10, ఆగస్టు 2015, సోమవారం

పద్య రచన - 980

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. పోషక విలువలు గలిగిన
    భేషుగ తినగోరు నంచు పెసర ట్టిడ్లీ
    శేషము మిగల్చ కుండగ
    కాషాయ చక్రవర్తు లైన కమ్మగ దినరే

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో సరిగణంగా జగణం (యచక్ర) వేసారు. ‘కాషాయాంబరులు నైన కమ్మగ దినరే’ అందామా?

    రిప్లయితొలగించండి

  3. ఆ.వె: అరటి యాకు నందు నాయుపాహారమున్
    కాంచ గానె నిండు కడుపు మనకు
    ఇడ్డెనలు పొడియును యింపొన రింపగా
    జతకు దోస చేరి చవిని పెంచె.

    రిప్లయితొలగించండి
  4. ఇడ్లియట్టునందు నివి మంచి రుచినిచ్చు
    శనగ పచ్చడి మరి తినగ మనకు
    కోరిచేసినట్టి కొబ్బరి చట్నియు
    అల్లమదియు గూడ ననువుగుండు.

    రిప్లయితొలగించండి
  5. ఇడ్లీ ,పూరీ,వడలును
    ఇడ్లీ సాంబారు మరియు ఇడ్లీ చట్నిన్
    ఇడ్లీ లు పెసర యట్టుల
    ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?

    రిప్లయితొలగించండి
  6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పొడియును నింపొన...’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నోరూరించెడు నూరిమిండి తిన సంతోషమ్ములన్ గొల్పు యా
    కారం దోశల నుల్లిపాయలు సమాగంబైనవే మిత్రమా!
    రా రా యంచు వచించి నేస్తమునకల్లంపచ్చడిన్ బెట్టి యిం
    పారన్ దృప్తి భుంజించనేర్తురుకదా యానంద సందోహులై.

    రిప్లయితొలగించండి
  8. చిత్ర మందున జూడుము పత్రమందు
    వేరు వేరుగ నిద్లీ లు ప్రీతి గలుగ
    సిద్ధ పఱచిరి దోసెను శుద్ధ ముగను
    చూడ చక్కగ నున్నవి సొబగు తోడ

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ శార్దూల పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఆకారం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నేను చిన్నప్పుడు బాబాయి హోటెలు, విజయవాడ లో తిన్న ఇడ్లీ, పెసరట్టులే గుర్తుకొచ్చాయి.

    నేతి యిడ్లీలు మరియును నేతి పెసర
    దోసె చట్నీలు, కారము తోడ పెట్ట
    ప్లేటు లోనను బాబాయి హోటలందు
    కరిగి పోయెను నోటిలో కరము వేగ

    రిప్లయితొలగించండి
  11. ఉదయ వేళఁ దినెడు మొదటి యల్పాహార
    మిట్లు నూనె లేని యిడ్లి పిదప
    దోశ, పూరి, వడల నాశ దీరగదిన్న
    మంచిదనెదరండి మహిని జనులు.

    అల్లపు చట్నీ తోడుత
    నుల్లమలర కారపుపొడి యొప్పెడు నెయ్యిన్
    పల్లీ,పుట్నాలు గలిపి
    చెల్లెడు చట్నీ కుదరగ జేయని తినరే!

    రిప్లయితొలగించండి
  12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. వడ్డించిన విస్తరిలో
    నిడ్డెనలును, దోసెలెల్ల నింపుగఁ దోచెన్,
    బిడ్డలకెల్లరు పెట్టిన
    నడ్డుపడగబోరనంగ ననుమానమ్మే?

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఇంటిల్లి పాదికి యిష్టమౌ ఇడ్లిని
    -----నెంచని లోకులు నెచట గలరు?
    దోషంబులుంచని దోశన గోరని
    -----మనుషులు మనలోన మసలరెచట|
    వడ్డించగావడ-వద్దని జెప్పెడి
    -----మొహమాట నెవరిలో మొలువ గలదు|
    కారపు చట్నియు పేరిన నేతిని
    -----కళ్ళచూపులకంద?కదలగలవ?
    అరటి యిస్తరులందున ?ఆరగించు
    తిండి-పౌష్టికాహారమై కండబెంచ?
    సమ్మ తందున జిహ్వ యే సరసమాడ?
    కమ్మదనమందు నాకలి కరుగు గాదె|
    2.ఇడ్లి,దోశ,వడలు ఎందరి కిష్టము?
    బాల,యవ్వనులకు,పండువయసు
    వారి కైన?రుచులు బంచగలుగునని
    రాజు,పేదకైన మోజునింపు|

    రిప్లయితొలగించండి
  16. నోరూరగ పెసరట్టును
    కారపు చట్నీల తోడ కమ్మని యిడ్లీ
    దీరుగ నరిటాకులలో
    రారమ్మని పిలువసాగె రమణీయముగన్!!!

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. ఉల్లిపెసరట్టు పైపైన ఉప్మ వేసి
    శనగ పల్లీలు కలిపిన చట్ని చేసి
    కొంత యల్లము పచ్చడి కూడ వేసి
    చేయు పలహార మారుచి చెప్పనేల?

    రిప్లయితొలగించండి
  19. ఉల్లిపెసరట్టు పైపైన ఉప్మ వేసి
    శనగ పల్లీలు కలిపిన చట్ని చేసి
    కొంత యల్లము పచ్చడి కూడ వేసి
    చేయు పలహార మారుచి చెప్పనేల?

    రిప్లయితొలగించండి
  20. వల్లూరు మురళి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ఉల్లిపెసరట్టు పైపైన ఉప్మ పరచి
    శనగ పల్లీల పప్పుతో చట్ని చేసి
    కొంచెమల్లము పచ్చడి ముంచుకొనుచు
    చేయ పలహార మారుచి చెప్ప తరమ!

    రిప్లయితొలగించండి