8, ఆగస్టు 2015, శనివారం

సమస్యాపూరణ - 1754 (పండితుఁ డన నెవఁడు పరమపామరుఁడు గదా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పండితుఁ డన నెవఁడు పరమపామరుఁడు గదా!

39 కామెంట్‌లు:

  1. మెండుగ జ్ఞానము గలదని
    పండితునిగ నిన్ను నీవు భావించకుమా
    నిండుగ గర్వము గలిగిన
    పండితుఁ డన నెవఁడు పరమపామరుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  2. నిండుగ వినయము గలిగిన
    చండాలుని కైన గాని చక్కని బుద్ధిన్
    దండిగ దర్పము నిండిన
    పండుతుఁ డన నెవఁడు పరమ పామరుఁడు గదా

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. కం: మెండగు జదువులు చదివియు
    దండిగ ధనమును గడించి దండగ మాటల్
    మొండిగ యాడెడి వానిని
    పండితుడన నెవడు పరమ పామరుడు గదా

    రిప్లయితొలగించండి

  5. శ్రీగురుభ్యోనమ:

    కొండొక చిన్నయయే ఘన
    పండితుఁ డన, నెవఁడు పరమపామరుఁడు గదా!
    నిండుగ పదహారేడులు,
    మెండుగ కృషి సల్పె జనులు మెచ్చగ సూరిన్


    రిప్లయితొలగించండి
  6. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. చండాలుడినా? నా లో
    నుండెడు యాత్మా? తొలంగ నుడువుమనుచు ను
    ద్దండుని మేల్కొలిపిన నా
    పండితుఁ డన నెవఁడు పరమపామరుఁడు గదా!
    ( ఆదిశంకరులు - చండాలుర సంవాదము )

    రిప్లయితొలగించండి
  9. నాగరాజు రవీందర్ గారూ ! భేషైన పూరణ ! శ్రీపతి శాస్త్రి గారి పూరణలో కించిదన్వయ ప్రమాదముందనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  10. గురుదేవులకు,
    కవిమిత్రులు శ్రీ నాగరాజు రవీందర్ గారలకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. మెండుగ జదువులు జదివియు
    నిండుగ మఱి మంచి సూక్తి నేర్పక యెపుడున్
    దండిగ దర్పము కలిగిన
    పండితుడన నెవడు పరమ పామరుడు గదా

    రిప్లయితొలగించండి
  13. ఖండితముగ నెరిగించు మ
    పండితుడన నెవరు? పరమ పామరుడు గదా!
    గండరగండడననెవరు?
    భండనమున విజయమ్ముఁబడయు దమనుడే

    రిప్లయితొలగించండి
  14. మెండుగ శాస్త్రములు జదివి
    చండాలపు పనుల తోడ సాహిత్యమునే
    చెండాడుచు కొంచెపఱచ
    పండితుఁడననెవఁడు పరమ పామరుడుగదా!!!

    రిప్లయితొలగించండి
  15. నిండుసభనప్రభువడిగెను
    పండితుడననెవడు? పరమపామరుడుగ, దా
    నుండగ నొప్పని వాడే
    పండితుడని దెలిపెనొక్క పండితుడకటా !!!

    రిప్లయితొలగించండి
  16. ఉండుము గమ్మున సభలో
    నండగ నేనుంటి గాదె? అడలెద వేలా?
    దండిగ నిత్తురు దాసూ!
    పండితు డన నెవరు పరమ పామరుడు గదా?

    (పూర్వపు కాళిదాసుతో పండితుని వేషములో సభకు రమ్మని మంత్రి అన్న మాటలు)

    రిప్లయితొలగించండి
  17. శ్రీ విష్ణునందన్ గారికి నమస్కారములు. ఆర్యా, పద్యమును పోస్ట్ చేసిన తరువాత నాకు కూడా అన్వయలోపముగానె అనిపించినది. పరవస్తు చిన్నయసూరిని పద్యములో చూపించే ప్రయత్నములో ఇద్దరు వ్యక్తుల సంభాషణగా ఊహించి వ్రాసినాను.

    మొదటివ్యక్తి: "బాలుడైన చిన్నయయే గొప్ప పండితుడు."
    రెండవ వ్యక్తి:"అనగా ఎవరు? పదహారేళ్ళు పూర్తగువరకు పరమ పామరుడు కదా".
    మొదటివ్యక్తి: "ప్రజలు పండితుడనే విధంగా మిక్కిలి కృషి చేసినాడు."

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి శాస్త్రి గారూ, సంతోషం. మీరు ఉదహరించిన సంభాషణా పూర్వక శ్లోక / పద్య నిర్మాణాన్ని సంస్కృత భాషా మర్యాదలననుసరించి ' వాకో వాక్ప్రక్రియ ' అంటారు , అయితే వాకోవాక్ప్రక్రియలో పాఠకుని సులభావగాహన కోసం ఏ వ్యక్తి సంభాషణ ఆ వ్యక్తికి విడదీసి రాయడమో లేక ఆధునిక కాలాన్ననుసరించి ( " " ) గుర్తులతో సూచించడమో కద్దు. మీ వివరణ ప్రకారం అనిష్టార్థకం కొంత మేర పరిహరించబడింది , ఇంకా కొంత కొరత ఉన్ననూ , సమస్యా పూరణేత్యాది ' చాటు కవితా ప్రక్రియ 'కు అది అడ్డంకి కాబోదు కనుక సమస్యను పూరించడంలో మీరు నిస్సంశయంగా కృతకృత్యులైనట్లే ! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    మెండగు నీటను మునిగెను
    పండితు డానీటనీద పామరు డగుటన్ ,
    భండారపు జ్ఞాని ననుచు
    పండితుఁడన ,నెవఁడు పరమపామరుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  20. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణను పరిశీలించి తప్పులున్న సవరించగలరు. ధన్యవాదములు.

    కుండెడు పాలను విరచును
    దండిగ నొక యుప్పు కల్లు దగు వినయమెలే
    కుండగ దిరిగిన వాడా ?
    పండితుడననెవడు పరమ పామరుడు గాదా

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమ:
    సత్కవివర్యుల ప్రశంసార్హుడినైనందుకు చాలా సంతోషముగానున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. దండిగ చదువులు గలను
    ద్దండుడ నంచును తనకు తాను తెలుప నె
    వ్వండైనను హీనుండను
    పండితుడననెవడు పామరుడు గదా

    రిప్లయితొలగించండి
  23. దండిగ చదువులు గలను
    ద్దండుడ నంచును తనకు తాను తెలుప నె
    వ్వండైనను హీనుండను
    పండితుడననెవడు పామరుడు గదా

    రిప్లయితొలగించండి
  24. నిండిన వాగును దాటని
    పండితుడన నెవడు?పరమపామరుడుగదా
    మొండిగ ఈదుటరాదన
    గుండే తననంటి యుండి గుబులే నింపున్
    నిండిన వాగుమధ్య దాటేసమయానఈదుటరాదను
    పండితునిజూచి ఈదే వ్యక్తులుమాటలుగాపూరించడమైనది

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    (పండితవేషముననున్న యొక పామరుని మాటల నొక కవి విశ్లేషించుచున్న సందర్భము)

    "'పాండవులనఁగాఁ దెలియదె?
    దండిగ మంచంపుఁగోళ్ళ దత్తున మువురం
    చుండి'రని రెండుఁ జూపిన
    పండితుఁ డన నెవఁడు? పరమ పామరుఁడు గదా!"

    రిప్లయితొలగించండి
  26. నిండు జగము మంచియు, చెడు
    రెండిటి మయమని యెఱింగి రెండిటి యందున్
    పండిన సమదృష్టి వినా
    పండితుఁ డన నెవఁడు? పరమపామరుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  27. వాక్యనిర్మాణములో చిన్న సవరణతో....

    నిండు జగము మంచియు, చెడు
    రెండిటి మయమను నెఱుకయు, రెండిటి యందున్
    పండిన సమదృష్టి వినా
    పండితుఁ డన నెవఁడు? పరమపామరుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  28. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘భండనమందు విజయమ్ము....’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    బహుకాల దర్శనం! సంతోషం!
    విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    ‘భోజనం దేహి రాజేంద్ర...’ శ్లోకాన్ని గుర్తుకు తెచ్చింది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ పూరణకూడ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కొద్దిగా అన్వయం కుదరనట్టున్నది.
    *****
    వేదుల సుభద్ర గారూ,
    మీ పూరణ నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చదువులు గల యు|ద్దండుడ...’ అనండి. రెండవ పాదంలో గణదోషం. ‘...యు|ద్దండుడ నేనంచు తనకు తాను...’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గుండెయె’ అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. మెండుగ చదువులు చదివిన
    నిండుగ లోకాన బ్రతుకు నేర్పదిలేకన్
    మండితుడెట్లగును భువిని
    పండితుడననెవడు పరమ పామరుడుగదా!

    మండితుడైనను చదువుల
    అండగ తానటు బతుకుననందక వృత్తుల్
    తిండియు కరవగు జగమున
    పండిరుడననెవదు పరమ పామరుడు కదా!

    మెండగు మోసాల సలిపి
    పండితుడై వర్తనమున పాపియునైనన్
    ఛండాలుడగును,గద యా
    పండితుడన నెవడు పరమ పామరుడు గదా!

    నిండుగ నాపద గడుపగ
    పండితుడే యనగ నేల!పామరుడుడైనన్
    కొండొక రీతిని గడుపును
    పండితుడన నెవడు పరమ పామరుడు గదా!

    శుండాలమైన నాపద
    చెండాడగ లేదునచట,చీమయె బతుకున్
    కొండాడకున్నలోకము
    పండితుడన నెవడు పరమ పామరుడు కదా!

    రిప్లయితొలగించండి
  30. కుండంత ప్రతిభ లేకయె
    దండిగ శాస్త్రములు చదివి తప్పుల తోడన్
    కొండంత దంభముండిన
    పండితుఁ డన నెవఁడు పరమపామరుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  31. దండుగ కైతలు చెప్పుచు
    కుండలతో ధనము దోచుకొనెడిని తీరున్
    మెండుగ తెలియని వైదిక
    పండితుఁ డన నెవఁడు పరమపామరుఁడు గదా!

    రిప్లయితొలగించండి