16, ఆగస్టు 2015, ఆదివారం

పద్య రచన - 981

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. ఘనకార్యంబులఁ జేయుట
    మనకెట్టుల సాధ్యమగును మానితుఁడగు చి
    త్ఘనరూపుఁడు శ్రీకృష్ణుని
    కొనవేటికి సాటిరాము గొప్పలదేలో ?

    రిప్లయితొలగించండి
  2. హిల్లునెందుకునెత్తె పిల్లవాడప్పుడు
    ****అందించ వచ్చుగ నంబరిల్ల?
    బటరునేలతినెను బాలుఁడు ప్రియముగ
    ****పీజాలు దొరకని రోజు కలదె?
    స్నేకుపైకెగెరును చిత్రమె వినినంత
    ****బ్లూక్రాసు వారలు ముందు లేరె?
    శారీలనెందుకు చోరీలు జేసెను
    ****ర్యాగింగు సేయుట రాంగుకాదె?

    ఒక్క చోట తాబుట్టి వేరొక్క చోట
    పెరిగె, నాను లోకలు కాదె తరచి చూడ
    కొలువు పొందెడి వేళలో సులువు కాదు
    మమ్మి! నీవు జెప్పు కథ నిజమ్ము కాదు!!

    రిప్లయితొలగించండి
  3. జిగురు వారి ఆంగ్ల పదమిళితము చమత్కారంగా శోభిల్లుతోంది.

    రిప్లయితొలగించండి
  4. చిన్న గొడుగు చాలు చిటపట చినుకులు
    కురియు వేళ మాకు కొండ లేల?
    కొండ లెత్తగలవు కొంటెకృష్ణుడనీవు
    నీదు లీల పొగడ నాదు వశమె

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    బహుకాల దర్శనం! సంతోషం!
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  6. 1 ఆ.వె:వజ్రి యలుక చెంద వర్షమ్ము కురువగా
    భయము చెంది గోప బాలురెల్ల
    నటునిటు తిరుగంగ నవ్వుచూ కృష్ణుండు
    కొన గోటి తోడ కొండ నెత్తె.
    2.ఆ.వె: వజ్రి కోపగింప వర్షముధృతమయ్యె
    గోపకాంత లదర,గోవులెల్ల
    బెదరు చుండ పలికె భీతి వలదటంచు
    శౌరి,యపుడె తాను శైల మెత్తె.

    రిప్లయితొలగించండి

  7. 1 ఆ.వె:వజ్రి యలుక చెంద వర్షమ్ము కురువగా
    భయము చెంది గోప బాలురెల్ల
    నటునిటు తిరుగంగ నవ్వుచూ కృష్ణుండు
    కొన గోటి తోడ కొండ నెత్తె.
    2.ఆ.వె: వజ్రి కోపగింప వర్షముధృతమయ్యె
    గోపకాంత లదర,గోవులెల్ల
    బెదరు చుండ పలికె భీతి వలదటంచు
    శౌరి,యపుడె తాను శైల మెత్తె.

    రిప్లయితొలగించండి

  8. 1 ఆ.వె:వజ్రి యలుక చెంద వర్షమ్ము కురువగా
    భయము చెంది గోప బాలురెల్ల
    నటునిటు తిరుగంగ నవ్వుచూ కృష్ణుండు
    కొన గోటి తోడ కొండ నెత్తె.
    2.ఆ.వె: వజ్రి కోపగింప వర్షముధృతమయ్యె
    గోపకాంత లదర,గోవులెల్ల
    బెదరు చుండ పలికె భీతి వలదటంచు
    శౌరి,యపుడె తాను శైల మెత్తె.

    రిప్లయితొలగించండి
  9. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపద్యం చివరిపాదంలో గణదోషం... ‘కొండ నెత్తెను కొనగోటితోడ’ అందామా?

    రిప్లయితొలగించండి
  10. నాటక మాడిన నటుడే
    నీటుగ తానటులె వచ్చె నీ వేషముతో
    గోటను గోవర్ధన గిరి
    మాటున నే వానలోన మరితడవకనే.

    రిప్లయితొలగించండి
  11. కేజీ పిల్లడి క్వశ్చెన్స్
    క్రేజీగా వేసిరి కనరే యిటనే
    ఆ జిగురు వారి పద్యము
    వాజీ యనునట్టులుండె వహవా ! వహవా !

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘జిగురు’ వారిని ప్రశంసించిన పద్యం రెండవపాదంలో గణభంగం జరిగింది. ‘కనరే యీచోటన్’ అందామా?

    రిప్లయితొలగించండి
  13. వాన పడుచుండె జూడుము పటము నందు
    తడవ కుండగ నుంటకై తమ్ము డొకడు
    కొండ నెత్తెను దనగోటి కొనను దోడ
    బలము గలవాడు గాభావ మలరె నాకు

    రిప్లయితొలగించండి
  14. వానకాలమందు మేనంత తడచిన
    జలుబు చేయు గొడుగు చెంతలేదె
    అనుచు ప్రశ్నలిడిన ఆబాల కృష్ణుండు
    కొండనెత్తెను కొన గోటి తోడ

    రిప్లయితొలగించండి
  15. వానకాలమందు మేనంత తడచిన
    జలుబు చేయు గొడుగు చెంతలేదె
    అనుచు ప్రశ్నలిడిన ఆబాల కృష్ణుండు
    కొండనెత్తెను కొన గోటి తోడ

    రిప్లయితొలగించండి
  16. వర్షముఁగురిపించ వజ్ర ధరుడువేగ
    గొడుగు లందు కొనిరి గొల్ల వారు
    కొండనెత్తెసుమ్మ కొంటె కృష్ణయ్య తా
    కాంచి శతమఖుండు ఖంగుదినగ

    రిప్లయితొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    గోగణమ్ముఁ గాచె గోవర్ధన మ్మెత్తి
    ద్వాపరమ్మునందు వ్రజవిభుండు!
    వర్షమందు తననె పర్వతమ్మునఁ గాచె
    కలియుగమ్మునందు ఘన నటుండు!!


    రిప్లయితొలగించండి
  18. మాస్టరుగారూ ! దోషమును గమనించలేదు...సవరించినందులకు ధన్యవాదములు...

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులు జిగురువారు సీసపద్యమం దాంగ్ల పదములకు జిగురు బాగుగఁ బూసి యూడిరాకుండ నతికించినారు. పద్యమం దా పదములు చక్కఁగ నతుకఁబడి యందముగ నున్నవి. వారు చమత్కారజనకమైన పద్యము నందించినారు. వారికి నా యభినందనలు!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కొండ నెత్తెను తన కొనగోటితోడ’ అనండి
    *****
    వల్జూరి మురళి గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారికి నమస్సులు. మురళీ గారి పద్యం రెండవ పాదంలో యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  22. అన్నపరెడ్డి వారూ,
    ధన్యవాదాలు.
    ******
    మురళీ గారూ,
    మీ పద్యం రెండవపాదంలో యతి తప్పింది. ఆ పాదాన్ని ‘చేయు జలుపు గొడుగు చెంత లేదె’ అని మార్చండి.

    రిప్లయితొలగించండి
  23. కుడిచేతను కొనగోటను
    బడాయిగా నట్టముక్క పర్వత మనుచు
    న్నిడెనీ నాటక కృష్ణుడు
    జడఁగూడను విడడితండు జగమేమాయా!

    రిప్లయితొలగించండి
  24. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి