29, ఆగస్టు 2015, శనివారం

సమస్యాపూరణ - 1773 (రక్షాబంధనము సేయఁ బ్రాణము వోయెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రక్షాబంధనము సేయఁ బ్రాణము వోయెన్.

29 కామెంట్‌లు:

 1. పూజ్యగురుదేవులకు, కవిమిత్రులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు...

  అక్షయముగ సిరులు గురియు
  రక్షాబంధనము సేయ, ప్రాణము బోయెన్
  కుక్షిని గొట్టగ రాముడు
  లక్షణముగ నేలగూలె లంకేశుండే!!!

  రిప్లయితొలగించండి
 2. మిత్రులందఱకు రక్షాబంధన దినోత్సవ శుభాకాంక్షలు!

  (తనకు రక్షాబంధనముం జేసిన లక్ష్మీదేవి మూలమున బలిచక్రవర్తి, వడుగు రూపముననున్న విష్ణువు నేమియుఁ జేయక, నాతని పదత్రయముచే తన ప్రాణసమమైన రాజ్యముం గోల్పోయి, పాతాళాధిపత్య మందితినని తలపోయు సందర్భము)

  "అక్షయ రాజ్యమె ప్రాణ
  మ్మీక్షణ పాదత్రయుఁడు రమేశుఁడు నీచం
  బౌ క్షీణ పదం బిడె! రమ
  రక్షాబంధనము సేయఁ, బ్రాణము వోయెన్!"

  రిప్లయితొలగించండి
 3. ప్రతాపహీనతనెంచక విపత్తు నుండి రక్షించెదనని పలికి........

  కౌక్షేయకమును బూని వి
  లక్షణ యుద్ధప్రతాప రహితుండై తాఁ
  రక్షించగ నెంచి విప
  ద్రక్షా బంధనము చేయ బ్రాణము వోయెన్

  రిప్లయితొలగించండి

 4. రక్షగ నుందురు నిరతము
  రక్షా బంధనము సేయ, బ్రాణము వోయె
  న్గక్షను పీకను బిసుకగ
  భిక్షము దావే యకునికి వేరొకడు దనన్

  రిప్లయితొలగించండి
 5. రిక్షా పై వెడలెను తా
  రక్షాబంధనము సేయఁ బ్రాణము వోయెన్
  వృక్షమునకు డీకొని యా
  రిక్షా దుర్ఘటనజరిగె ప్రిదిలెనసువులున్.

  రిప్లయితొలగించండి
 6. రిక్షా పై వెడలెను తా
  రక్షాబంధనము సేయఁ బ్రాణము వోయెన్
  వృక్షమునకు డీకొని యా
  రిక్షా దుర్ఘటనజరిగె ప్రిదిలెనసువులున్.

  రిప్లయితొలగించండి
 7. రక్షణగానుండు మెప్పుడు
  రక్షాబంధనముసేయ, బ్రాణము వోయెన్
  రక్షక భటు డొ క్కడి తన
  శిక్షణలో తాళలేక శిబిరము నందున్

  రిప్లయితొలగించండి
 8. రక్షణగానుండు మెప్పుడు
  రక్షాబంధనముసేయ, బ్రాణము వోయెన్
  రక్షక భటు డొ క్కడి తన
  శిక్షణలో తాళలేక శిబిరము నందున్

  రిప్లయితొలగించండి
 9. ఏక్షణ మేమగు నోయని
  రక్షాబంధనము సేయఁ బ్రాణము వోయన్
  రాక్షస శక్తులు చొరబడ
  రక్షణయది సీత కనుచు లక్ష్మణు డెంచన్!

  రిప్లయితొలగించండి
 10. శైలజ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. 'రక్షణగ నుండు మెప్పుడు' అనండి.
  *****
  సహదేవుడు గారూ,
  మీ పూరణలో భావం అర్థం కాలేదు. వివరించండి.

  రిప్లయితొలగించండి
 12. గురుదేవులకు ధన్యవాదములు. సీతామాత లక్ష్మణుని నిందించి అన్నగారిని రక్షించ వెడలమన్నప్పుడు, ఆమెకు నమస్కరించి రక్షాబంధనముగా లక్ష్మణ రేఖ
  గీసి వెళ్లిన తర్వాత రావణుని కంటే ముందుగా కొన్ని రాక్షస శక్తులు గీతదాటి చొరబడి మరణించాయను ఊహాత్మకమైన పూరణగా భావించప్రార్థన.

  రిప్లయితొలగించండి
 13. అక్షయ వరముల గోరుతు
  రక్షాబంధనము సేయ, బ్రాణము వోయెన్
  లక్షల కోరిక యన్నకు
  వక్షములో నెప్పి తెచ్చె వాంతుల తోడన్

  రిప్లయితొలగించండి

 14. శ్రీగురుభ్యోనమ:

  శిక్షణ నిచ్చెడు నెపమున
  భిక్షకుడే గొంతు నులిమె భీతిల్లంగన్
  పక్షికి పంజరమదున
  రక్షా? బంధనము సేయఁ బ్రాణము వోయెన్.

  రిప్లయితొలగించండి
 15. can u please tell me how to post my poem in this blog through mobile

  thanks
  guru moorthy

  రిప్లయితొలగించండి
 16. can u please tell me how to post my poem in this blog through mobile

  thanks
  guru moorthy

  రిప్లయితొలగించండి
 17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  అక్షయ సోదర భావమె
  రక్షాబంధనము సేయఁ; బ్రాణము వోయెన్
  రాక్షస కంసునికి, తుదకు
  కక్షనుజూపంగ మడసె కర్మ ఫలమనన్

  రిప్లయితొలగించండి
 18. రక్షించుము ప్రియ సోదర
  అక్షయమగు ప్రేమతోన యాదరమొప్పన్
  కక్షను నిండిన దైత్యుల
  రక్షా బంధనము సేయఁ బ్రాణము వోయెన్

  ప్రియ సోదరులకు రక్షా బంధన శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 19. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ ‘ఊహ’ను ఊహించలేకపోయాను! బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
  *****
  గురుమూర్తి గారూ,
  ధన్యవాదాలు.
  ఈ స్మార్ట్ ఫోన్‍ల గురించి నా కంతగా సాంకేతిక పరిజ్ఞానం లేదు. నేనైతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాను. మల్టీ లింగ్ కీబోర్డు ఇన్‌స్టాల్ చేసికొని బ్లాగులో వ్యాఖ్యలు పెట్టగలుగుతున్నాను.
  మిత్రులెవరైనా మీ సందేహానికి సవివరంగా సమాధానం ఇస్తారేమో చూడాలి.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ప్రేమతోడ నాదరమొప్పన్’ అనండి. ‘రక్ష+అబంధన’మని అన్వయించుకోమంటారు!

  రిప్లయితొలగించండి

 20. దీక్షగ చక్రవ్యూహపు
  రక్షా బంధనము సేయ,బ్రాణము వోయెన్
  అక్షమ్మున నిల్చిన సిం
  ధుక్షోణికి రాజు యైన దుస్సల పతికిన్

  రిప్లయితొలగించండి
 21. క్షమించాలి
  సరిగా గమనించలేదు
  రక్షించుము ప్రియ సోదర
  అక్షయమగు ప్రేమతోడ నాదరమొప్పన్
  కక్షను నిండిన దైత్యుల
  రక్షా బంధనము సేయఁ బ్రాణము వోయెన్

  ప్రియ సోదరులకు రక్షా బంధన శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 22. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సిం|ధు క్షోణికి నధిపుడైన...’ అనండి. ‘రాజు+ఐన’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం.

  రిప్లయితొలగించండి

 23. గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
  దీక్షగ చక్రవ్యూహపు
  రక్షా బంధనము సేయ,బ్రాణము వోయెన్
  అక్షమ్మున నిల్చిన సిం
  ధుక్షోణికి నధిపుడైన దుస్సల పతికిన్

  రిప్లయితొలగించండి
 24. కుక్షిని నింపగ సోదరు
  డక్షయ పాత్రయని పోవ నాస్ట్రేలియకున్
  కక్షను గట్టిన పోస్టున
  రక్షాబంధనము సేయఁ బ్రాణము వోయెన్!

  రిప్లయితొలగించండి