శ్రీమహా విష్ణువు హృదయములో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. మరియా విష్ణుమూర్తిని నిరంతర ధ్యానముతో పరమేశ్వరుడు తన హృదయములో నిల్పుకొన్నాడు కదా. దీని ప్రకారము ఈశ్వరుని హృదయములోనూ లక్ష్మీ దెవి ఉంటుందనే భావనతో చేసిన పూరణ.
రాజేశ్వరి అక్కయ్యా, సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారం. నా ఈ పూరణను పరిశీలించి తప్పులున్న తెలియచేయగలరు. కొత్తగా రాస్తున్నాను కనక నా వీలు కోసం పద్యం రాసి, నేను రాసిన పాదాలకు గణ విభజన చేసి సరిచూసుకుంటాను. అది కూడా మీ పరిశీలనకు పంపుతున్నాను. ఇందరు పెద్ద పండితుల మధ్య దీనిని చిన్న చేష్టగా భావించరని ఆశిస్తున్నాను.
రత యుద్ధంలో సైన్యాన్ని చంపింది అదృశ్య రూపంలో ముందున్నశివుడే అని చదివి నట్లు గుర్తు. భారత యుద్ధమందునను పాండవు లందర రక్షచేసె నా శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు, శివుండె శంభుడే మారణహోమమున్ సలిపె మార్కొని చెచ్చెర వైరిమూకల న్నారణమందు సైన్యమున కగ్రపు భాగమునందు నిల్చి తాన్
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారం. మరొక్కసారి నా క్షమాపణలు. ఎందువల్లనో నేను సరిగా చూసుకొనలేదు. ఈ మారు మొదటిసారిగా ఉత్పలమాల పద్యరచనకు ప్రయత్నించాను. దయచేసి పరిశీలించి తప్పులను తెలియచేయగలరు.
శ్రీ రఘు వీరుడే తరుణి శ్రీనిజ మానస మేగనీ నారీ శ్రీ రమ యన్ను చే కొనగ శ్రీఘ్రముగా విలు కూర్చగా, హరే భారము నీదియే నుమరి భాజనమేనాది! అన్న ఈశుడే శ్రీ రమణీలలామనెదజేర్చినవాడు శివుండె శంభుడే
వేదుల సుభద్ర గారూ, మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. నా మొట్టమొదటి ఉత్పలమాల కంటె మీ పద్యం ఎన్నోరెట్లు మెరుగు. సమస్యాపూరణ విషయం ప్రక్కన బెడితే మీ పద్యంలో మొదటిపాదంలో (నీ నారీ), మూడవపాదంలో (మేనాది) గణదోషం. కృషి చేస్తే మీరు చక్కని పద్యాలను వ్రాయగలరని నిశ్చయంగా చెపుతున్నాను. స్వస్తి! ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు... రెండు మూడు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మూడురోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. ఈ మూడురోజులు పద్యరచన శీర్షిక ఉండదు. సహృదయంతో మన్నించి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
ఆ రమణీయ తల్పమున,నారమ తోడుత పవ్వళించియున్ తోరపు భక్తి తోడ తను దోయిలి నొగ్గియు వేడువారికిన్ భారములన్ని తీర్చుచును భక్తులగాచుచు మోక్షమిచ్చు నా శ్రీ రమణీలలామ నెదజేర్చిన వాడు శివుండె శంభుడే
శంభుడు=విష్ణువు,శివుడు,బ్రహ్మ.
తోరపు బొజ్జ వానినటు తుష్టు గణాధిపు జేసియుండియున్ ధారగ గంగ,జూటమున దాల్చియు,పార్వతినర్ధదేహమున్ జేరగ జేసి,యామెకను,జీవులకెల్ల భవంబు గూర్చు,నా శ్రీ రమణీలలామ నేదజేర్చిన వాడు శివుండె శంభుడే=శివుడే
నేరము లేదు నావలన నీరజ! దాల్చితి నిన్ను గుండెలో!
రిప్లయితొలగించండిపోరగనేల నీవిటుల పోలిక శంభుని తోడ దెచ్చి యే
కారణమేమి లేక? ప్రియ! కంధిజ! హాటక వర్ణ వర్ణితా!
శ్రీ! రమణీలలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే??
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తారిష మందుబు ట్టెనట తామర సాక్షికి చింత యేలనో
రిప్లయితొలగించండిమారగ రూపురే ఖలవి వారిజ లోచని నారిగా యటన్
కోరగ భర్తగా మదిని కోమలి పార్వతి భక్తి మీరినన్
శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు శివుండె శంభుఁడే
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసార్హం. అభినందనలు.
