గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ******* కెంబాయి తిమ్మాజీరావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ******* అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ******** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
బూసారపు నర్సయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. చివరి పాదాన్ని "వొప్పులకుప్ప...." ప్రారంభించారు. వు,వూ,వొ,వో లతో ప్రారంభమయ్యే తెలుగు పదాలు లేవు కదా! "తప్పదె| యొప్పులకుప్పవు....." అందామా?
గొప్పగు సంబంధంబిది
రిప్లయితొలగించండిచెప్పెద నీ మేలుగోరి సితపద్మాక్షీ!
చప్పున నొప్పుకొనమ్మా!
యొప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
తప్పులు కనుగొన జాలని
యొప్పులకుప్పవు "వలదను టొప్పదు నీకున్
మెప్పులు పొందగ" సభలో
జెప్పగ నిను గూర్చితెలిసె స్నేహిత!జేజే!!
మొప్పెతనము వీడక నను
రిప్లయితొలగించండిదప్పదలచి నీవిటు ముగుద! బొలయ దగునే?
తిప్పలు బెట్టుచు లలనా!
ఒప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*******
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మజేటి సుమలత గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండి(పెండ్లివయస్సు వచ్చిననుఁ బెండ్లికి నిష్టపడని మనుమరాలిని బుజ్జగించుచున్న నాయనమ్మ మాటలు)
"చెప్పఁగదే తప్పగునా?
తిప్పలనకు! మనువె యిఁక! పతిం గొలువ, సుతున్
మెప్పుగ నందెద వీవే!
యొప్పులకుప్పవు! వలదను టొప్పదు నీకున్!!"
మజేటి సుమలత గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం: అప్ప కొడుకు నీకు వరుస
రిప్లయితొలగించండిఒప్పుల కుప్పవువలదనుటొప్పదు నీకున్
తిప్పలు తప్పును నాకున్
ఒప్పుకొని ముదమొనరించు మో సుపుత్రీ.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిచెప్పులె యరుగగ తిరుగుచు
గొప్ప వరుని మగనిగ గని గొని తెచ్చితినే !
తిప్పలు పెట్టక , సరెయను
మోప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్.
అప్పల రమణుని కూతుర !
రిప్లయితొలగించండియొ ప్పుల కుప్పవు, వలదను టొ ప్పదు నీకు
న్విప్పారిన గన్నులు గల
చప్పిడి నాగయ్య నీకు సరియగు నుమఱి న్
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
అప్పటి మాటలునాటలు
రిప్లయితొలగించండినప్పటి నెయ్యము మరచితిననగా తగునే?
యిప్పుడు నటులే యుందము,
ఒప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్.
తప్పులు జేసిన ప్రియసఖి!
రిప్లయితొలగించండిచెప్పుము సవరించు కొందు, చిత్తములోనన్
ఎప్పుడొ నిల్పితి నును నా
ఒప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్.
రిప్లయితొలగించండి"ఎప్పటికిని నీవే నా
యొప్పులకుప్పవు .వలడను టొప్పదు నీకున్
తిప్పలు బెట్టకు చెంచిత"
అప్పల నరసింహ మనియె నారణ్యమునన్
చెప్పుడుమాటలు వినకుము
రిప్లయితొలగించండితప్పక వరియించుమమ్మ తనివిగ బావన్
తిప్పలుతప్పును తండ్రికి
నొప్పులకుప్పవు వలదను టొప్పదునీకున్
మెప్పుగ ' హోదా ' నడిగిన
రిప్లయితొలగించండినొప్పులకుప్పవు, వలదను టొప్పదు నీకున్
ముప్పవరపు వేంకయ! యే
గొప్ప సహాయమొనరింత్రు కొలువై మీరున్!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*******
కెంబాయి తిమ్మాజీరావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*******
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
********
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మెప్పులకు బోతి నప్పుల
రిప్లయితొలగించండిజెప్పితి నాతిప్పలుగను చెలియా విను నీ
వప్పుగ నియ్యక తప్పదు
వొప్పుల కుప్పవు వలదనుటొప్పదు నీకున్
బూసారపు నర్సయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదాన్ని "వొప్పులకుప్ప...." ప్రారంభించారు. వు,వూ,వొ,వో లతో ప్రారంభమయ్యే తెలుగు పదాలు లేవు కదా! "తప్పదె| యొప్పులకుప్పవు....." అందామా?
చెప్పగ మెప్పునుబొందిన
రిప్లయితొలగించండిఒప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్
తప్పకరావే స్నేహిత
గొప్పగునీయాట గెలుపుకోరకరాదే
|ఒప్పులకుప్ప=చిన్నారులాట|
2.పప్పుల బెల్లం బట్లుగ
పప్పుననుప్పుండు రీతి పడతివి ‘నాకున్
గప్పునయవ్వన బృతినే
ఒప్పులకుప్పవువలదను టొప్పదునీకున్”.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గొప్పగను వరూధినియను
రిప్లయితొలగించండినొప్పిన యందాననుండు నుత్తమ వనితై
యప్పనమగుచును పలికెను
"ఒప్పుల కుప్పవు వలదనుటొప్పదు నీకున్"
అప్పురి కీచకుడిట్లను
"నప్పున యైతిని సొగసుకు"నని సైరంధ్రిన్
చప్పున చేరగ రమ్మనె
"నొప్పులకుప్పవు వలదనుటొప్పదు నీకున్"
అప్పుడు లంకకు సీతను
గొప్పగు రావణుడిటులనె కోసల విభుచే
తిప్పననందక చేరవె
యొప్పులకుప్పవు వలదనుటొప్పదు నీకున్
రెప్పల తాటించు సొగసు
తెప్పున దుష్యంతుడపుడు తేకువ గని తా
నప్పుడు కణ్వజ కిట్లనె
"ఒప్పుల కుప్పవు వలదనుటొప్పదు నీకున్
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గొప్పగ దాగితివి గదా!
రిప్లయితొలగించండికప్పిన ముసుగున జిలేబి కానగ రావో!
చెప్పుము పేరును నూరును
నొప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్!
రిప్లయితొలగించండిలప్పున నిన్న కలిసితిమి
ఒప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్.
గప్పున వచ్చితి సామీ
చప్పున కైపదము చూడ చక్కగ నుండెన్
జిలేబి
చెప్పులు కొనటకు పాతవి
రిప్లయితొలగించండిరొప్పుచు రోజుచును నాకు రూకలు లేవే!
గొప్పగు మాదిగ దెచ్చితి
నొప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్