శ్రీగురుభ్యోనమ: -- శ్రీపతిశాస్త్రి ఎన్ని సంబంధాలు చూచినా పెళ్లి కుదరని తన కుమారునితో ఒక తండ్రి బంధువుల అమ్మాయిని గురించి చెపుతు. చింతాక్రాంతుడు కాకుర యింతగ. మణి యన్న యొక్క మన అమ్మాయె చెంతన యుండగ ఎందుకు చింతా? మణి కన్న మంచి చెలువలు గలరే
కవిమిత్రులు ఊహించని రీతిలో మంచి భావనలతో పూరించారు. మందాకినిగారు వీలైన విధంగా మగవారిని సున్నితంగా దుయ్యబట్టారు. జిగురువారు సమస్య సూచించిన వారి ఆంతర్యం పసిగట్టి అసలైన చింతామణిని తెరకెక్కించారు. అందరికీ ధన్యవాదాలు.
మందాకిని గారూ, "కాంతను అంటే ప్రాసపూర్వాక్షర నియమభంగం అవుతుందేమో" అన్నారు. నాకు అర్థం కాలేదు. మీ సందేహాన్ని కాస్త వివరంగా చెప్పండి. అక్కడ అనుస్వారంతో కూడిన తకారం (ంత)ప్రాసాక్షరం. దాని ముందు హ్రస్వ, దీర్ఘాక్షరాలలో ఏది ఉన్నా అనుస్వారం వల్ల గురువే అవుతుంది. కాంత, కొంత, చెంత, తంతు, దంతి, దాంతుడు, పొంత, ప్రాంత,భ్రాంతి, ముంత, వంత, వాంతి, సంతు, శాంతి ఇలా ఏదైనా ఉండవచ్చు. ప్రాసాక్షరం ‘ద్య’ ఉందనుకోండి. దానికి ముందు ఏ అక్షరమున్నా సంయుక్తాక్షర పూర్వమై గురువు అవుతుంది. ఆద్యము, ఉద్యమము, ఖాద్యము, గద్యము, చోద్యము, పద్యము, వాద్యము .. ఇలా ఉండవచ్చు.
ఎంతైనా భార్య గదా
రిప్లయితొలగించండియింతైన గ్రహించ లేదె యేలా మణిపై
పంతమ్ము ? వీడు, వినదని
చింతా? మణి కంటె మంచి చెలువలు గలరే!
శ్రీగురుభ్యోనమ: -- శ్రీపతిశాస్త్రి
రిప్లయితొలగించండిఎన్ని సంబంధాలు చూచినా పెళ్లి కుదరని తన కుమారునితో ఒక తండ్రి బంధువుల అమ్మాయిని గురించి చెపుతు.
చింతాక్రాంతుడు కాకుర
యింతగ. మణి యన్న యొక్క మన అమ్మాయె
చెంతన యుండగ ఎందుకు
చింతా? మణి కన్న మంచి చెలువలు గలరే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచింతా క్రాంతము గాకుము
రిప్లయితొలగించండిఎంతో సాయమ్ము జేతురీ కష్టములో
వంతులు వేసుక;శ్రీమణి,
చింతామణి కన్న మంచి చెలువలు గలరే ?
శ్రీగురుభ్యోనమ: --- శ్రీపతిశాస్త్రి
రిప్లయితొలగించండికవి మిత్రులు మన్నించ ప్రార్థన.నా పూరణ 2 వ పాదంలో యతి గతి తప్పినది. సవరణ గ్రహించగలరు.
చింతాక్రాంతుడు కాకుర
ఇంతగ మణియనబడు మన ఈ అమ్మాయె
చెంతన యుండగ ఎందుకు
చింతా, మణికన్న మంచి చెలువలు గలరే
సుంతయు సంసారమునన్
రిప్లయితొలగించండిచింతలుఁ జేయని పురుషులఁ జేరుచు నటనల్
వింతగఁ జూపగఁ, వారికి
చింతామణి కంటె మంచి చెలువలు గలరే!
ఇంతేలే మగ వారల
రిప్లయితొలగించండివింతగు మాటలు! కుటుంబ వెతలన్ గనునా,
సుంతైనా ! మగవారికి
చింతామణి కంటె మంచి చెలువలు గలరే!
గురువు గారికి నమస్కారములతో,
రిప్లయితొలగించండిసవరణలకు ధన్యవాదములు
క : చింతలధికమై దిరుగగ
చింతా మణి కంటె మంచి చెలువలు గలరే ?
చింతలు ధీర్చ నని దెలుప
చింతామణి ఇంటికెడలె నింతి నొదలి తాన్ !
*ee ammaye* *ye* deerghamga grahinchagaluru--sreepathisastry
రిప్లయితొలగించండిసంతానమునెడఁదనకున్
రిప్లయితొలగించండిచింతలు లేనియధముండు, చిరుపంతముతో
కుంతలఁ విడచిన పాపికి
చింతామణి కంటె మంచి చెలువలు గలరే!
భవాని శంకరం తో సుబ్బి శెట్టి పలుకు మాటలు:
రిప్లయితొలగించండిభ్రాంతిన్ బోతిమి యకటా!!
అంతా దోచుకొనె, మిగిలె నట్ల పెనములే
కొంతైననిచ్చె నేడిక
చింతామణి కంటె మంచి చెలువలు గలరే!