అన్వయలోపం ఉన్నట్టుగా తోస్తున్నది. రెండవపాదంలో యతి తప్పింది. సవరించండి.
తారిష మందుబు ట్టెనట తామర సాక్షికి చింత యేలనో
రిప్లయితొలగించండిమారగ రూపురేఖ లవి మానిని మోహన సుందరాం గియై
కోరగ భర్తగా మదిని కోమలి మారుడ టంచు శ్రీహరిన్
శ్రీరమణీ లలామనెదఁ జేర్చినవాఁడు శివుండు శంభుఁడే
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
వైరుల బోరలే ననుచు పార్థుడు పల్కగ బోధ జేయుచున్
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు,"శివుండె శంభుఁడే
దారిని చూపువా"డనుచు ధైర్యము కల్గగ విశ్వరూప మా
కారము కాగ జెప్పె మమకారము హెచ్చగ గీత శాస్త్రమున్.
శ్రీరమ విష్ణుమూర్తి దరి జేరుచు బల్కెను నాథ! చెప్పుమా
రిప్లయితొలగించండిమీ రమణీయ వక్షమున మిన్నగ నుందును నేను, డెందమున్
జేరుచునెవ్వరుండునన జెప్పెను నవ్వుచు లోకనాథుడా
శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు, - " శివుండె శంభుఁడే ".
ఆరయ నాదిలక్ష్మి సమదంచిత రీతి నశేష దైత్య సం
రిప్లయితొలగించండిహార గుణప్రవిష్టుఁడగు నాహరి డెందమునందు నుండునే
కోరి భజించునీశ్వరుఁడకుంఠిత దీక్ష హరిన్ తదర్థమే
శ్రీరమణీలలామ నెద జేర్చినవాఁడు శివుండు శంభుడే.
గురువుగారు,
రిప్లయితొలగించండినమస్సులు.
శ్రీమహా విష్ణువు హృదయములో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. మరియా విష్ణుమూర్తిని నిరంతర ధ్యానముతో పరమేశ్వరుడు తన హృదయములో నిల్పుకొన్నాడు కదా. దీని ప్రకారము ఈశ్వరుని హృదయములోనూ లక్ష్మీ దెవి ఉంటుందనే భావనతో చేసిన పూరణ.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారం. నా ఈ పూరణను పరిశీలించి తప్పులున్న తెలియచేయగలరు. కొత్తగా రాస్తున్నాను కనక నా వీలు కోసం పద్యం రాసి, నేను రాసిన పాదాలకు గణ విభజన చేసి సరిచూసుకుంటాను. అది కూడా మీ పరిశీలనకు పంపుతున్నాను. ఇందరు పెద్ద పండితుల మధ్య దీనిని చిన్న చేష్టగా భావించరని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండికం. శ్రీరాముని చేత నమరియు
ధారణిజ కనుల మినుకుల దన్నుగ నటులే
హోరున కూలిన విల్లయి
శ్రీ రమణీ లలామనెదచేర్చినవాడు శివుండు శంభుడే
గణ విభజన:
శ్రీ రాము|ని చేత| నమరియు
UII IUI IIII
ధారణి|జ కనుల |మినుకుల| దన్నుగ| నటులే
UII IIII IIII UII IIU
హోరున| కూలిన |విల్లయి
UII UII UII
శ్రీ రమణీ లలామనెదచేర్చినవాడు శివుండు శంభుడే
వేదుల సుభద్ర గారూ,
రిప్లయితొలగించండిసమస్య పాదం ఉత్పలమాల. మీరు కందపద్యాన్ని ప్రయత్నించారు. సవరించడానికి అవకాశం లేదు. మన్నించండు. వీలైతే ఉత్పలమాల ప్రయత్నించండి.
ఆరయ విష్ణువు న్హృదిని దాల్చిన వాడట యౌనుగా మఱి న్
రిప్లయితొలగించండిశ్రీ రమణీ లలామ నెద జేర్చినవాడు శివుం డె, శంభుడే
పారము ని చ్చువాడు నిల పామర భేదము నించు కైనను
న్భా రముగా దలంపకను బంధు గణం బును బ్రోచునే గదా
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మన్నించాలి గురువుగారు. చాలా తప్పు జరిగింది. ఉత్పల మాల పద్యం ప్రయత్నించి పంపుతాను.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండిమార రిపుండు గోవుగను మారియు, దుగ్ధము నీయకున్నఁ, దా
దారగ చోళభూపతి సుతన్ దగ నెట్టుల పొందునో? కనన్
శౌరికి శ్రీనివాసునకు సాధు జనార్చన వందనాలికై
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు శివుండు శంభుఁడే!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరత యుద్ధంలో సైన్యాన్ని చంపింది అదృశ్య రూపంలో ముందున్నశివుడే అని చదివి నట్లు గుర్తు.
