6, జూన్ 2011, సోమవారం

సమస్యా పూరణం -355 (కల్ల లాడువారె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కల్ల లాడువారె కవులు గాదె.

17 కామెంట్‌లు:

  1. గూటఁ జిక్కు జీవి గోరంతదయినను
    తినెడి సాలె పురుగు దిద్ద బడెను,
    మనుజరూపు నమరి మనుజుల కాపాడు!
    కల్ల లాడువారె కవులు గాదె!

    ప్రాణులను చిక్క బట్టు కొని తినేందుకై గూటినల్లే సాలీడు మనుజరూపముతో వచ్చి మనుష్యులను కాపాడే స్పైడర్ మాన్ అనే పాత్రను సృజించిన కవులు, కథాకారులు (మన జాతే లెండి) .

    రిప్లయితొలగించండి
  2. ఆ: నల్ల ధనము తోడ చల్లగా నుండెడి
    కల్ల లాడు వారె కవులుగాదె?
    మల్ల యుద్దమేను, మాట్లాడువార్లపై
    చల్ల జేయకుండు మెల్లగాను!
    కవులు = రాజకీయనాయకులు, నిన్న జరిగిన రామ్ దేవ్ బాబా
    సంఘటనను ఈరూపమున తెలియజేయుచున్నాను.
    గురువుగారికి నమస్కారములతో
    సవరణలకు కృతజ్ఞుడను, మీదీవేనలు సదా కోరుతూ

    రిప్లయితొలగించండి
  3. మేఘుడెన్నడైన మేసేజులిచ్చునా!
    రాయికరుగునెట్లు రాగమునకు?
    పూలునోళ్ళువిప్పి జాలిగాపలుకునా !
    కల్ల లాడువారె కవులు గాదె!


    మేసేజు = message

    రిప్లయితొలగించండి
  4. వారె! సత్యమును పలుకలేరు యెపుడు :
    కవిత లల్లుచు కాలము గడుపు వారు :
    ధాన్య మిందులో ననువుగ దాచవచ్చు :
    కల్ల లాడువారె, కవులు, గాదె !

    రిప్లయితొలగించండి
  5. నేతి బీర కాయ నేయుండ దిసుమంత
    ఏత మేసి తోడ యేరు యిగుర ?
    పొగిలి పొగిలి యేడ్చి పొంత నిండదుగాన
    కల్ల లాడు వారె కవులు గాదె !

    రిప్లయితొలగించండి
  6. క్షమించండి ! పై పద్యంలో తప్పులు దొర్లినందులకు. ఇలా చదువుకొన వలసిందిగా మనవి.

    సత్యమును పలుకని జనులు యెవరు ? వీరె :
    కవిత లల్లి దినము గడుపు వారు :
    ధాన్య మిందు కరము దాచవచ్చు మనము :
    కల్ల లాడువారె, కవులు, గాదె !

    రిప్లయితొలగించండి
  7. క్షమించండి ! పై పద్యంలో తప్పులు దొర్లినందులకు. ఇలా చదువుకొన వలసిందిగా మనవి.

    సత్యమును పలుకని జనులు యెవరు ? వీరె :
    కవిత లల్లి దినము గడుపు వారు :
    ధాన్య మిందు కరము దాచవచ్చు మనము :
    కల్ల లాడువారె, కవులు, గాదె !

    రిప్లయితొలగించండి
  8. కల్ల లాడ మనల కథలుచెప్పకు యంద్రు
    కథలు కవిత లల్ల కల్ల వలయు
    ముఖము చంద్రుడేను, ముక్కు సంపెగయంచు
    కల్ల లాడు వారె కవులు గాదె !

    రిప్లయితొలగించండి
  9. వంకబెట్టు కొని యలంకారములనుచు,
    కవిసమయమనుచు, తెలివిగ భువిని
    పతి కడ,సతి కడను,ప్రజల తోడ
    కల్ల లాడు వారె కవులు గాదె !

    రిప్లయితొలగించండి
  10. కవుల యుల్ల మందు కల్లల నిధియుండు
    కలము కదిపి నంత గలుగు వింత
    కల్ల లెన్నొ మదిని కురిపించి మురిపింప
    కల్ల లాడు వారె కవులు గాదె ?

    రిప్లయితొలగించండి
  11. మందాకిని గారూ,
    కవులు సృష్టించిన ఇలాంటి పాత్రలు ప్రపంచసాహిత్యంలో చాలా ఉన్నాయి. మంచి విషయంతో పూరణ చేశారు. బాగుంది. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. కాని పూరణ అంతగా పొసగినట్లు లేదు. రాజకీయనాయకులు కవు లెట్లా అయ్యారు?

    మంద పీతాంబర్ గారూ,
    చిన్న పద్యంలో మేఘసందేశం, జగదేకవీరుని కథ, పుష్పవిలాపాలను ప్రస్తావించారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నాగరాజు రవీందర్ గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని మొదటి రెండు పాదాల్లో గణదోషం, మూడవ పాదంలో యతిదోషం ఉన్నాయి. నా సవరణలతో మీ పద్యం....

    సత్యమును పలుకగ జాలని దెవ్వరో?
    పద్యములను వ్రాయు వార లెవరు?
    ధాన్య మెందులోన తగ దాచవచ్చును?
    కల్ల లాడువారె, కవులు, గాదె !

    రిప్లయితొలగించండి
  13. నాగరాజు రవీందర్ గారూ,
    మన్నించాలి! మీకై మీరు సవరించి పంపిన పద్యాన్ని ముందు చూసుకోలేదు. అందువల్ల నా సవరణలతో పద్యం చెప్పాను.
    మీ సవరించిన పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. "కవుల యుల్ల మందు కల్లల నిధియుండు" అనడం చమత్కారంగా ఉంది. అభినందనలు.

    ఊకదంపుడు గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. "పతి కడ,సతి కడను,ప్రజలతో నిరతమ్ము" అని నా సవరణ.

    రిప్లయితొలగించండి
  15. చంద్రశేఖర్ గారి పూరణ ....

    చందమామఁ జూపి అందమైన కవిత
    గట్టి గోరు ముద్ద లెట్టు అమ్మ
    కల్ల లాడెనేమొ, కప్పిజెప్పగనెంచి
    కల్ల లాడువారె కవులు గాదె!

    రిప్లయితొలగించండి
  16. చంద్రశేఖర్ గారూ,
    అమ్మను కవయిత్రిని చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ________________________________

    అణువు నేమొ జూపు - నాకాశ మంతగా !
    బక్కవాని జేయు - నుక్కు మనిషి !
    వెఱ్ఱి పిచ్చి కథలు - వింతగా జెప్పెడి
    కల్ల లాడు వారె - కవులు గాదె !
    ________________________________

    రిప్లయితొలగించండి