21, ఆగస్టు 2015, శుక్రవారం

పద్య రచన - 986

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:


  1. చిన్న నాట తెలుగు చక్రమును నేర్చి
    యవ్వనమున చదువు చక్రమై తిరిగి
    విశ్రాంతమున ముదమ్మున పద్యచక్రమై
    తెలుగు తల్లి సేవ జేసె మా అయ్యవారు.


    రిప్లయితొలగించండి
  2. ఆ.వె:బాల లాట లందు వడివడి గానేగ
    చక్రమూని వారు చకచకమని
    సాగుచుందురిలను సంబర మందుచూ
    పసిడి ప్రాయమన్న బాల్య మేగ.

    రిప్లయితొలగించండి

  3. శ్రీగురుభ్యోనమ:

    పరుగులు దీయుచు నెట్టుచు
    పరమానందమ్ము బొందు బాలకులారా
    తిరిగెడి చక్రపు గమనము
    సరిజూచిన జాలు బాట సవ్యంబేగా!

    రిప్లయితొలగించండి
  4. గురువు గారికి నమస్సుమాంజలులు

    కల్ల లెరుగ బోరు కపటమన్నదిలేని
    పసిడి మనసు భావి వారసుండ్రు
    ప్రగతి పథము గోరి పాతచక్రాలతో
    సాధనంబు జేయు సాధకుండ్రు.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి నమస్సుమాంజలులు

    కల్ల లెరుగ బోరు కపటమన్నదిలేని
    పసిడి మనసు భావి వారసుండ్రు
    ప్రగతి పథము గోరి పాతచక్రాలతో
    సాధనంబు జేయు సాధకుండ్రు.

    రిప్లయితొలగించండి
  6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అందుచూ’ అన్నదాన్ని ‘సంబర మందుచు’ అని, ‘బాల్యమేగ’ అన్నదాన్ని ‘బాల్యమె గద’ అనండి.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. కల్ల కపటమ్ము నెరుగని నుల్ల మలర
    బాల లిద్దరు మోదాన పరుగు లిడుచు
    నాడు చుండిరి చక్రాల యాట నచట
    యొకరి కొకరుగా రెట్టింపు నుత్సుకతన

    రిప్లయితొలగించండి
  8. పాత సైకిలు చక్రము! చేత కర్ర!
    గాడిలోనుంచి రయ్యున వాడ వాడ
    తిరిగి త్రిప్పిన తరుణాన తెలుసు కొన్న
    మెలకువలు జీవితమ్మున మేలుఁ జేయు!

    రిప్లయితొలగించండి
  9. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘...కపటమ్ము నెరుగక యుల్ల మలర’, ‘...నచట| నొకరి కొకరుగా...’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. .జీవనచక్రముల్ దిరుగ జేయుమటంచును దెల్పుచిత్రమే
    కేవల మాటలో దెలుపు కీడును గోరెడి నాశ దోషముల్
    త్రోవన వెళ్లు నట్లుగనుతొందరయందున బాలు రెంచగా?
    మీవరమౌను |ఆటలన?మిక్కిలిమక్కువ బంచుటౌనుగా
    2.దాహమువంటి నాటలువిధానములందున నాడబూనగా
    స్నేహము నిల్పి,దేహము విశేష పధంబున బెంచుగాన|వ్యా
    మోహము వీడకన్ నిలుపు| ముద్దుల బాల్యమె చక్ర బంధ మై|
    ఆహుతి గాని యాదరణ అందరికందగ ముందు కెళ్ళుమా

    రిప్లయితొలగించండి
  11. చక్రమొక్కటి చేబట్టి సంతసముగ
    దిగులు చింతలు లేకుండ తిరుగు చుండ్రి
    బాల్య మెంతటి యానంద భరిత మౌను
    గుర్తు వచ్చెను చిననాటి వర్తనములు

    రిప్లయితొలగించండి
  12. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. జీవన చక్రము దిప్పుట
    నీవిధముగ నేర్తురేమొ నెలమిన్ బాలుర్
    సావాసమ్మును బెంచెడి
    జీవితమున తీపి గుర్తు చిన్నతనమ్మే!!!

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  15. 986వ చిత్రానికి పద్యరచన
    `````````````````````
    పాత సైకిలు చక్రాల పల్లెబాట

    బాలు రిద్దరు నాడుచు పరవశింప

    ఆయురారోగ్యములచేత నలరుచుండ

    తల్లిదండ్రులు మురిసిరి తనయుజూచి

    విద్వాన్,డాక్టర్ మూలే రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు . ప్రోద్దటూర్ కడప జిల్లా 7396564549

    రిప్లయితొలగించండి