రిప్లయితొలగించండిభారత యుద్ధమందునను పాండవు లందర రక్షచేసె నా
శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు, శివుండె శంభుడే
మారణహోమమున్ సలిపె మార్కొని చెచ్చెర వైరిమూకల
న్నారణమందు సైన్యమున కగ్రపు భాగమునందు నిల్చి తాన్
కోరి గజాసురుండు శివుఁ గూర్చెను గర్భమునన్ వసించగన్,
రిప్లయితొలగించండిశ్రీరమణీ లలామ నెద జేర్చినవాడు, శివుండె శంభుడే
చేరగ పార్వతిన్ రయమె చిత్రపు రీతిగ గంగిరెద్దుతో
మారణ హోమమున్ సలిపె మానిని చిత్తము సంతసించగన్!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భారముగాగ భూమికి, నపాయముగాగ జనాళికెల్ల సం
రిప్లయితొలగించండిచారముఁ జేయు దుర్జనులఁ జంపగ సింగమునెక్కివచ్చు నా
మారమ; శూరతన్ తనకు మారగు పేరుగ, నిండి పొంగు ధీ
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే.
భారముగాగ భూమికి, నపాయముగాగ జనాళికెల్ల సం
రిప్లయితొలగించండిచారముఁ జేయు దుర్జనులఁ జంపగ సింగమునెక్కివచ్చు నా
మారమ; శూరతన్ తనకు మారగు పేరుగ, నిండి పొంగు ధీ
శ్రీ, రమణీలలామ; నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారం. మరొక్కసారి నా క్షమాపణలు. ఎందువల్లనో నేను సరిగా చూసుకొనలేదు. ఈ మారు మొదటిసారిగా ఉత్పలమాల పద్యరచనకు ప్రయత్నించాను. దయచేసి పరిశీలించి తప్పులను తెలియచేయగలరు.
రిప్లయితొలగించండిశ్రీ రఘు వీరుడే తరుణి శ్రీనిజ మానస మేగనీ నారీ
శ్రీ రమ యన్ను చే కొనగ శ్రీఘ్రముగా విలు కూర్చగా, హరే
భారము నీదియే నుమరి భాజనమేనాది! అన్న ఈశుడే
శ్రీ రమణీలలామనెదజేర్చినవాడు శివుండె శంభుడే
రిప్లయితొలగించండిక్షీర సముద్ర మంథనము జేయుచునుండగ దేవదానవుల్
వారిధి గ్రు౦క భూధరము భారము మోసిన కూర్మనాథుడే
శ్రీ రమణీ లలామ నెద జేర్చినవాడు.శివుండె శంభుడే
ఘోర విషమ్ము గ్రోలె నొక గ్రుక్కను లోకులు హర్షమందగా
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండికోరి విశిష్ట యజ్ఞమని కోమలి గాంచగ బోవ , తండ్రియే
వైరము జూప భర్తపయి,వహ్నిని దూకి ,హిమాద్రి బుట్టి తా
చేరెను నాధు సన్నిధిని , చిత్రముగా మరుడూత నీయగా,
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆరమపుట్టు కెక్కడిది?అందరుసాంద్రము జిల్కనిల్చెగా|
రిప్లయితొలగించండిదారగబుట్టగా గరళ దారను మ్రింగకయున్న?జీవులే .
చేరరు లోకమందు పరిశీలనజేసియునెంచబూనగా
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే.
వేదుల సుభద్ర గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసింపదగినది. నా మొట్టమొదటి ఉత్పలమాల కంటె మీ పద్యం ఎన్నోరెట్లు మెరుగు. సమస్యాపూరణ విషయం ప్రక్కన బెడితే మీ పద్యంలో మొదటిపాదంలో (నీ నారీ), మూడవపాదంలో (మేనాది) గణదోషం. కృషి చేస్తే మీరు చక్కని పద్యాలను వ్రాయగలరని నిశ్చయంగా చెపుతున్నాను. స్వస్తి!
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు...
