11, ఆగస్టు 2015, మంగళవారం

సమస్యాపూరణ - 1757 (మన్మథుండు హైమవతికి మగఁడు గాదె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మన్మథుండు హైమవతికి మగఁడు గాదె.

21 కామెంట్‌లు:

 1. కలిత కైలాస శైలాగ్ర ఘన విహారి
  నిరతర తపో నిమగ్ను వినిర్మలుండు
  నెంచి చూడంగ పార్వతీ హృదయపీఠి
  మన్మధుండు, హైమవతికి మగఁడు గాదె.

  రిప్లయితొలగించండి
 2. శ్రీగురుభ్యోనమ:

  పంచ శరముల సంధింప పొంచె నెవడు?
  సాయ మందించె నెవరికపాయమెంచి?
  రతికి నేమగు మదండు? క్రమము గాను
  మన్మథుండు, హైమవతికి, మగడు గాదె.

  (అపాయమని తెలిసియూ ఎవరికి
  సహాయము జేసినాడు)

  రిప్లయితొలగించండి


 3. తే.గీ: తపము భంగము చేయ మదనుడు రాగ
  ఫాలనేత్రము తెరువంగ భస్మ మయ్యె
  భస్మ మొనరించిన శివుడు,వరుసఁరతికి
  మన్మథుండు హైమవతికి మగడు గాదె.

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. చెరకు వింటిని ధరియించు దొర యెవండు?
  ఫాలుడెవరికి నాథుడు బాల జెపుమ ?
  రతికి యేమగు సిరిపట్టి? క్రమము గాను
  మన్మథుండు, హైమవతికి, మగడు గాదె!!!

  రిప్లయితొలగించండి
 6. ప్రేమికుల మధ్య ప్రేమను బెంచు నతడు
  మన్మ ధుండు, హైమవతికి మగడు గాదె
  సకల శుభములు గలిగించు శంకరుండు
  నాది పితరుడు జగమున కతడె సుమ్ము

  రిప్లయితొలగించండి
 7. ముంజకేశుడౌ శౌరికి పుత్రుడెవరు?
  ఇందుమౌళి జటాధరు డెవరి భర్త?
  పల్కు జవరాలి కేమగు పద్మ యోని?
  మన్మథుండు, హైమవతికి, మగఁడు గాదె

  రిప్లయితొలగించండి
 8. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  అగ్నిగుండము నందున భగ్నమైన
  సతి కపర్దిని జేరగ సహకరించె
  మన్మథుండు; హైమవతికి మగఁడు గాదె
  వదలె తపమును మరల వివాహమాడ

  రిప్లయితొలగించండి
 9. తపము జేసెడు శివునకు తపన తోడ
  పుష్ప తైలాదు లందించి ముదము నంద
  కనులు మూసినన్ తెరచినన్ తనను విడని
  మన్మథుండు హైమవతికి మగఁడు గాదె!

  రిప్లయితొలగించండి

 10. బూది యైనట్టి మరుడు విభూతి యగుచు
  శివుని మేనిపై మెరయుచు చిత్తమందు
  కామకాంక్షలు రేపిన ఘనుడతండె
  మన్మథుండు. హైమవతికి మగఁడు గాదె
  పరమ శివుడు పరిణమయి సురలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 11. శివుని తప భంగ మొనరించె శివ తెలుపగ
  మన్మథుండు , హైమవతికి మగడు గాదె
  భస్మ మొనరించి యాతని భార్య వేడ
  మరల ప్రాణమ్ము నిచ్చిన మహిత మూర్తి

  రిప్లయితొలగించండి
 12. పూలశరములన్ గొట్టగా పూజ్య శివుని
  మన్మధుండు హైమవతికి మగడుగాదె,
  యయిన వానిని గొట్టెగా,నగ్నినేత్ర
  మునను,పిదపనా పార్వతిన్ పొంద గోరె

  తనదు బాణాల మహిమను తలచి మదిని
  మన్మధుండు,హైమవతికి మగడుగాదె
  మున్నెతప్పేది లేదని ముదిత నామె
  పైని శివునికి వలపదే వరల గొట్టె