(వేశ్యా సంపర్కము వలన కలుగు నష్టాలను ప్రచారము చేస్తే కొంత ధనము ఇస్తానని చింతామని అంటుంది)
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఎందుకు చింత? చింతాకంత వంక లేని పూరణ మీది. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారూ,
‘మణి’ అనే అమ్మాయి విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
యతి సవరించాక చక్కగా ఉంది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సాయం చేసే చెలువల పూరణ అదిరింది. అభినందనలు.
మందాకిని గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
చివరి పాదంలో కొన్ని లోపాలున్నాయి. నా సవరణ.
"చింతామణి యింటి కేగె శ్రీమతి నొగ్గెన్"
మందాకిని గారూ,
మీ మూడవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
‘కుంతల’ అన్నచోట కాంతను అనండి.
జిగురు సత్యనారాయణ గారూ,
చివరికి మీరు పట్టుకున్నారు అసలైన ‘చింతామణి’ని. పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
గురువుగారూ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికాంతను అంటే ప్రాసపూర్వాక్షర నియమభంగం అవుతుందేమో, ఇంతిని అంటే ఎలా ఉంటుంది?
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిసంతోషంగా అనవచ్చు. కాకుంటే ‘చిరుపంతముతో/ నింతిని’ అనాలి.
సంతానమునెడఁదనకున్
రిప్లయితొలగించండిచింతలు లేనియధముండు, చిరుపంతముతో
నింతినిఁ విడచిన పాపికి
చింతామణి కంటె మంచి చెలువలు గలరే!
గురువుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఎంతగ సంపదనున్న,శ
రిప్లయితొలగించండిమంతకమణి బోలునొక్కమణియేదైనన్
చెంతన గలిగిన, తొలగదె
చింతా! మణికంటెమంచ చెలువలుగలరే!
కవిమిత్రులు ఊహించని రీతిలో మంచి భావనలతో పూరించారు. మందాకినిగారు వీలైన విధంగా మగవారిని సున్నితంగా దుయ్యబట్టారు. జిగురువారు సమస్య సూచించిన వారి ఆంతర్యం పసిగట్టి అసలైన చింతామణిని తెరకెక్కించారు. అందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివంతులుగా దోచెనుబో
సుంతయు దయలేకవారి సొమ్ములుఁ, తుదకు
న్వింతగ కృష్ణార్పణమౌ
చింతామణి కంటె మంచి చెలువలు గలరే!
ఎంతైనా వలచితివని
రిప్లయితొలగించండిసుం తైనను మదన పడక పంతము వీడిన్ !
కాంతా కనకమ్ముల కాదని
చితామణి కంటె మంచి చెలువలు గలరే !
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు.
రెండవపాదంలో యతి, మూడవ పాదంలో గణం తప్పాయి. నా సవరణ ...
‘ఎంతో వలచితి నని ర
వ్వంతైనను మదనపడక పంతము విడి తా
కాంతా కనకమ్ము లుడిగి ....
దన్యవాదాలు, మాస్టారూ. ఏమిటి, ఈ సమయంలో (2:42 ఉదయం) మీరు కూడా కంప్యూటర్ వాడుతున్నారు? హాయిగా విశ్రాంతి తీసుకోండి.
రిప్లయితొలగించండిధన్య వాదములు గురువు గారూ ! ఓర్పు తో సవరణ చేసి నందుకు
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మందాకిని గారూ,
"కాంతను అంటే ప్రాసపూర్వాక్షర నియమభంగం అవుతుందేమో" అన్నారు. నాకు అర్థం కాలేదు. మీ సందేహాన్ని కాస్త వివరంగా చెప్పండి.
అక్కడ అనుస్వారంతో కూడిన తకారం (ంత)ప్రాసాక్షరం. దాని ముందు హ్రస్వ, దీర్ఘాక్షరాలలో ఏది ఉన్నా అనుస్వారం వల్ల గురువే అవుతుంది. కాంత, కొంత, చెంత, తంతు, దంతి, దాంతుడు, పొంత, ప్రాంత,భ్రాంతి, ముంత, వంత, వాంతి, సంతు, శాంతి ఇలా ఏదైనా ఉండవచ్చు. ప్రాసాక్షరం ‘ద్య’ ఉందనుకోండి. దానికి ముందు ఏ అక్షరమున్నా సంయుక్తాక్షర పూర్వమై గురువు అవుతుంది. ఆద్యము, ఉద్యమము, ఖాద్యము, గద్యము, చోద్యము, పద్యము, వాద్యము .. ఇలా ఉండవచ్చు.
గురువు గారు,
రిప్లయితొలగించండిమీరే సందేహాన్ని తీర్చేశారుగా!
మరేంలేదు. కాంత, ఇంతులలో కాం, ఇం రెండూ గురువే అయినప్పటికీ పద్యం పాడుతున్నపుడు వచ్చే భేదం లెక్కలోకి రాదా మరి?
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిఅ భేదం (నా దృష్టిలో అక్కడ భేదం లేదు) "లెక్కలోకి రాదండి".
కొంతయొ గొప్పొయొ శ్రమపడి
రిప్లయితొలగించండిపంతముతో వ్రాయబూన పద్యమ్ముల తా
వింతేల? "ఆంధ్ర భాషా
చింతామణి" కంటె మంచి చెలువలు గలరే
సంతసమున మిన్న యెవరు
రిప్లయితొలగించండిచింతామణి కంటె?:...మంచి చెలువలు గలరే
ప్రాంతములోనైన భడవ!
గంతులు వేయుచు వెదకుము గార్దభ పుత్రా!