బీటలువారు భూమిఁగని పెక్కురు రైతులు చచ్చుచుండగా మాటలుజెప్పు నాయకులు మాటలె చెప్పుచునుందురక్కటా! నీటిని వానగా విడుము, నేలయుఁ గండ్లును జిహ్వలెండె, మా పాటులు తప్పగా భువిని పంటలు పండగ పండగౌ శివా!
గురువుగారు, నమస్సులు. సమయానికి వ్రాయలేకపోయిన నా అశక్తతను మన్నించి వీలున్నచో పాతపూరణలను పరిశీలించిన ధన్యురాలను జేయవలసినది. వీలు కుదిరిన పెద్దలెవరైనా దోషములను సూచించిన సరిదిద్దుకోవలెనని ఆశిస్తున్నాను.
బీటలువారు భూమిఁగని పెక్కురు రైతులు చచ్చుచుండగా మాటలుజెప్పు నాయకులు మాటలె చెప్పుచునుందురక్కటా! నీటిని వానగా విడుము, నేలయుఁ గండ్లును జిహ్వలెండె, మా పాటులు తప్పగా భువిని పంటలు పండగ పండగౌ శివా!
యెండి పోగ గుక్కెడు నీళ్ళకై బిందె చేత బట్టి వేగ నడువ బాట బీటు వారె బలము తగ్గుచు నుండ సాగు చుండె నటులె చంటి వాడు. 2.వట్టి బిందె పట్టి వసుధెల్ల తిరిగినా చుక్క నీరు కూడ చిక్క లేదు గొంతు పెగల కుండె గుబులు హెచ్చగు చుండె యేమి సేతు నీటి నెటుల తెత్తు.
కవిమిత్రులలి నమస్సులు. రోజంతా ప్రయాణంలో ఉండి మీ పద్యాలను సమీక్షించలేకపోయాను. మరో రెండు రోజులు ప్రయాణాలే. అందువల్ల రేపు, ఎల్లుండి ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. మన్నించండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శ్రీ స్వామి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘అనువీక్షణము’లో అను అన్నది ఉపసర్గ. విశేషముగా చూచుట అని అర్థం చెప్పుకోవచ్చు. ఉపసర్గలకు అనేకార్థాలుంటాయి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని స్వీకరించాలి. నాకంతగా సంస్కృత భాషా పరిజ్ఞానం లేదు. డా. విష్ణునందన్ గారిని అడిగి వివరంగా తెలియజేస్తాను. ‘వరలక్ష్మీవ్రతం, రక్షాబంధనం’ విషయాలుగా మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, హాస్యస్ఫోరకమైన మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. ఇంతకీ మీరుండేడి తిరుపతిలోనా? ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ సీసపద్యం బాగుంది. అభినందనలు. ‘ఓటికుండ, ఒలుకుట’ సాధుశబ్దాలు. మీరు వోటికుండ, వొలుకుట అన్నారు. ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బాల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటిపద్యం మొదటిపాదం ప్రారంభంలో ‘గొంతు’ టైపు కాలేదనుకుంటాను. ‘గొంతు+ఎండు’ అన్నప్పుడు ‘గొంతెండు’ అవుంతుంది. కనుక అక్కడ ‘గొంతు తడుపుకొనగ...’ అనండి.
