రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘లాస్యముగను+అఖిల’ సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాసారు.‘లాస్యమాడ| నఖిల...’ అనండి. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, _/\_ ***** వల్లూరు మురళి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘ఆకట్టుకునేందుకు’ అని వ్యవహారికారికాన్ని ప్రయోగించారు. ‘కవన + అర్ధము’ అని విసంధిగా వ్రాసారు. మూడవపాదంలో యతి తప్పింది. సవరించండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, శబ్దానికి ఉన్న అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పొచిరాజు సుబ్బారావు గారూ, మీరు కూడా గుండా వారివలె అన్యార్థంతో చక్కని పూరణ చెప్పారు.అభినందనలు. ***** మంద పీతాంబర్ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. బూ‘తుదలను’... అర్థం కాలేదు. ఓహో... పూవుల తుదలా? కాని దాని అర్థం? ***** బుసారపు నర్సయ్య గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఒక్కడు+అత్యంత’ అన్నప్పుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాసారు. ‘చదువ డొక్కడు నత్యంత’ అనండి. అలాగే ‘మదిని తాను’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘కానుక+ఇచ్చె’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘కానుక యిడె’ అనండి. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘అందు+అఖిల’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘సమయమందె| యఖిల...’ అనండి. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా చివరిది నాకు బాగా నచ్చింది. అభినందనలు. ‘కవులు+అఖిల’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘కవులె| యఖిల’ అనండి. ‘కవులు+ఇలను+అట్టి= కవు లిల నట్టి’ అవుతుంది. ‘కవులు భువిని| నట్టి’ అనండి. ‘సాధనముకు’ అనరాదు. ‘సాధనమునకు’ అనాలి. అక్కడ ‘సాధనమున’ అనండి.
నవర సమ్ములు నిండిన నాణ్య మనుచు
రిప్లయితొలగించండికవులు చొప్పించి యొప్పింప కవన మందు
లలిత శృంగార హాస్యముల్ లాస్య ముగను
అఖిల కవిమాన్యమై యలరారు బూతు
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిబూతు పద్యమ్ము లేకున్న రోతురనుచు
సకల జనులను రంజింప శ్రావ్యమయ్యు
నఖిలకవిమాన్యమై యలరారు బూతు
పద్యముల్ కవి చౌడప్ప వ్రాసెఁ గనుఁడు!
రిప్లయితొలగించండిశంకరాభరణమ్మాయె "ఆంధ్రా"యుడి యాపు
చదివేరు సకల జనులెల్ల సుద్ది బుద్ధి
పోలింగు నాడు ఓటర్ల ఉత్తెజింప
అఖిలకవిమాన్యమై యలరారు బూతు.
చీర్స్
జిలేబి
నేటియువతనాకట్టుకు నేందు కేగ
రిప్లయితొలగించండివర్ధమాన గేయ కవన అర్ధమందు
ద్వంద్వ తాత్పర్య భావము వొందు రీతి
నఖిలకవిమాన్యమై యలరారు బూతు
ప్రభువు వేంచేయు వేళలో రమ్యముగను
రిప్లయితొలగించండిచెలఁగి దీర్ఘ సమాసముల్ శ్రేష్టుడనగ
నఖిల కవిమాన్యమై యలరారు బూతు
స్తోత్ర పఠనంబు సభలోన సొబగులంది!
( బూతు=భట్రాజు)
మంచి కావ్యము వ్రాసిన నంచితముగ
రిప్లయితొలగించండిఅఖిల కవి మాన్యమై యలరారు, బూతు
పెండ్లి సమయాన వచ్చు చు బ్రేమ మీర
క్రొత్త జంటకా శీ సుల నిత్తు రార్య !
ఇలా పూరించ వచ్చో లేదో తెలియదు దోషముంటే క్షమించగలరు .
రిప్లయితొలగించండిపద్య రచనల ప్రోత్సాహ పరచు నట్టి
కంది శంకరు సాహితీ క్రతువు జూడ
నఖిల కవిమాన్యమై యలరారు , బూ 'తు
దలను' కూర్చి వేతముకవి గళము నందు !!!
