మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 6
సమస్య - "గుత్తఁపు తాపుతారవికకుట్టు పటుక్కున వీడె నింతికిన్"
ఉ.అత్తఱిఁ జిత్తజుండు విరహాంగనలన్ గనలింప నిక్షువి
ల్లెత్తి ధనుర్గుణంబు మొఱయించి నిశాతవినూతనప్రసూ
నోత్తమబాణపంక్తిఁ గుడియుగ్మ మదాటునఁ దాక నేసినన్
గుఁత్తపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్.
వెంకటగిరిరాజు ఆ సమస్యనే మరో రకంగా పూరించమంటే కవి పూరణ ...
ఉ.
ఇత్తఱి రమ్ము రమ్మనుచు నింపుగ గొల్లలు తన్నుఁ బిల్వఁగా
దత్తరపాటునన్ గదిసి తాండవకృష్ణుఁడు సుందరాంగిఁ దా
మెత్తని పూలపాన్పునను మెచ్చి కవుంగిటఁ జేర్చినంతనే
గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.
ఓరుగల్లు పిల్లగాలి పీల్చగానే మాస్టారికి మంచి ఉత్సాహం వచ్చినట్లుంది. రసవత్తరమైన సమస్య పోస్టు చేశారు.
రిప్లయితొలగించండిఅత్తకు తిండి యావ కడు! అందున దేహము లావు! వెన్న బి-
రిప్లయితొలగించండిస్కత్తులు, పిజ్జ బర్గరులు, కమ్మని నేతి మిఠాయి, లెన్నొ చా-
క్లెత్తుల నారగించెడిని లీలగ! మొన్నను దాల్చు చుండగా
గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్ !
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
"మొన్నను దాల్చుచుండగా" .... ?
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయుల పూరణ ముచ్చటగా నున్నది !
01)
___________________________________________
మత్తు పదార్థ సేవనము - మత్తును మిక్కిలి బెంచి యామె, ను
న్మత్తను సేయగా , మనసు - మైకము కమ్మిన యట్టి వేళలో
చిత్తజు బారి కోప; మన - సిచ్చిన వానిని కౌగలింపగా
గుత్తఁపు తాపుతా రవిక - కుట్టు పటుక్కున వీడె నింతికిన్ !
___________________________________________
గురువుగారూ ధన్య వాదాలు.
రిప్లయితొలగించండిమీ సూచన మేరకు చిన్న సవరణ.
అత్తకు తిండి యావ కడు! అందున దేహము లావు! వెన్న బి-
స్కత్తులు, పిజ్జ బర్గరులు, కమ్మని నేతి మిఠాయి, లెన్నొ చా-
క్లెత్తుల నారగించెడిని లీలగ! చేతిని దూర్చ బోవగా
గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్ !
మిస్సన్న గారూ, బాగు బాగు. భేషైన పూరణ.నా వంతు.
రిప్లయితొలగించండిగుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్
మత్తిలె నేమొ? గమ్ము విడె మందిన వల్లభుఁ మోవినందగన్
మెత్త చనుంగవన్ చెలగి మీటగ తాళక సోలివోయెనో?
అత్తెరి! మీనకేతునకు నర్థము గావలె చిత్తమోహముల్.
ఎత్తగు వక్ష సంపదయు నెన్నగ చక్కని సోయగంబుతో
రిప్లయితొలగించండిమత్తును గొల్పు కళ్ళు గల మాలిని యేగెను మంచి నీటికై
యెత్తెను బిందె నొక్కతరి యేటిని నీటను ముంచి; లేపగా,
గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్ !
వసంత మహోదయా! రవి మిత్రమా! ధన్య వాదాలు.
రిప్లయితొలగించండిమీ పూరణలు మాంచి సరసంగా ఉన్నాయి.
హనుమచ్చాస్త్రి గారూ మీ పూరణ కూడా.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ "గమ్మత్తుగా" ఉండి మనసును దోచింది. బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
ఇప్పుడు మీ పద్యం సర్వాంగ సుందరం. ధన్యవాదాలు.
రవి గారూ,
హత్తెరి! ఉండి ఉండి ఎంత చక్కని పద్యం చెప్పారు? చదివి మేము సోలిపోయా మనుకోండి. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఒక సుందర దృశ్యాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించారు. చాలా బాగుంది. అభినందనలు.
మాస్టరు గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాస్టారు గారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! నన్ను మరచితిరి !
రిప్లయితొలగించండిఅత్తరి పూతనత్త చను హాయిని కృష్ణుని కిచ్చుచుండగా
రిప్లయితొలగించండిమెత్తగ రొమ్మునన్ కుదిరి మీరిన నాత్రము నందు కాళ్ళనున్
తత్తర పాటునన్ విసిరి తన్మయ మందున మొత్తుచుండగా
గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్