లక్ష్మీదేవి గారూ, మీ సందేహానికి డా. విష్ణునందన్ గారి సమాధానం చూడండి..... ‘అను’ అన్న భాషా భాగాలలో అవ్యయమైన ఉపసర్గకు మీరన్నట్లు అనేకార్థాలున్నాయి. విశేషించి ‘మంచి’ ‘శ్రేష్ఠమైన’ అనే అర్థాన్నిస్తుంది. పథము - అనుపథము , క్రమము - అనుక్రమము , బంధము - అనుబంధము ఇత్యాది . కొండొకచో ‘అనుసరించి’ అనే అర్థము కూడా అనుగమనము , అనుగతము ఇత్యాది. అంతే కాదు, ‘అను’ ఉపసర్గ చేరిక వలన మొదటి పదానికి పూర్తిగా వ్యతిరేకార్థం వచ్చే ప్రమాదం కూడా ఆయా తావులలో కన్పట్టుట కొన్ని సందర్భాలలో గమనింప వచ్చు. మీ మాటననుసరించి, సందర్భాన్ని బట్టి, ప్రయోగాన్ని బట్టి అర్థం చెప్పుకోవలసినదే! ఇందులో అత్యంత గహనమైన - భాషాపరమైన, నైఘంటిక చర్చకు చాలా వీలున్ననూ దాని జోలికి వెళ్లక ఉపరితల స్పర్శ మాత్రమే చేయవలెనన్న - "శ్రీగిరి సోముండు అనువీక్షించి" అన్న అప్పట్టున ‘అనువీక్షణము’ అన్నది ‘అనుకూలమైన వీక్షణము’ అన్న వైశేషికార్థములో సంఘటింపబడినది. ఇది చెలమచెర్ల వారి భాషాకోశం నుండి - చదువరులకు ఉపయుక్తముగా - సం.అవ్య. సమాసపూర్వపదమై ఈ క్రింది అర్థములను సూచించును. 1. ఆశ్రయము. 2. ప్రాప్తము. 3. సాదృశ్యము. 4. ఆనంతర్యము. 5. అర్హత. 6. క్రమము. 7. వీప్స. 8. సామీప్యము. 9. అప్రాధాన్యము. 10. ఆనుకూల్యము.
బీటలు వారిన భూమిని
రిప్లయితొలగించండిదాటుచు పోవంగ నెంచి దాహము దీర్చన్
నీటిని చేకొను నెపమున
బాటయె కడుదుష్ట మైన బాధను మరచెన్
బీటలు వారిన భూమిని
రిప్లయితొలగించండివాటముగా జేయదలచి బాలకు డొకడు
న్నీటిని వెదకుట కొఱకై
దాటుచు మఱి పోవుచుండె దప్తుం డగుచున్
నీటిచుక్కలేక నెరలిచ్చె పుడమియు
రిప్లయితొలగించండిబీటలేసిభూమి బీడువారె
తాగు నీటి కొరకు తానుపరుగిడెను
నీటి జాడలేక నీరసించె
బీటలువారు భూమిఁగని పెక్కురు రైతులు చచ్చుచుండగా
రిప్లయితొలగించండిమాటలుజెప్పు నాయకులు మాటలె చెప్పుచునుందురక్కటా!
నీటిని వానగా విడుము, నేలయుఁ గండ్లును జిహ్వలెండె, మా
పాటులు తప్పగా భువిని పంటలు పండగ పండగౌ శివా!
గ్రుక్కెడు జలమ్ము జిక్కక
రిప్లయితొలగించండియెక్కడకో పరుగు దీయ నేమి ఫలమురా?
చక్కంగఁ దిక్కశంకరుఁ
మ్రొక్కినఁ గొప్పును గదల్చ పొంగును గంగే!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండినెరియలు జీలె నేలలిటు నింగిన మేఘము లాడకుండెనే
కురియక వానజల్లులు ప్రకోపము జెందెను జూడ దాపముల్
త్వరపడి వెళ్లు బాలునకు దాహము దీరునె నీరమబ్బునే!
సరసిజనాభ గాంచుమిట క్షామము బాపి యనుగ్రహింపుమా
(అసందర్భమైననూ తిరుపతిలోని పరిస్థితిని కూడా తెలుపుచున్నాను.)