  శివుడు కన్ను తెరచియును చేసెబూది
  మన్మధుండు,హైమవతికి మగడుగాదె
  శివుడు నంచెంచి,కుసుమాల చేతనేయ
  రతియు,పతినిగావగ వే మొరలను వెట్టె

  రతితోడ,వసంతుడు,రమ్యసఖుని
  తోడవచ్చిశివుని పూల,తూలగొట్టె
  మన్మధుండు-హైమవతికి మగడుగాదె
  యతిని గాల్చినాడు నపుడు,నమరులడర

  హైమవతియును తపమున నభవుగొలిచి
  తుదకు నాతని భార్యయై తుళ్ళెగాదె
  ముందుజన్మాన పతియౌట మూడుకనుల
  మన్మధుండు హైమవతికి మగడుగాదె

  రిప్లయితొలగించండి
 13. “శివుని తపమును మాన్పగసిద్దబడెను
  మన్మథుండు”|హైమవతికి మగడుగాదె
  రతిని పెళ్ళాడి| సమ్మతిరతికిజనుల
  కుసిని గొల్పెడి యూహల రసికు డతడు|
  2.తారకాసుర వధ నెంచి తపసుమాన్ప
  మూలమెవ్వరు?శివునికిముందుజేరి
  భస్మ మైనట్టి దీనతా విస్మయుండె
  మన్మ థుండు|”హైమవతికిమగడు గాదె.

  రిప్లయితొలగించండి
 14. Bhuvuni rudrakshu chupuche buudhi yaiah
  manmadhundu himavathi ki magadu kadhe
  paramashanthudu shambhudu pavanundu
  nirvikarudu nirguna nichalundu.

  రిప్లయితొలగించండి
 15. భువిని రుద్రాక్షు చూపుచే భూధి యయ్య్
  మన్మధుండు హైమావతి కి మగడు కాదే
  పరమాశాంతుడు శంబుడు పావనుండు
  శాంతుడలిగిన కలుగదా శాస్తి అట్లు

  రిప్లయితొలగించండి
 16. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  మగఁడు గద రతీదేవికి మన్మథుండు!
  హైమవతికి మగఁడు గాదె
  హరుఁడు! రమకు
  మగఁడు గాదె మురహరుండు! మగఁడు గాదె
  వాణికి చతుర్ముఖుండు! వివాద మేల?

  రిప్లయితొలగించండి
 17. జడల జుట్టు వాడును, బూది యొడల వాడు,
  నేన్గు తోలు బట్టైనవా, డిల్లు లేని
  వాడు, మూడుకన్నులవాడు, కాడటె జిత
  మన్మధుండు? హైమవతికి మగడు గాదె?

  రిప్లయితొలగించండి
 18. కవిమిత్రులకు నమస్కృతులు.
  ప్రయాణంలో ఉన్నాను. అందువల్ల వెంట వెంటనే. స్పందించలేకపోయాను. మన్నించండి.
  చక్కని పూరణ లందించిన కవిమిత్రులు.......
  సంపత్ కుమార్ ‍శాస్త్రి గారికి (తపోనిమగ్న... అనండి),
  శ్రీపతి శాస్త్రి గారికి,
  డా. బల్లూరి ఉమాదేవి గారికి (అన్వయ లోపం),
  శైలజ గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  కెంబాయి తిమ్మాజీరావు గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  మల్లెల సోమనాథ శాస్త్రి గారికి (4వ పూరణలో 'రతితోడ' అన్నచోట గణదోషం),
  కె. ఈశ్వరప్ప గారికి (1వ పూరణలో 'సిద్ధపడెను అనండి. కుసిని.....?, 2వ పూరణలో అన్వయం?),
  గుండు మధుసూదన్ గారికి,
  'ఊకదంపుడు' గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.
  ********
  బూసారపు నర్సయ్య గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు. స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కొన్ని టైపు దోషాలున్నవి.

  రిప్లయితొలగించండి