24, ఆగస్టు 2015, సోమవారం

సమస్యాపూరణ - 1769 (పడు చున్నను పెండ్లియాడువారే లేరే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పడు చున్నను పెండ్లియాడువారే లేరే.

42 కామెంట్‌లు:

 1. నడినెత్తిన కేశమ్ములు
  పడిపోయెనురాలి పోయి వయసు ముదురుచున్
  పడరాని బాధలెన్నియొ
  పడు చున్నను పెండ్లియాడువారే లేరే.

  రిప్లయితొలగించండి
 2. గడుసరి కన్నెల యుగమిది
  పెడసరమగు వధువు గాంచి భీతిలి వీడన్
  గడపకు గడపకు నొకయాడ
  పడుచున్నను పెండ్లి యాడు వారే లేరే

  రిప్లయితొలగించండి
 3. గడుసరి నేతకు పుడమిని
  కుడిఎడమలుగాను వేలకోట్లున్నను దే
  వుడి లీలేమొ? వయసు పై
  బడుచున్నను పెండ్లి యాడు వారే లేరే.

  రిప్లయితొలగించండి
 4. నడవడికున్నను చాలదు
  వడిగల వారై బ్రతికెడు వాటమెరుగుటే
  పడనటులన్ వరుడున్నను,
  పడుచున్నను పెండ్లియాడు వారే లేరే?

  రిప్లయితొలగించండి


 5. పరుగుల నగరమున
  జీవనమొక తిరగలియాయె !
  పడు చున్నను
  పెండ్లియాడువారే లేరే :)

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. మిత్రులందఱకు నమస్సులు!

  (అన్ని యుండియు నెంత కాలమైననుం బెండ్లి కుదురని యువకుని మనోగతము)

  గడనము వేలుగ! నేనొ
  క్కఁడనే కొడుకునయ! రామ! కట్నమడుగ! రాఁ
  గడఁగియుఁ బడుచులు, సంతస
  పడుచున్, ననుఁ బెండ్లియాడువారే లేరే?!

  రిప్లయితొలగించండి
 7. నా రెండవ పూరణము:

  పడతులు పుట్టఁగ వలదని
  కడుపులు తీయించుకొనుచు ఘనముగఁ బడుచుల్
  గొడుకులఁ గందురె? కొందల
  పడుచున్నను పెండ్లియాడువారే లేరే?!

  రిప్లయితొలగించండి
 8. గుడిలో నర్చకునైతిని
  గడియించితి బాగుగానె, కానుచు పిలకన్
  పడుచొకరు వయసు మీదను
  పడుచున్నను పెండ్లియాడువారే లేరే !

  రిప్లయితొలగించండి
 9. పడుచుదనమందు చదువని
  తడవయ్యెనుగ పరిణయము తర్వాత గనన్
  దడ పుట్టె నికవయసుపై
  పడుచున్నను పెండ్లియాడువారు లేరే.

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘గడపకు గడపకు నొక్కొక| పడుచున్నను...’ అనండి.
  *****
  ‘ఊకదంపుడు’ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నడవడిక+ఉన్నను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘నడవడిక యున్న చాలదు’ అనండి.
  *****
  జిలేబీ గారూ,
  _/\_
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. నడివయసు పైబడి వ్యధ
  పడుచున్నను పెండ్లి యాడు వారే లేరే
  వడిగా స్థిర బడ దలచితి
  బడలేనిక సవతితల్లి బాధలు సామీ !

  రిప్లయితొలగించండి
 12. పడుసైన కుర్ర వెంటను
  బడుచున్నను పెండ్లియాడు వారేలేరే
  కడుదుర్భరమయ్యెసుమా
  కొడుకులకున్ పెండ్లియగుట కువలయమందున్

  రిప్లయితొలగించండి
 13. జడఁ జూడన్ జానెడుమరి
  గడసరి నడుమేమొ కొండ గజగామినియే
  అడిగిన కట్నంబివ్వని
  పడుచున్నను పెండ్లియాడువాడేలేడే

  రిప్లయితొలగించండి
 14. చెడునడతలులేవేమియు
  నొడుదొడుకులులేవు లేనిదుద్యోగమ్మే
  పడతులు నటనట తారస
  పడుచున్నను పెండ్లియాడు వారే లేరే !!!

  రిప్లయితొలగించండి
 15. శ్రీగురుభ్యోనమ:

  గడియకు వేలు గడించుచు
  నడవడియున్ కలిగినట్టి నవయువకునకున్
  కడు సరి సంపాదన కన
  పడు చున్నను పెండ్లియాడువారే లేరే.

  రిప్లయితొలగించండి
 16. తొడవులు మిక్కిలి గలిగిన
  నడవడి బాగున్నగాని నాకెందుకనో!
  పొడగాంచ నడివయసు పై
  బడుచున్నను పెండ్లియాడువారే లేరే!!!

  రిప్లయితొలగించండి
 17. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

  నడవడిక యున్న చాలదు
  వడిగల వారై బ్రతికెడు వాటమెరుగుటే
  పడనటులన్ వరుడున్నను,
  పడుచున్నను పెండ్లియాడు వారే లేరే?

  రిప్లయితొలగించండి
 18. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

  అడిగెదరు కట్న మెంతయొ
  నడమంత్రపు సిరినిఁ గోర నగుబాటు గదా
  విడిపోని బంధ మిచ్చెడు
  పడు చున్నను పెండ్లియాడు వారే లేరే!

  రిప్లయితొలగించండి
 19. భూసారపు నర్సయ్య గారు అన్నారు....

  గుండు మధుసూదన్ గారి పూరణ నేనూహించని విరుపుతో (పడుచున్+నను) అద్భుతంగా ఉంది.
  గోలి హనుమచ్ఛాస్త్రి, శ్రీపతి శాస్త్రి గారల పూరణలు కూడ బాగున్నవి. అందరికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పడుచైనను’ అన్నదానికి ‘పడుసైనను’ అని టైపాటు...
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గుడిలో పెండ్లని పిలచిరి
  వడివడిగా వచ్చినాడ వాహనము పయిన్
  గుడికడ లగ్నము దగ్గర
  పడు చున్నను పెండ్లియాడువారే లేరే.

  రిప్లయితొలగించండి
 22. పుడమిని గట్నపు టాశలు
  నతి వడిగా నెదుగు చుండె నది లేకనయో !
  కడు యోగ్య మైన సొబగుల
  పడు చున్నను పెండ్లియాడువారే లేరే.

  రిప్లయితొలగించండి
 23. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. పండ్లూడి,జుట్టు నెరసియు,
  నడుచుటకోపికయులేక, నడుమొంగినదై
  యుండినటు వయసు మీదను
  పడుచున్నను పెండ్లియాడు వారే లేరే!?

  రిప్లయితొలగించండి
 25. పండ్లూడి,జుట్టు నెరసియు,
  నడుచుటకోపికయులేక, నడుమొంగినదై
  యుండినటు వయసు మీదను
  పడుచున్నను పెండ్లియాడు వారే లేరే!?

  రిప్లయితొలగించండి
 26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 27. ఇడుముల తడబాటందున
  అడుగడుగున కష్టమున్న నాదర్సమునన్
  చెడుగుడు జీవితమందున
  పడుచున్నను పెండ్లియాడువారే లేరే|

  రిప్లయితొలగించండి
 28. సుకవి మిత్రులు బూసారపు నర్సయ్యగారికి ధన్యవాదములు! _/|\_

  రిప్లయితొలగించండి
 29. వల్లూరు మురళి గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసార్హం. కాని మొదటి, మూడవ పాదాలలో ప్రాస తప్పింది. ‘వంగినదై’ అన్నదాన్ని ‘ఒంగినదై’ అన్నారు. సవరించండి.
  *****
  కె.ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఇడుముల తటబాటున బడి’ అనండి.

  రిప్లయితొలగించండి
 30. గురువుగారూ ధన్యవాదములు.
  శ్రీ బూసారపు నర్సయ్యగారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 31. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  గొడుగులు పట్టుడు నాకని
  జడ వేయక కురులు విడిచి జఘనము జూపే
  కడు పెడసరియగు పడతికి
  పడు చున్నను పెండ్లియాడువారే లేరే.

  రిప్లయితొలగించండి
 32. మాస్టరు గారికి, శ్రీ భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 33. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 34. కడునందము లేదని,తా
  మెడనెడ నుద్యోగమనియు,మిక్కిలి వయసున్
  ఎడమే యనుచు,వయసు,పై
  బడుచున్నను పెండ్లియాడు వారలు లేరే!

  ఎడనెడ కట్నము కోసము
  పడుచులు తామెంతొ చదివి,పదవినినున్నన్,
  కడునాకృతి యందముగా
  పడుచున్నను పెండ్లియాడువారలు లేరే!

  ఎడనెడ పెద్దల మాటల,
  కడుసంపాదనకు పోయి,కాగా ధనియై,
  గడిపియు కాలము,ముదిమది(ముదిమి+అది)
  పడుచున్నను పెండ్లియాడు వారలు లేరే!

  విడివిడి వృత్తులు ననుచును,
  విడివిడి కులములు ననుచును,విడ సంబంధాల్
  ఎడనెడ చదువే చాలక,
  పడుచున్నను పెండ్లియాడు వారలు లేరే!

  రిప్లయితొలగించండి
 35. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘వయసున్+ఎడమే’ అని విసంధిగా వ్రాసారు.

  రిప్లయితొలగించండి
 36. విడువక ఛాందస భావము
  కడు వింతల నడవడికలు కలిగిన యింటన్
  చెడునెరుగని సుందరమౌ
  పడు చున్నను పెండ్లియాడు వారే లేరే!

  రిప్లయితొలగించండి
 37. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  కొంచెము మేలుంగీడుల
  నెంచు కొనుచు భువిని నేతలే లంగా నా
  కించి త్పేచీ రగులక
  నించుక మమతలకు దోవతి దియన చెల్లున్

  రిప్లయితొలగించండి
 38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 39. ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ....

  కడు చిన్నతనములో దే
  వుడు పిలువగ పోయె భర్త, పుణ్యంబౌ నీ
  పడుచుకు పెండ్లి కుదిర్చిన
  పడు చున్నను పెండ్లి యాడు వారే లేరే !

  రిప్లయితొలగించండి
 40. జడ కోసి రంగు రుద్దియు
  నడి వీధిని జీన్సు తొడిగి నవ్వుల తోడన్
  నడుమొంచుచు యువకులపై
  పడు చున్నను పెండ్లియాడువారే లేరే!

  రిప్లయితొలగించండి
 41. అడుగో! శాస్త్రిని చూడుము!
  వడుగై చేపలను తినక బంగాలందున్
  కడుపున్ కాల్చెడి బాధలు
  పడుచున్నను పెండ్లియాడువారే లేరే 😢

  రిప్లయితొలగించండి