కుంపటిలోన నిప్పులిడి కూర్చొనినట్లుగ మండె తిర్పతీ
తుంపరలైన రాలవిట దుర్భరమయ్యెను వేడి నోపగన్
కొంపలు గాల్చుచుండె గడు కోపము జూపుచు చండభానుడే
కంపనమొదిరీ జనులు కావగ రావటె వెంకటేశ్వరా
తాగునీటికొరత సాగునీటి కొరత
రిప్లయితొలగించండికరుణ లేని వాడు వరుణు డలిగె
కరువు కోరలందు ధరణియే చిక్కెను
చుక్క నీరు లేని చిక్కు లివిగొ
నీటియవసరాలు నీకెంత ముఖ్యమో
రిప్లయితొలగించండి--------ప్రాణి కోటినిసాకు వసుధకంతె
ఎండవేడిమి నందు కండ కుమిలినట్లు
-------భూమిపొరలయందు పుష్టిదగ్గె
కనుచూపు మేరలో కనుపించ దేనీరు
------బాల,భూమికిచట బట్టుకొనగ
చెట్లు చేమలు లేక చేరవే వానలు
------వానలుబడకున్న ?పగులుభూమి
కలిమి,బలిమినింపు కర్ష కాళికెపుడు
వాన, వసుధపంటపండి నపుడె
ఎండమావినీరు యెంతనివెదుకుట
వోటికుండ నీరు వొలుకుటౌన?
గురువుగారు,
రిప్లయితొలగించండినమస్సులు. సమయానికి వ్రాయలేకపోయిన నా అశక్తతను మన్నించి వీలున్నచో పాతపూరణలను పరిశీలించిన ధన్యురాలను జేయవలసినది.
వీలు కుదిరిన పెద్దలెవరైనా దోషములను సూచించిన సరిదిద్దుకోవలెనని ఆశిస్తున్నాను.
అనువీక్షించు అనుపదమును గురించి వివరించమనవి.
లక్ష్మీదేవినిఁ బూజసేసి కడు స్వారస్యంబుగా వంటల,
న్నాక్ష్మాజంబుల పూల, బండ్లనిడుచున్ నైవేద్యముల్ నోర్మితోన్
సుక్ష్మారూపులె తాముగా; వివిధమౌ స్తోత్రంబులన్ పాడుచుం
ద్రా క్ష్మాభృత్సదృశంబునైన హృదిలో దాక్షిణ్యమున్ వేడుచున్.
తమ్ముని రక్షాబంధన
నిమ్ముగ జరిగెన్ బహుమతులెన్నో వచ్చెన్
నెమ్మది నొసగుమటంచున్
మమ్ములఁగావుమటనుచును మాధవుఁదలతున్.
బీటలువారు భూమిఁగని పెక్కురు రైతులు చచ్చుచుండగా
మాటలుజెప్పు నాయకులు మాటలె చెప్పుచునుందురక్కటా!
నీటిని వానగా విడుము, నేలయుఁ గండ్లును జిహ్వలెండె, మా
పాటులు తప్పగా భువిని పంటలు పండగ పండగౌ శివా!
దప్పికేసిన బాలుడు తప్పదనుచు
రిప్లయితొలగించండినెర్రవారిన నేలలో నిశ్చయముగ
నీరు దేనెంచి బిందెతో నూరు దాటి
పాదరక్షలు లేకుండ పయనమయ్యె!
అపర భగీరతుండు జలయజ్ఞము చేయు బృహత్ప్రయత్నమం
రిప్లయితొలగించండిదుపరతి జెందబోక సమయోచిత వర్తనుడై చెలంగె వి
న్నపముల నాలకించి సురనాథుడు మేఘ చయంబు బంపి వ
ర్షపు సుధనందజేసె భువి రక్షణ జేసె దయాసముద్రుడై
యెండి పోగ గుక్కెడు నీళ్ళకై
రిప్లయితొలగించండిబిందె చేత బట్టి వేగ నడువ
బాట బీటు వారె బలము తగ్గుచు నుండ
సాగు చుండె నటులె చంటి వాడు.
2.వట్టి బిందె పట్టి వసుధెల్ల తిరిగినా
చుక్క నీరు కూడ చిక్క లేదు
గొంతు పెగల కుండె గుబులు హెచ్చగు చుండె
యేమి సేతు నీటి నెటుల తెత్తు.
వరుణ దేవు కరుణ ప్రచరించ కుండుటన్
రిప్లయితొలగించండినీరులేక భూమి నెర్రెలిచ్చె
మంచినీళ్ళు గొనగ నెంచి పొలము నుండి
పోవుచుండె నర్థి బుడుతడొకడు
కవిమిత్రులలి నమస్సులు.
