17, జూన్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -366 (యోగము ప్రాణాంతకమని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్.

15 కామెంట్‌లు:

  1. యోగియను వైద్యు డాతడు
    భోగములను మునిగి తేలి భువినైడ్సుండే
    రోగము గలస్త్రీ తో సం
    యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్.

    రిప్లయితొలగించండి
  2. యోగపు సాధనలో హఠ
    యోగము కష్టతర మంచు యోగి దలంచెన్
    యోగము లన్నిట గన, హఠ
    యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్ !

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ: -- శ్రీపతిశాస్త్రి
    బాగుగ శాస్త్రము జదివియు
    వేగముగా వృద్ధి చేయు విజ్ఞానముతో
    చేగొని చేసినను చెడు ప్ర
    యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జూన్ 17, 2011 8:58:00 AM

    యాగములను తాచేయడు,
    యోగుల హింసించు, భక్తి యోగము విడిచెన్,
    రాగద్వేషునికడ, ను
    ద్యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్.

    రాగము = అనురాగము, ప్రేమ

    రిప్లయితొలగించండి
  5. శ్రీగురుదేవుల కరుణనుఁ
    రాగవిరాగముల నేను రయమున విడుదున్.
    భోగవిలాసమునెడసం
    యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్.

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జూన్ 17, 2011 10:54:00 AM

    మందాకిని గారు,
    మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. సంపత్ కుమార్ శాస్త్రిగారూ, ధన్యవాదాలు.
    మీ అందరి పూరణలూ బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘భువి నైడ్సుండే రోగము గల స్త్రీ’... ఉండే, గల అని పునరుక్తి. ఉండే అనేదాని గ్రాంథికరూపం ‘ఉండెడి’. "భువి నైడ్సనఁగా/ రోగముగల స్త్రీ" అందాం.

    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అవయవాలను క్లేశపెట్టే హఠయోగం ప్రాణాంతకమంటారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    శాస్త్రప్రయోగాలు చేస్తూ కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని చక్కగా ప్రస్తావించారు.బాగుంది.

    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    దుష్టుని కడ ఉద్యోగం ప్రమాదకరమని చక్కగా పూరించారు. అభినందనలు.

    మందాకిని గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘విడుదున్’ అనేది ‘విడుతున్’ అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారు ధన్యవాదములు. మందాకినిగారు చక్కని పూరణతో యోగి హృదయాన్ని వివరించారు అబినందనలు.-- శ్రీపతిశాస్త్రి

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు,చక్కని సవరణ.ధన్యవాదములు.
    శ్రీపతిశాస్త్రి గారు,మీ పూరణలూ బాగున్నాయి.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. "సమత్వం యోగ ఉచ్యతే"

    భోగము మితిమీర వలదు
    రోగమునకు మందు మాకు రూకలు వలయున్
    త్యాగము సర్వస్వమ్మౌ
    యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్

    రిప్లయితొలగించండి
  13. బాగుగ త్రాగుచు కల్లున్
    భోగములో మున్గినతడు భూరిగతా హృ
    ద్రోగముతో బాధ పడగ
    యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్

    రిప్లయితొలగించండి