19, ఆగస్టు 2015, బుధవారం

Android App గా ‘శంకరాభరణం’ బ్లాగు!

ఆండ్రాయిడ్ ఫోన్‍లను ఉపయోగిస్తున్న మిత్రులకు...
ఇప్పుడు శంకరాభరణంబ్లాగు ఆండ్రాయిడ్ ఆప్‍గా అందుబాటులోకి వచ్చింది.
మీరు ఈ ఆప్‍ను మీ ఫోన్‍లోకి దిగుమతి చేసికొనడానికి క్రింది విధంగా చేయండి...
1) ముందుగా మీ ఫోన్‍లోని బ్రౌజర్‍లో శంకరాభరణం బ్లాగును తెరవండి.
2) బ్లాగుకు పూర్తిగా క్రింద Home (హోమ్) క్రింద ‘View web version' (వెబ్ సంస్కరణలను చూడండి) అన్నదాన్ని క్లిక్ చేయండి.
3) బ్లాగు కంప్యూటర్ తెర మీద కనిపించే విధంగా తెరుచుకుంటుంది. కుడివైపు ఉన్న లింకులు...క్రింద ఆండ్రాయిడ్ App గా శంకరాభరణంఅన్నదానిని క్లిక్ చేయండి.
4) గూగుల్ డ్రైవ్ తెరుచుకుంటుంది. అందులో ఉన్న ‘Download' అన్నదానికి క్లిక్ చేయండి.
5) డౌన్‍లోడ్ అయ్యాక ‘Install' అన్నదానిని క్లిక్ చేయండి.
అంతే మీ ఫోన్‍లో శంకరాభరణం ఆప్ ఇన్‍స్టాల్ అవుతుంది. ఇక నేరుగా దానిని క్లిక్ చేసి బ్లాగులో ప్రవేశించవచ్చు.

(నాకు అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేదు. పై వివరణ సరిగా ఉందో లేదో? మిత్రు లెవరైనా సశాస్త్రీయంగా ఆ క్రమాన్ని వివరిస్తే సవరిస్తాను)
( ఈ ఆప్ రూపకల్పనకు సహకరించిన మా మేనల్లుళ్ళు చి. మిట్టపెల్లి ప్రశాంత్, ప్రవీణ్ లకు ధన్యవాదాలు, ఆశీస్సులు!)

5 కామెంట్‌లు:

  1. ఇది ప్లేస్టోర్ లో లభించదు. బ్లాగులో చెప్పిన విధంగా చేయాలి.

    రిప్లయితొలగించండి

  2. అయ్యవారయ్యేరు హై టెక్కు !
    శంకరాభరణమయ్యే "ఆంధ్రాయిణి"
    హైటెక్కు లోకాలు గుండెలు జల్లన
    కవివరుల్ పద్యాలయ్యే పదనిసల్ !

    శుభాకాంక్షల్ కంది వారికి :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ఆహా, దినదినమీ విధి
    సౌహార్ద్ర హృదయముతోడఁ జదివించంగన్
    సాహాయ్యముఁ జేయు జనుల
    బాహాటముగా నొనర్తు ప్రణతులనివిగో.

    గురువుగారు, నేను ఫోన్ లో ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నాను. కానీ ఈ పద్యం వ్రాసి ప్రచురించబోతే ప్రచురింపబడలేదు. ఇప్పుడు కంప్యూటర్ లోనే ప్రచురిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మీదేవి గారూ,
    నేను ఈ వ్యాఖ్యను 'ఆప్' ద్వారా పంపిస్తున్నాను.

    రిప్లయితొలగించండి