రిప్లయితొలగించండిరెండు మూడు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మూడురోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. ఈ మూడురోజులు పద్యరచన శీర్షిక ఉండదు. సహృదయంతో మన్నించి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
ధారుణి సృష్టియందున విధాతకు తోడుగ వాణి జేర్చగన్,
రిప్లయితొలగించండిక్షీర సముద్రమందు గల శ్రీహరి పాలన కార్యమున్ సుసం
పూర్ణము సేయగా తలచి పూర్వతపంబుల పుణ్యరాశియౌ
శ్రీ రమణీలలామనెదజేర్చినవాడు శివుండు శివుడే.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండికూరిమి నా గజాసురుఁడు కోరియు దేవతలన్ మహాపదన్
గూరఁగఁ జేయ, వారు హరు గొబ్బునఁ జేరియు, రక్ష వేడ, నా
గౌరు శిరమ్ముఁ ద్రుంచియుఁ, ద్వగంబరముం గొని, వేగ నిర్వృతి
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె, శంభుఁడే!
మంథా శ్యామల గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో ప్రాస తప్పింది. ‘సువి|స్తారము సేయగా మదిని దల్చి తపంబుల....’ అందామా?
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ రమణీయ తల్పమున,నారమ తోడుత పవ్వళించియున్
రిప్లయితొలగించండితోరపు భక్తి తోడ తను దోయిలి నొగ్గియు వేడువారికిన్
భారములన్ని తీర్చుచును భక్తులగాచుచు మోక్షమిచ్చు నా
శ్రీ రమణీలలామ నెదజేర్చిన వాడు శివుండె శంభుడే
శంభుడు=విష్ణువు,శివుడు,బ్రహ్మ.
తోరపు బొజ్జ వానినటు తుష్టు గణాధిపు జేసియుండియున్
ధారగ గంగ,జూటమున దాల్చియు,పార్వతినర్ధదేహమున్
జేరగ జేసి,యామెకను,జీవులకెల్ల భవంబు గూర్చు,నా
శ్రీ రమణీలలామ నేదజేర్చిన వాడు శివుండె శంభుడే=శివుడే
పారములేని వేదమును,వాణిని నాల్కనునిల్పి,వానిచే
నీరమునాది పంచకము నిచ్చియు,జీవులసృష్టి జేయుచున్
వారకెల్ల సంపదలు,బాగుగ కీడుల వ్రాయుచుండ్రు ,నా
శ్రీ రమణీలలామ నెద జేర్చినవాడు శివుండె?శంభుడే!=బ్రహ్మ
తోరపు పాలనంబునను,దుష్టుల శిక్షణ,శిష్ట రక్షణన్
భారము నాదె యంచు భువి పాలితులెల్లర,లోటులేకయే
వారణ లేని రక్షయయి,వంద్యుడునయ్యెడి రాజ్యలక్ష్మియున్
శ్రీ రమణీలలామ నెద జేర్చినవాడు శివుండె శంభుడే
మంగళము గూర్చువాడు,శాంతిదాత అయిన ప్రభువు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శ్రీ రఘువంశదీపకుడు శ్రీపతి జిష్ణువు పద్మనాభుడే
రిప్లయితొలగించండిశ్రీ రమణీ లలామనెద జేర్చినవాడు, శివుండె శంభుడే
కోరివరించి పార్వతిని కూరిమితోతన మేనదాల్చె నా
సారసగర్భుడే సతిని సాతముతో హవనించెమోమునన్!!!
కోరిన వెంటనే రమణి కోర్కెను తీర్చెడి నాథుడెవ్వడో
రిప్లయితొలగించండినేరుగ చెప్పరా మగడ! నీవెగ నీవెనటంచుచున్ యెదన్
పోరును బెట్టగా కమల;...పోకిరి చూపుల తోడ నిట్లనెన్
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు: "శివుండె శంభుఁడే!"
రిప్లయితొలగించండివీరుడు తానెవండు సఖి వెంబడి వచ్చుచు నిన్ను కోరుచున్?
కారణ మెవ్వడే సఖియ కంజముఖీ!నిను చూడముచ్చటై
సోరణి దివ్వె వెల్గుల సుశోభితుడై నిను చేరె నెవ్వడే?
శ్రీరమణీ! లలామ! నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే!
జిలేబి
భోలా శంకర పురాణము:
రిప్లయితొలగించండికారపు నావకాయనిడ గౌరిని వీడుచు వెండికొండనున్
పారుచు విష్ణులోకమున భళ్ళున నేడ్వగ వెన్నుడంతటన్
కోరగ లక్ష్మినాదటను కొద్దిగ నాతని బుజ్జగించమన్
శ్రీరమణీలలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే