గుండు మధుసూదన్ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఏకష్టము నా చెంతకు
రిప్లయితొలగించండిరాకుండగ చూచుకొనుచు రక్షగ అన్నా
నాకంఢగ ఉండుమనుచు
నీ కరమున కట్టుచుంటి నేనీ రాఖీ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సుకవి మిత్రులందఱకు రక్షాబంధన దినోత్సవ శుభకాంక్షలు!
రిప్లయితొలగించండిసాక్షాత్తు సోదరియె తమ
కక్షయముగ రక్షణ నిడు కాంక్ష బలిమిచే
రక్షా సూత్రముఁ గట్టెడి
రక్షా బంధన దిన మనురాగ దినమ్మే!
రక్షగనుండుము అన్నా!
రిప్లయితొలగించండియక్షయమగు ప్రేమ నిడుచు నాశీస్సులతో
లక్షణముగ జూడుమనుచు
రక్షణ సూత్రమును గట్టె రాగము తోడన్!!!
ఆ.వె:రామణీయకముగ రక్ష కట్టుచునుండె
రిప్లయితొలగించండిచిట్టి చెల్లి యన్న చేతి కిపుడు
మెచ్చి యన్న యొసగె మెరుగైన కానుకల్
చూసి మురిసి పోయె శోభితముగ.
2.తే.గీ: రమ్య మైనట్టి రాఖిని రాజసాన
కట్టి గోముగ యన్నను కాను కడుగ
సోదరికి వింత బహుమతి చూప గానె
మందహా సముతో జూపె మంది కెల్ల.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసోదరులకు రక్ష సోదరీ బంధమ్ము
రిప్లయితొలగించండిచిరకాల మిట్టులే స్థిరమగునని,
అన్నయ్యలకుఁ జెల్లి, అక్క తమ్ముండ్రకుఁ
గట్టెడి రక్షయే కాచుననియు,
నమ్మి రక్షాబంధనమ్ము రూపొందించి,
సంప్రదాయమ్ముఁ బ్రశస్తపఱచి,
యనుసరించుచు నెప్పు డన్నసెల్లెండ్రును,
అక్క తమ్ముండ్రును నాచరింప
లోకమే ప్రేమమయమునై మోకరిల్లు!
నట్టి ఘనత రక్షాబంధనమున కిడిన
భారతీయత ఘనముగా భాసమాన
మయ్యు లోకాన వ్యాపించెనయ్య నేఁడు!!
రిప్లయితొలగించండిచిత్ర మందున జూడుము చెల్లె లచట
కట్టు చుండెను రాఖీని గారవమున
తనదు సోదరు నకుమఱి తనకు భువిని
నండ గానుండు ననుభావ మతిశయిల్ల
అందరికీ రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండినీదరి కష్టము చేరక
సోదరి రక్షఁ గలిగించు సూత్రముఁ గట్టన్
సాదరముగ ననురాగము
మోదమలరఁ బంచు కొనుడు ముచ్చట గలుగన్
" అన్నా నీ కరమంటి కట్టెదను రక్షాబంధనమ్మీ దినం
రిప్లయితొలగించండిబెన్నండున్ విడనాడబోకు నను ప్రేమే బంధమై రక్షగా
నన్నున్నిన్నును జేర్చియుంచు నెపుడున్నవ్యానురాగమ్ముతో "
చిన్నారిన్ గనుడిట్టు లన్న కరమున్ చిర్నవ్వుతో పట్టెడిన్.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
నాకు నీవు రక్ష నీకు నేనే రక్ష
రిప్లయితొలగించండిభరత జాతిరక్ష భారమనక
ఏక తాటి పైన నేకోదరులరీతి
కలిసి యుండ వలెను కలత మరచి
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
బ్లాగున ప్రియ సోదరులను
రిప్లయితొలగించండిరాగముతో కట్టి వేసి రాఖీ యనుచున్
భాగము కోరదు భగినిల
భోగము లందున నెలకొని భువి నేలుమనెన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
తమ్ముని రక్షాబంధన
రిప్లయితొలగించండినిమ్ముగ జరిగెన్ బహుమతులెన్నో వచ్చెన్
నెమ్మది నొసగుమటంచున్
మమ్ములఁగావుమటనుచును మాధవుఁదలతున్.