రిప్లయితొలగించండిరోజంతా ప్రయాణంలో ఉండి మీ పద్యాలను సమీక్షించలేకపోయాను. మరో రెండు రోజులు ప్రయాణాలే. అందువల్ల రేపు, ఎల్లుండి ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. మన్నించండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శ్రీ స్వామి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అనువీక్షణము’లో అను అన్నది ఉపసర్గ. విశేషముగా చూచుట అని అర్థం చెప్పుకోవచ్చు. ఉపసర్గలకు అనేకార్థాలుంటాయి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని స్వీకరించాలి. నాకంతగా సంస్కృత భాషా పరిజ్ఞానం లేదు. డా. విష్ణునందన్ గారిని అడిగి వివరంగా తెలియజేస్తాను.
‘వరలక్ష్మీవ్రతం, రక్షాబంధనం’ విషయాలుగా మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
హాస్యస్ఫోరకమైన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
ఇంతకీ మీరుండేడి తిరుపతిలోనా?
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
‘ఓటికుండ, ఒలుకుట’ సాధుశబ్దాలు. మీరు వోటికుండ, వొలుకుట అన్నారు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బాల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యం మొదటిపాదం ప్రారంభంలో ‘గొంతు’ టైపు కాలేదనుకుంటాను. ‘గొంతు+ఎండు’ అన్నప్పుడు ‘గొంతెండు’ అవుంతుంది. కనుక అక్కడ ‘గొంతు తడుపుకొనగ...’ అనండి.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్సులు.
రిప్లయితొలగించండిఉద్యోగరీత్యా ప్రస్తుతము తిరుపతిలో ఉంటున్నాము. నా స్వస్థలము బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా).
ధన్యవాదములు.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ సందేహానికి డా. విష్ణునందన్ గారి సమాధానం చూడండి.....
‘అను’ అన్న భాషా భాగాలలో అవ్యయమైన ఉపసర్గకు మీరన్నట్లు అనేకార్థాలున్నాయి. విశేషించి ‘మంచి’ ‘శ్రేష్ఠమైన’ అనే అర్థాన్నిస్తుంది. పథము - అనుపథము , క్రమము - అనుక్రమము , బంధము - అనుబంధము ఇత్యాది . కొండొకచో ‘అనుసరించి’ అనే అర్థము కూడా అనుగమనము , అనుగతము ఇత్యాది. అంతే కాదు, ‘అను’ ఉపసర్గ చేరిక వలన మొదటి పదానికి పూర్తిగా వ్యతిరేకార్థం వచ్చే ప్రమాదం కూడా ఆయా తావులలో కన్పట్టుట కొన్ని సందర్భాలలో గమనింప వచ్చు. మీ మాటననుసరించి, సందర్భాన్ని బట్టి, ప్రయోగాన్ని బట్టి అర్థం చెప్పుకోవలసినదే! ఇందులో అత్యంత గహనమైన - భాషాపరమైన, నైఘంటిక చర్చకు చాలా వీలున్ననూ దాని జోలికి వెళ్లక ఉపరితల స్పర్శ మాత్రమే చేయవలెనన్న - "శ్రీగిరి సోముండు అనువీక్షించి" అన్న అప్పట్టున ‘అనువీక్షణము’ అన్నది ‘అనుకూలమైన వీక్షణము’ అన్న వైశేషికార్థములో సంఘటింపబడినది.
ఇది చెలమచెర్ల వారి భాషాకోశం నుండి - చదువరులకు ఉపయుక్తముగా -
సం.అవ్య.
సమాసపూర్వపదమై ఈ క్రింది అర్థములను సూచించును.
1. ఆశ్రయము.
2. ప్రాప్తము.
3. సాదృశ్యము.
4. ఆనంతర్యము.
5. అర్హత.
6. క్రమము.
7. వీప్స.
8. సామీప్యము.
9. అప్రాధాన్యము.
10. ఆనుకూల్యము.
ఇతి నతయః
గురువుగారు,
రిప్లయితొలగించండిసంతోషం. 'అను' ప్రత్యేకతల గురించి పరిచయం ఉన్నప్పటికీ అనువీక్షించు పదం కొత్తగా అనిపించి అడిగాను.