20, ఆగస్టు 2015, గురువారం

పద్య రచన - 985

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(నిన్న ఇవ్వాలనుకొని మరిచిపోయిన చిత్రం)

18 కామెంట్‌లు:

 1. నాగుల చవితని తరుణులు
  భోగములకు పాలుబోసి భోజ్యము లిడగన్
  సాగిల బడిమ్రొక్కి నంతనె
  వేగమె కరుణించు ననెడి వేలుప టంచున్

  రిప్లయితొలగించండి

 2. నిన్న ఇచ్చిన నేమి ఇవ్వకున్న నేమి !
  నేల పాలైన పాలు తిరిగి వచ్చునా !
  అమ్మల నమ్మకములకు హద్డులేదాయే !
  ఊపిరాడక లోని పాము పాలలో మునిగె :)


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. నాగుల చతుర్ధి రోజున
  త్రాగుటకై నాగరాజు తరుణులు బాలన్
  వేగమె పోతురు పుట్టన
  బాగని దామదిని దలచి ప్రతివ ర్షమునున్

  రిప్లయితొలగించండి
 4. నాగులచవితి పర్వాన బాగుఁగోరి
  పుట్టనర్చించిక్షీరమ్ముపోయు వేళ
  విఘ్న రాజును నేనంచు వెలసె యున్న
  దొద్దు దేవరకిడరమ్మతొల్లిపూజ!
  ( పుట్ట మీద ద్యోతకమవుతున్న గణేశప్రతిమను ఓ మారు గమనించండి )

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘చవితి+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘నాగుల చవితికి’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘సాగిలబడి మ్రొక్కగనే’ అనండి.
  *****
  జిలేబీ గారూ,
  _/\_
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ప్రైతి వర్షమునన్’ అనండి. టైపాటు కావచ్చు!
  *****
  గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పరిశీలనాశక్తికి నమోవాకాలు! మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వెలసె నున్న’ అనండి.

  రిప్లయితొలగించండి
 6. పుట్ట దరిన పూజ చేసి పుచ్చడీక లందరూ
  బిట్టుగాను భక్ష్యములిడి ప్రీతితోడ వేడుచున్
  గట్టి మేలు జేయమనుచు గద్దెనాగమయ్యకే
  పట్టుదలగ చవితినాడు పాలు పోయు చుంటిరే!!!

  రిప్లయితొలగించండి
 7. పడగ లొన విషపు పన్నగేంద్రునిజేరి
  వేల్పులంచు కొలుచు విమల చరిత
  భారతీయమదియు భవ్య సంస్కృతి కాద
  భూత దయకు యిదియె పుట్టినిల్లు

  రిప్లయితొలగించండి
 8. పడగ లొన విషపు పన్నగేంద్రునిజేరి
  వేల్పులంచు కొలుచు విమల చరిత
  భారతీయమదియు భవ్య సంస్కృతి కాద
  భూత దయకు యిదియె పుట్టినిల్లు

  రిప్లయితొలగించండి
 9. శ్రీగురుభ్యోనమ:

  కట్టుచు పట్టు వస్త్రములు గౌరవ భావము పొంగుచుండగా
  పుట్టలలోని పాములకు పూజలు జేయుచు పాలు పోసినన్
  కొట్టుచు చంపివేయుదురు కోపమునన్ మరి పుట్టవీడ, నీ
  గుట్టును రట్టు చేయమని కోరితి నీశ్వర, కోపగింతువా!

  రిప్లయితొలగించండి
 10. పాము పాలేల తాగును పచ్చి కల్ల
  యనెడి వారలె ఎక్కువ యన్నిచోట్ల
  సర్వ జాతుల సమృద్ధి చక్కగుండ
  ధరణి పర్యావరణమంత దైన్య మవదు!

  రిప్లయితొలగించండి
 11. పూణ్యమొదవునంచు పూబోణులందరు
  పోయుచుంద్రు పాలుపుట్టలోన
  కర్షకహితు డైన కర్కటిఁగాపాడ
  కొలుచు చుందు రటుల కూర్మితోడ

  రిప్లయితొలగించండి
 12. రాగలకాలమందు ననురాగము బెంచగజేసిరార్యులే
  శ్రావణ నాగపంచమి విశాలతజాటెడిపండుగాయెగా
  భావన భాగ్యమైనిలచె భావితరాలకుమార్గ దర్శమై
  జీవులదీవెనల్ నొసగ జీవిత మంతయు సంతసంబ

  రిప్లయితొలగించండి
 13. గురుదేవులకు ధన్యవాదములు.
  సవరించిన పద్యం :
  నాగులచవితి పర్వాన బాగుఁగోరి
  పుట్టనర్చించిక్షీరమ్ముపోయు వేళ
  విఘ్న రాజును నేనంచు వెలసి యున్న
  దొద్దు దేవరకిడరమ్మతొల్లిపూజ!
  ( పుట్ట మీద ద్యోతకమవుతున్న గణేశప్రతిమను ఓ మారు గమనించండి )

  రిప్లయితొలగించండి
 14. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘అందరూ’ అన్నదాన్ని ‘అందరున్’ అనండి.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘భూతదయకు నిదియె’ అనండి.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘సమృద్ధి’ అన్నచోట గణదోషం. ‘సమృద్ధికి’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘దీవెన లొసగ’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘దీవెనల్ గొనగ’ అనండి.
  *****
  గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ సవరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. ఆ.వె: భారతీయు లెల్ల భక్తిభావము పూని
  సర్ప రాజుఁగొల్వ సౌఖ్యమబ్బు
  ప్రాంత భేద మనక పాలు,ఫలములతో
  యర్చన మొన రింతు రవని యందు.
  2.ఆ.వె: నాగ పంచమనుచు నాగదేవతఁగొల్వ
  శ్రావణంబు నందు సంభ్రమాన
  చలిమిడి మరి పాలు చక్కగా పోయుచు
  నిలను పాము గొల్తురింట వారు.
  3.ఆ.వె: నాగుమయ్య పూజ నమ్మకమున చేయ
  తొలగు నలత లన్ని తుష్టి గలుగు
  కన్ను,చెవుల రుజలు కాకుండ కాపాడు
  జాగు యేల రండు జాయ లార.

  రిప్లయితొలగించండి
 16. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘ఫలములతో| నర్చన...’, ‘పంచమి యని...’ అనండి.

  రిప్లయితొలగించండి