బూసారపు నర్సయ్య గారి పూరణ.....
రిప్లయితొలగించండిపరిణయమ్మునఁ గట్టిన పట్టువలువ
లఖిల కవి మాన్యమై యలరారు; బూతు
ననుచు మొగ్గ నవ్వుచుఁ బూచినట్లు దోచు;
మమత గలిగిన దఖిలమ్మ మంచిపిల్ల.
(అఖిలకు + అవి)
అఖిల కవి మాన్యమై యలరారు, బూతు
రిప్లయితొలగించండిరచనయైవెల్గె ప్రబంధ మదియె
చంద్రరేఖావిలాపమ్ము జగ్గకవిత,
చెప్పలేమింక బూతు చౌడప్ప కవిత
ఆగస్టు 20, 2015 11:05 [AM
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘లాస్యముగను+అఖిల’ సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాసారు.‘లాస్యమాడ| నఖిల...’ అనండి.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
_/\_
*****
వల్లూరు మురళి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఆకట్టుకునేందుకు’ అని వ్యవహారికారికాన్ని ప్రయోగించారు. ‘కవన + అర్ధము’ అని విసంధిగా వ్రాసారు. మూడవపాదంలో యతి తప్పింది. సవరించండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
శబ్దానికి ఉన్న అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పొచిరాజు సుబ్బారావు గారూ,
మీరు కూడా గుండా వారివలె అన్యార్థంతో చక్కని పూరణ చెప్పారు.అభినందనలు.
*****
మంద పీతాంబర్ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బూ‘తుదలను’... అర్థం కాలేదు. ఓహో... పూవుల తుదలా? కాని దాని అర్థం?
*****
బుసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవులు చౌడప్ప ఘనతను గౌరవించి
రిప్లయితొలగించండిబూతు మాటల పాటల బురద తోని
చలన చిత్రాల నింపగ చక్షు ప్రీతి
అఖిల కవిమాన్యమై యలరారు బూతు
ప్రజల మేలును కాంక్షించు ప్రతిరచనయు
రిప్లయితొలగించండినఖిల కవి మాన్యమై యలరారు, బూతు
పొగడు చుండును జనులను పొలుపుమీర
పొందు కాన్కల నెన్నియో విందుగాను!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కవి వరేణ్యుడు చౌడప్ప కందములను
రిప్లయితొలగించండిచదువరొక్కడు అత్యంత శ్రద్ధ తోడ
చదివి తలపొసె నీరీతి మదిన తాను
అఖిల కవిమాన్యమై యలరారు బూతు
కవి వరేణ్యుడు చౌడప్ప కందములను
రిప్లయితొలగించండిచదువరొక్కడు అత్యంత శ్రద్ధ తోడ
చదివి తలపొసె నీరీతి మదిన తాను
అఖిల కవిమాన్యమై యలరారు బూతు
పదుగురి తలలో నాలుకై పల్కు కవిత
రిప్లయితొలగించండియఖిల కవిమాన్యమై యలరారు, బూతు
లేక భువిపైన పుట్టుక లేనె లేదు
కామశాస్త్రమున్ జగతికి కానుకిచ్చె
భరత దేశమే యనుమాట కరము నిజము
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిసరస శృంగార రచనల సమయమందు
అఖిలకవిమాన్యమై యలరారు బూతు
చేరి యాసన్న పదముల చెంతలోన
మంచి భావమ్ము కల్గిన మాట యగును.
భూరి కవులకు కవిరాజపురము వాసి
రిప్లయితొలగించండియెన్నికలవేళ నందరు నిచటి కవులు
వెడల బూతున కోటుల వేయదలచి
అఖిలకవిమాన్యమై యలరారు బూతు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఅపుడు '' శ్రంగారనైషధ '' మద్భుతమ్ము
గాగ రచయించె శ్రీనాధ కవివరుండె ;
యఖిల కవిమాన్యమై యలరారు బూతు
లుత్త మోత్తమ కైతలే యుర్వినిపుడు !
భవితబంగారు బాటగా పలుకుకవిత
రిప్లయితొలగించండిఅఖిల కవిమాన్య మై యలరారు|బూతు
నీతి చౌడప్ప పద్యాలు జాతిహితమె|
కవులకల్పన లోక సంకల్ప ఫలము.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒక్కడు+అత్యంత’ అన్నప్పుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాసారు. ‘చదువ డొక్కడు నత్యంత’ అనండి. అలాగే ‘మదిని తాను’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కానుక+ఇచ్చె’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘కానుక యిడె’ అనండి.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అందు+అఖిల’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘సమయమందె| యఖిల...’ అనండి.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అఖిల రసముల శృంగారమాఢ్యమదియ
రిప్లయితొలగించండిదానికవితల చిందించి తనరిరెంతొ
పొసగు శృంగారమదియెంతొ బూతుగాదె
అఖిలకవి మాన్యమై యలరారుబూతు
బూతు లెన్నిటొ తిట్టుచు పూనిచెప్ప
సంఘ దౌష్ట్యంబు మాన్పగా సాధ్యమనుచు
నీతి పాటింప జేసిరి నేటికవులు
అఖిలకవి మాన్యమై యలరారుబూతు
నిందతోడను స్తుతియించి నేర్పుమీర
కైతజెప్పిరి కొందరు కవులు యిలను
అట్టి కైతల రచియించి యాఖ్యత గొన
అఖిలకవి మాన్యమై యలరారు బూతు
సరసమౌ గతిని సమస్య సాధనముకు
పృచ్ఛకాళియు బూతుల పెద్దనిడగ
విరుపునను దాని పూరణ వేగసలుప
అఖిలకవి మాన్యమై యలరారు బూతు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా చివరిది నాకు బాగా నచ్చింది. అభినందనలు.
‘కవులు+అఖిల’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘కవులె| యఖిల’ అనండి.
‘కవులు+ఇలను+అట్టి= కవు లిల నట్టి’ అవుతుంది. ‘కవులు భువిని| నట్టి’ అనండి.
‘సాధనముకు’ అనరాదు. ‘సాధనమునకు’ అనాలి. అక్కడ ‘సాధనమున’ అనండి.
మహిత వాక్కులును బుద్ధిమంతులైన
రిప్లయితొలగించండిఅఖిలకవిమాన్యమై యలరారు, బూతు
మాటల విన నిష్ట పడరు, మానవుండు
ప్రజలు మెచ్చుమంచి పలుకు పలకవలెను
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ: కరము నందుగంట మొకటి కమ్మగాను
రిప్లయితొలగించండిదాల్చి కావ్యమ్ము వ్రాయంగ తాల్మితోడ
కృతియు కర్తను పొగడంగ ఖ్యాతి వచ్చె/కాసులొచ్చె
అఖిల కవిమాన్యమై యలరారు బూతు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కసులొచ్చె’ అనడం గ్రామ్యం.
నాటిదేవాలయాలలోచాటుటాయె|
రిప్లయితొలగించండిరాసికరాజులబొగడి విరక్తిలేక
పళని,చౌడప్పపద్యాలు బత్తిజూడ
అఖిలకవిమాన్యమై యలరారుబూతు.
కే. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘..బట్టిచూడ’ టైపాటు వలన ‘...బత్తిచూడ’ అయినట్టుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారికి వికసించిన పూవులను కూర్చి మీ గళంలో మాలవేయ ప్రయత్నించాను .
రిప్లయితొలగించండినా మఱొక పూరణము:
రిప్లయితొలగించండికందపద్యాలఁ బది నీతి కథలుఁ బదియు
బూతులం జెప్పఁగాఁ దానుఁ బూనుకొనియు
సర్వులును మెచ్చ రచియించు చౌడ సుకవి
కఖిలకవిమాన్యమై యలరారు బూతు!