6, ఆగస్టు 2015, గురువారం

పద్య రచన - 976

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. వక్కలు నాకులు కదళిని
  చక్కగ మనపూజ లందు సౌభాగ్య మటన్
  మిక్కిలి తాంబూ లములను
  మక్కువగా పంచి నంత మంగళ ప్రదమౌ

  రిప్లయితొలగించండి
 2. ఆ.వె:ఆకు వక్క కదళి నందముగా కూర్చి
  అవని యందు యిత్తు రతివ లెల్ల
  దాని వలన జన్మ ధన్యమౌ నంచెల్ల
  తరుణు లొసగు చుంద్రు తమ్ములముల.

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘సౌభాగ్య మనన్’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ఆకులందున పోకల నమరజేసి
  ఫలము లెవియైన నుంచుచు పళ్ళెమందు
  ముత్తయిదువుల కీయగ ముదితలెల్ల
  పండు తాంబూల నోమదే, ఫలమునిచ్చు.

  రిప్లయితొలగించండి
 5. ఆకువక్క తోడ అరటిబండును బెట్టి
  బూజ జేయు చుంద్రు పుడమి జనులు
  పర్వదినము లందు పరితోషముగ నివి
  పంచురతివ లంత వాయనముగ!!!

  ఆకు వక్క కదళి నేకదంతుని వోలె
  రూపు దాల్చెనదివొ చూపులకును
  పాప జన్నిగట్టు పరమేశు తనయుడు
  ఎట్టి రూపు నైన నిట్టె నొదుగు!!!

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘తాంబూల నోము’ దుష్టసమాసం కదా! ‘పండు తాంబూలముల నిడ ఫలము నిచ్చు’ అందామా?
  *****
  శైలజ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. ‘ఎట్టిరూపు నైన నిట్టె యొదుగు’ అనడం బాగుంది. (ఇట్టె యొదుగు- సాధురూపం). అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. తమల పాకులు వక్కలు తమము తోడ
  కదళి ఫలములు బెట్టియు కాంత లచట
  యిత్తు రెపుడును దాం బూ ల మిచ్చా కలిగి
  తనర సౌభాగ్య మయ్యది తమకు కోరి

  రిప్లయితొలగించండి
 8. ఆకువక్కల తోడుత నరటిపండు
  పళ్ళె రమ్ములో ననునిచి పరవశముగ
  విందులకుపిల్చు చుందురు బందువులను
  పెండ్లి పేరంటములలోన పేర్మితోడ

  రిప్లయితొలగించండి
 9. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘తమముతోడ’ అన్నదానిని ‘తమి దలిర్ప’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. వేడ్క తోడ పిలుచు పేరంటములలోన
  ఆకు వక్క తోడ నరటి జేర్చి
  ముత్తయిదువ కిచ్చు ముదమైన సంస్కృతి
  ధరణి లోన భరత ధాత్రి యందు.

  రిప్లయితొలగించండి
 11. విందు-వినోదమందు మనవేల్పులముందును|ఆకువక్కలున్
  అందునుజేరుచున్-అరటి నందరి కందగ పంచబూనగా?
  నిందలురావు జూడ|”ననునిత్యమువాడుమటంచు సూచనల్
  బంధమె శంకరయ్య గురువర్యులుజూపిరి చిత్రమందునన్”|
  2.ఆకులు,వక్కలున్,అరటి ఆదరణంబగు నాస్తి పాస్తులే
  సాకునుసంతసంబు సరసాలకుమూలపు నౌషదంబుగా
  ఏకుల మైన నెంచగల నిత్య సుఖాలకు మూలమన్న?ఈ
  లోకులు శోభనానతమలోపము మాన్పగవచ్చిచేరులే|
  6.8.15

  రిప్లయితొలగించండి
 12. గురువుగారికి నమస్కారం. నేను ఈ మధ్యనే అంటే గత కొద్దిరోజులుగా పద్యరచనకి సంబంధించిన విషయాలను నేర్చుకుంటున్నాను. ఆ అపరిపక్వతతోనే ఒక తేటగీతి పద్యము రాయడానికి ప్రయత్నించాను. దయచేసి పరిశీలించి నా తప్పులు తెలియచేయగలరు.


  తే.గీ: లేత పచ్చాకు రేయినలుపున వక్క
  అందముగ అమరేనందు అరటి పండు
  ముచ్చట గొలుపునది ముద్దరాలి తమ్మ
  వచ్చుచున్నదది గాద వరమునోము

  రిప్లయితొలగించండి
 13. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘వక్కలున్ అందును, జేరుచున్ అరటి, వక్కలున్ అరటి’ మొదలైన చోట్ల విసంధిగా వ్రాశారు. ‘మూలపు టౌషధంబు’ అనాలి.
  *****
  వేదుల సుభద్ర గారూ,
  స్వాగతం! మీ పద్యరచనాభ్యాసానికి ఈ బ్లాగు చక్కని ఒజ్జపలక. మీ ఆసక్తిని కొనసాగించండి. ఈ బ్లాగు మీకు అన్నివిధాల సహకరిస్తుంది.
  మీ మొదటి ప్రయత్నం ప్రశసార్హమైనది. ఒకటవ మూడవ పాదాలలో యతి తప్పింది. నాల్గవపాదంలో గణం తప్పింది. మీ పద్యానికి నా సవరణ......
  లేత పచ్చియాకులు వక్కలే కలియగ
  నందముగ నమరెనుగద యరటిపండ్లు
  ముచ్చట గొలుపుచుండగ ముద్దరాలు
  వచ్చుచున్నదిగద నోమి వరముకోరి.

  రిప్లయితొలగించండి
 14. ధన్యవాదాలు గురువుగారు. మీ బ్లాగులో ఇంతకుముందు నేను గళ్ళనుడికట్టు చేసేదాన్ని. ఈ మధ్యనే శ్రీ కట్టుపల్లి ప్రసాద్ బాబాయ్ గారి ధర్మమా అని పద్యరచనకు ప్రయత్నిస్తున్నాను. మీ సవరణకు నా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. అన్నమారగించి యరటి పండునుదిని
  వక్క నోటఁ బెట్టి పంట నొక్కి
  ఆకు తొడిమఁ ద్రుంచి యందులో జూడగ
  నక్కరైన సున్న మసలు లేదు!

  రిప్లయితొలగించండి

 16. శ్రీగురుభ్యోనమ:

  అదిగో కనుగొనుమా కరి
  వదనుని రూపంబు వోలె పళ్లెములోనన్
  కదలీ ఫలములు గలదై
  కుదురుగ తాంబూల మమరె(మలరె) కోమల హృదయా

  రిప్లయితొలగించండి
 17. మాస్టరుగారూ ! ధన్యవాదములు....చిన్న సవరణతో.....


  ఆకులందున పోకల నమరజేసి
  ఫలము లెవియైన నుంచుచు పళ్ళెమందు
  ముత్తయిదువుల కీయగ ముదితలెల్ల
  పండు తాంబూల మను నోము, ఫలమునిచ్చు.

  రిప్లయితొలగించండి
 18. ఘనులకు, కవిజనులకు, నే
  వినయముతో వందనములు వేలుగ జేతున్,
  ధనమును, తాంబూలములో
  ననువుగ జేరిచి యొసగెద 'యందు'మటంచున్.

  రిప్లయితొలగించండి
 19. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ నిశిత పరిశీలనాదృష్టి ప్రశంసనీయం. మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ సవరణ బాగుంది. సంతోషం!
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి