26, ఆగస్టు 2015, బుధవారం

పద్య రచన - 991

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. మత్తును గొలిపెడి ప్రకృతి
  చిత్తములను దోచునట్టి జిలుగుల వెలుగుల్
  పుత్తడి యిత్తడి చిత్తడి
  చిత్తరువులు దాచ గలదువి చిత్రము లెన్నో

  రిప్లయితొలగించండి
 2. చిన్న పెట్టె యిది చిత్రములను దీయు
  తీపి గురుతు లెన్నొ దాచి యుంచు
  ప్రతి యింట నలరు బాసటగానుండు
  దీక్ష తోడ గనుడు దీని మహిమ.

  రిప్లయితొలగించండి
 3. చాయా గ్రాహక యంత్రము
  మాయా మంత్రమ్ములేదు మన చిత్రములన్
  సోయగ మొప్పగ దీయును
  లేయవి కలకాలముండి లెస్సగ నిలుచున్.

  రిప్లయితొలగించండి
 4. మాయా మంత్రము లెఱుగని
  నా యంత్రము దీ యుమనల నపురూ పముగాన్
  ఛాయా గ్రాహక పరికర
  మేయది మఱి చూడు డా ర్య ! మీకన్ను ల తోన్

  రిప్లయితొలగించండి
 5. పెరిగిన మానవ మేధకు
  ధరణిన తార్కాణమిదియె తాంత్రిక పేటీ
  స్థిరముగ నిలుపును జ్ఞాపక
  తరంగ మాలిక లనిదియె తరతర ములకున్

  రిప్లయితొలగించండి
 6. చిత్రము గాదే యిది మన
  చిత్రము అచ్చముగ గాజు నేత్రము తోడన్
  పత్రము పైముద్రితమొసగ
  నేత్రానందము ను యిచ్చు నెంతయుగానో

  రిప్లయితొలగించండి
 7. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. ‘మత్తును గొలెపెడి ప్రకృతిని’ అందామా?
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మొదటి, మూడవపాదాలలో గణదోషం. రెండవపాదంలో యతిదోషం. మీ పద్యానికి నా సవరణ.....
  చిన్న పెట్టియ యిది చిత్రములను దీయు
  తీపి గురుతు లుండు దీనిలోన
  ప్రతి గృహమున నలరు బాసటగానుండు
  దీక్ష తోడ గనుడు దీని మహిమ.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవపాదాన్ని ‘యా యంత్రము’ అని మొదలుపెట్టండి.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  వల్లూరు మురళి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. నాల్గవ పాదంలో ‘నేత్రానందమును+ఇచ్చు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పత్రముపై ముద్రించగ| నేత్రానందమ్ము నొసగు నెంతొ ముద మగున్’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. క్లిక్కు మనంగ మనోహర
  మెక్కడి దైనన్ గ్రహించి మేటిగ నిల్పున్
  చక్కగ దాచుకొనంగ
  న్నిక్కమ్ముగ దీని సాటి నిల్చున దేదిన్?

  రిప్లయితొలగించండి
 9. చిత్రము గాదే యిది మన
  చిత్రము నచ్చముగ నచ్చుచేయును గాదే
  పత్రము పై ముద్రించగ|
  నేత్రానందమ్ము నొసగు నెంతొ ముద మగున్

  రిప్లయితొలగించండి
 10. చిత్రము గాదే యిది మన
  చిత్రము నచ్చముగ నచ్చుచేయును గాదే
  పత్రము పై ముద్రించగ|
  నేత్రానందమ్ము నొసగు నెంతొ ముద మగున్

  రిప్లయితొలగించండి
 11. చిత్రము గాదే యిది మన
  చిత్రము నచ్చముగ నచ్చుచేయును గాదే
  పత్రము పై ముద్రించగ|
  నేత్రానందమ్ము నొసగు నెంతొ ముద మగున్

  రిప్లయితొలగించండి
 12. శ్రీగురుభ్యోనమ:

  వ్రాయదు గీయదు మాయో
  పాయంబేమో తెలియదు భద్రము కాగన్
  పాయక తనలో చూపును
  ఛాయాచిత్రమును దీయు సాధనమిదియే

  రిప్లయితొలగించండి
 13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘నిల్చునె యెదియున్’ అనండి.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. క్యామర?-పెళ్లికూతురు వికారముమాన్పెడిమంత్రదండమే|
  క్యామర?బూతకాలమును గాంచగజేయును దీయుచిత్రముల్
  క్యామర గుప్తసంపదగ కల్పన లేకను రూపముంచుగా|
  క్యామరలేనికార్యములు గాంచగ లేమట నేటి మాటిదే|
  2,అందపునంతరంగమును నచ్చుగ,మెచ్చగ నేర్పు,గూర్పునన్
  విందు,విహార యాత్రల విశేషము బంచును చిత్ర సీమగా
  సుందర మందిరాలను,సుశోభితశిల్పులకల్ప దృశ్యముల్
  నందగ?క్యామరాప్రతిభ నచ్చెరు వేగద చూచు వారికిన్|

  రిప్లయితొలగించండి
 15. కనుమరుగయ్యే సృతులను
  ఘనముగ బ్రతికించునిదియె కలకాలంబున్
  కనిపెట్టకున్న దీనిని
  మనుగడ శూన్యంబుగాదె మనుజులకిలలో!!!

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
  క్లిక్కు మనంగ మనోహర
  మెక్కడి దైనన్ గ్రహించి మేటిగ నిల్పున్
  చక్కగ దాచుకొనంగ
  న్నిక్కమ్ముగ దీనిసాటినిల్చునె యెదియున్

  రిప్లయితొలగించండి
 17. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి