25, జూన్ 2011, శనివారం

దత్తపది - 14 (అప్పు, కొప్పు, చెప్పు, మెప్పు)

కవిమిత్రులారా,
"అప్పు, కొప్పు, చెప్పు, మెప్పు"
పై పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి
పెరిగిన వంటగ్యాసు ధరలపై
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

21 కామెంట్‌లు:

 1. అప్పుడప్పుడు మనకొప్పునది బ్రతుకున
  తరిగిన ధరలు కలలోన,పెరిగిన ధర
  లిలను! చెప్పుడు మాటలాడిక నను భ్రమ
  పెట్టఁ జూడకుమెప్పుడు, పెరిగె చమురు
  ధరలు మాకును మీకును తనదు రీతి!
  మనవి: మాకుకూడా విపరీతంగా పెట్రోలు ధరలు మండుతున్నాయి ఇక్కడ.

  రిప్లయితొలగించండి
 2. పెరిగిన, తరిగిన పదాలు సరిదిద్ది, సరైన భావంతో:
  అప్పుడప్పుడు మనకొప్పునది బ్రతుకున
  పెరిగిన ధరలు కలలోన, తరిగిన ధర
  లిలను! చెప్పుడు మాటలాడిక నను భ్రమ
  పెట్టఁ జూడకుమెప్పుడు, పెరిగె చమురు
  ధరలు మాకును మీకును తనదు రీతి!
  మనవి: మాకుకూడా విపరీతంగా పెట్రోలు ధరలు మండుతున్నాయి ఇక్కడ. ఆర్ధిక మాంద్యం ప్రభావం ఇంకా యెక్కువగానే వుంది.

  రిప్లయితొలగించండి
 3. ధరను మేమప్పుడె నలిగి ధరల మరను,
  చెప్పు కొనలేని బాధకు చేరినాము!
  నేత ! మీకొప్పునే ధర నిట్లు బెంచ?
  మిమ్మునమ్మి చెడుదుముమే మెప్పు డైన!

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !

  చంద్ర శేఖరా ! బావుంది !

  పెరిగిన ధరలతో పోషణ కష్టమై నగరం నుండి తన పల్లెకు పోదామని
  భార్య నడుగుతున్న భర్త :
  01)
  __________________________________

  అప్పురమున యుండుట, యిం
  కొప్పున ? గ్యాసు ధర పెరగ - కూటికి కరువే !
  చెప్పుము తొందరగా మన
  మెప్పుడు కొటికకు సురుగుట ? - మెల్తుక నడిగెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 5. కిశోర్ జి ! ధన్యవాదములు.
  అందమైన కందం చెప్పారు.అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. వసంతమహోదయా! కందం అందంగానేవుంది గానీ, "చెప్పుము" లో చెప్పు అనే పదం దాని అర్థంలో గాక వేరే రకంగా వాడినట్లేనా?
  చెప్పు=పాదరక్ష; చెప్పు=చెప్పుట, రెండర్థాలున్నయిగదా!

  రిప్లయితొలగించండి
 7. చంద్రశేఖర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  వసంత కిశోర్ గారూ,
  పదాలను కందంలో అందంగా ఒదిగించారు. చక్కని పూరణ. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  ఇక్కడ ‘చెప్పు’కు పాదరక్ష అనే అర్థం మాత్రమే తీసికొనాలి.

  రిప్లయితొలగించండి
 8. మనకొప్పును కట్టెలనిం
  ధనమెప్పుడునైన, కొత్త ధరలటు పెరిగెన్
  విను,చిచ్చెప్పుడు తగులునొ
  మనకిక నప్పుడును జీతమా! పెరుగదయా!

  రిప్లయితొలగించండి
 9. మందాకిని గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  ‘కట్టెల యింధనము" అనడం బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 10. అప్పుడు కట్టె పొయ్యియును ఆరని కుంపటి హాయి నిచ్చె మే
  మెప్పుడు పొయ్యి లోనికని యింతగ సొమ్ములు పెట్ట కున్కి! నే
  చెప్పుదు నమ్ము యింధనము చిల్లర ఖర్చుల లోనె పోయె! మీ
  కొప్పగు వంట వాయువుకు నూడిచి సొమ్ముల బెట్టు టక్కటా!

  రిప్లయితొలగించండి
 11. శంకరార్యా ! ధన్యవాదములు.
  మందాకినిని మంచి కందాన్ని చెప్పారు బాగుంది .
  మిస్సన్న గారూ ! వంట వాయువు తో పద్యాన్ని బలే వండారండి.

  రిప్లయితొలగించండి
 12. కొప్పు ముడువంగ విరులను కోరి తురుమ
  మెప్పు లేకున్న ఇల్లాలు తప్పు కొనును
  చెప్పు లేకున్న కాలికి తప్ప దనుచు
  అప్పు జేసైన గాసున్న పప్పు కూడు

  రిప్లయితొలగించండి
 13. అప్పుడు బొగ్గుల పొయి మన
  కొప్పును, గ్యాసు ధర హెచ్చ ; కూరలు వండన్ !
  చెప్పుడిక ! పచ్చడే మన
  మెప్పుడు తినవలయు గాక ! మీకిది మేలా !?

  రిప్లయితొలగించండి
 14. మందాకిని గారూ! నా వ్యాఖ్య లోని సంబోధనలోని టైపాటును మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 15. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
  చంద్రశేఖరా ! ధన్యవాదములు !
  శంకరార్యా ! ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 17. అల్లాగే గురువుగారూ!ధన్యవాదములు !
  అందరి పూరణలూ అలరించాయి.
  హనుమచ్ఛాస్త్రిగారూ, పర్లేదండి.ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 18. శ్రీపతిశాస్త్రిసోమవారం, జూన్ 27, 2011 11:24:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  అప్పుడెపుడొ పెంచినప్పుడె పెంచుట
  కొప్పుకొనక అడ్దు చెప్పినాము
  ఇప్పుడీధర మన చెప్పు చేతలలేదు
  అన్నమెప్పుడుడుకు నయ్యలార

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  ఉత్పలమాలలో ఒదిగిన మీ దత్తపది ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

  రాజేశ్వరక్కా,
  మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు.
  కాని పద్యంలో వంటగ్యాసు ప్రస్తావన ఏది? ఇచ్చిన పదాలను ఆయా అర్థాలలోనే ప్రయోగించడం మరో లోపం!

  నాగరాజు రవీందర్ గారూ,
  అద్భుతంగా ఉంది పూరణ. ‘మా కిది మేలే!’ అభినందనలు.

  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి