవుతుందని, యడాగమం రాదని చెప్పాను. మీరు మళ్ళీ అదే పొరపాటు చేసారు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘చలువఁనకల్క"...?
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగున్నది. అభినందనలు.
అకల్క==వెన్నెల
రిప్లయితొలగించండిఅనే అర్థంలో వ్రాశానండీ.
వికలంబయ్యెను సైన్యము
రిప్లయితొలగించండిబకవైరియును విజయుండు బవరము నందున్
చకచక కదలన్ కనుగొన
నొకచో సూర్యుఁ డును చంద్రుడొప్పిరి జంటన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లోకంబులు లోకేశ్వరు
రిప్లయితొలగించండిలేకాలము వదలక నుతియించెదరోనా
సకలార్ధసాక్షి చక్షువు
లొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్
లోకంబులు లోకేశ్వరు
రిప్లయితొలగించండిలేకాలము వదలక నుతియించెదరోనా
సకలార్ధసాక్షి చక్షువు
లొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్
రిప్లయితొలగించండిసతి యనసూయ చారుతమ సద్గుణ రాశి విశేష సాధుశీ
లి ,తపసి యాత్రిమూ ర్తులను లీలగ బాలుర జేసె జె చ్చెర
న్బతి పదసేవ తత్పరత బ్రాణ సమున్శి రమందు నక్కటా
హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్
(ఈ పై పద్యము మాతమ్ముడు ,రాయపూర్ నివాసి వ్రాసిన ది . మన బ్లాగు
చూసి కుతుకముతో వ్రా సినది . . మిత్రులు తమ స్పందన తెలియ
జేయగో ర్తా ను , )
నికటమ్మిషాని జేరుచు
రిప్లయితొలగించండిపకపక నవ్వుచు గబగబ వ్రాయగ పలకన్
చకచక నవగ్రహంబుల
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్
ఇషాని = మా మనుమరాలు
(భానువారము ప్రక్కనే సోమవారము కదా!)
రిప్లయితొలగించండిసకరుణుడు పెనిమిటి యుదయ
ము కటంకటుడగును రేయి ముద్దుగులుకునే
సకియ! వినవే జిలేబీ
యొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!
జిలేబి
అకటా! సూర్యుని కప్పగ
రిప్లయితొలగించండినికటముగా చంద్రుడరిగె నిర్మోకమునన్
సకియా! సూర్యుని గ్రహణము
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్
నిర్మోకము = ఆకాశము