29, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 90 (దోగ్ధ్రీధేనువు గర్భమందు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 34
సమస్య - "దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికం
దు ల్వుట్టె నుగ్రాకృతిన్"
శా.
దోగ్ధ్రీవాంతతపోదయా! గుణనిధీ! తేజస్వి! పాపాటవీ
దగ్ధ్రాక్ష్మానలుఁ డైన కశ్యపున కుద్యద్గర్వులై యాగభు
గ్జగ్ధ్రీశుల్ సుతు లుద్భవించిరి బిడౌజా! వింత వీక్షించితే
దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందు ల్వుట్టె నుగ్రాకృతిన్"
[పులి కందులు = పులి బిడ్డలు]
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

14 కామెంట్‌లు:

  1. గురువుగారూ ఈ పద్యానికి అర్థం కూడా వివరిస్తే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ,
    ఈ పద్యానికి ఆర్థం చేప్పాలంటే సంస్కృతభాషాప్రావీణ్యం కలవారే సమర్థులు. నా కంతటి పాండిత్యం లేదు. మనకు డా. విష్ణునందన్ గారే దిక్కు. వారెప్పుడు చూస్తారో, ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.
    ఈలోగా నా ప్రయత్నం నేను చేస్తాను.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారూ , నమస్సులు . ఈ పద్యం అర్థం అయ్యేంత పాండిత్యం నాకూ లేదు . మొదటి పాదం కొరుకుడు పడడం లేదు. యతి మైత్రి కుదరడం లేదు , ఇది సరైన పాఠమే కదా !
    పాపాటవీ దగ్ధ్రాక్ష్మానలుడైన = పాపాటవితో ( పాపమనే అటవీ ) కూడుకొన్న దహింపదగిన భూమి పాలిట అనలుడైన , అంటే కశ్యపుడు పాపాలన్నీ దహించివేయగలడనుట ;
    ఉద్యద్గర్వులై = అమితమైన గర్వముగలవారై ,
    యాగభుగ్జగ్ధ్రీశుల్ = జగ్ధి అంటే ఆహారం , హుతభుక్కులైన దేవతలనే ఆహారంగా భోంచేసే రాక్షసులు ;
    బిడౌజా = ఇంద్రుడిని సంబోధిస్తూ ,
    దోగ్ధ్రీ = ఈని పాలిచ్చునటువంటి ఆవు
    మొత్తానికి అటువంటి గంగి గోవులాంటి సాధువైన కశ్యపుడికి , దితి ద్వారా , క్రూరమైన వ్యాఘ్రాల్లాంటి రాక్షసులు పుట్టినారంటూ ఇంద్రుడిని సంబోధిస్తూ చెప్పిన పద్యం .

    దీని భావాన్ని మరింత విశదంగా వివరింపగల తిరుమలేశుల కోసం నేనూ ఎదురు చూస్తూన్నాను !!!

    రిప్లయితొలగించండి
  4. డా. విష్ణు నందన్ గారూ,
    శ్రమ తీసుకొని పద్యభావాన్ని వివరించారు. ధన్యవాదాలు.
    ఇక మొదటి పాదంలో యతిదోషం .. నేనిచ్చిన పాఠం సరైనదే. పుస్తకంలో అలాగే ఉంది. అయితే అక్కడి యతిదోషాన్ని ‘దీపాల’ వారు గుర్తించి అక్కడొక ప్రశ్నార్థక చిహ్నాన్ని(?) పెట్టారు. నేను గమనించలేదు. ఇప్పుడు చూసాను.

    రిప్లయితొలగించండి
  5. నారికేళ పాక పద్యాన్ని అందించిన శంకరార్యులకు,
    అర్థ వివరణను మాకోసం అడిగిన మిస్సన్న గారికి,
    తీరిక చేసుకుని (కొబ్బరి) ' కోరిన ' అర్థాన్ని వివరించిన విష్ణు నందన్ గారికి ...
    వెరసి త్రిమూర్తులకు మా నమస్కారములు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారూ హనుమచ్చాస్త్రి గారన్నట్లు అత్యంత క్లిష్టమైన సమస్యనూ, దాని పూరణనూ
    మాకు పరిచయం చేసినందుకు మీకూ, ఆ పద్య రత్నానికి దాదాపు పూర్తి భావాన్ని విశదీకరించి-
    నందుకు శ్రీ విష్ణు నందనులకూ మా నమోవాకములు.
    హనుమచ్చాస్త్రి గారూ ఇందులో నా పాత్ర ఏమీ లేదు.
    గురువుగారూ, విష్ణు నందనలూ వీరి ప్రక్కన నా పేరు నున్చడము సరి కాదు.
    వారు విద్వత్సంపన్నులు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! ధన్యవాదములు !
    విష్ణు నందనా ! సుందరా ! ధన్యవాదములు !
    చాలా చక్కగా అర్థం తెలియ జేశారు !

    శంకరార్యా ! ఇప్పుడు సందేహాలు ఇంకా పెరిగినవి !
    అర్థం తెలిసాక కూడా అక్కడ రేఫము ఎందుకుందో అర్థం కావటం లేదు !
    ఇంతకీ యే యే పదాలు కలిసి ఆ ప్రాసాక్షరం యేర్పడిందో
    కొంచెం పద విభజన చేసి చూపుతారా !

    రిప్లయితొలగించండి
  8. గరికపాటి నరసింహారావు గారు ఒక శతావధానంలో చేసిన పూరణ పద్యం.నెట్ లో దొరికింది.

    ధిగ్ధ్రా ప్రాసము దుష్కరంబగునె ఆంధ్రీమాత గర్భంబునన్
    ప్రాగ్ద్రూణంబుల పాశ్చిమాధముల గర్వంబార్పగా సింహముల్
    త్వగ్ద్రవ్యుల్ మన ఆంధ్రకేసరులు భాస్వన్మూర్తులై పుట్టరే
    దోగ్ధ్రీ ధేనువు గర్భమందు పులికందుల్ పుట్టె నుగ్రాకృతిన్



    ఈ శతావధానం గురించి భైరవభట్ల కామేశ్వరరావు గారి తెలుగుపద్యం బ్లాగ్లో జరిగిన ఒక రసవత్తరమైన చర్చలో సనత్ శ్రీపతి గారు గరికపాటి వారే ఇచ్చిన ఇంకొక పూరణ ను చూపించారు.
    దృగ్ద్రాక్షారస మాధురుల్ గుఱియు వాగ్దేవీ ప్రసాదంబదే
    వాగ్ద్రూణంబులు కుట్టినంత జననీ పాదమ్మె మందౌనుగా,
    దిగ్ధ్రా ప్రాసము దుష్కరమ్మె కనుమాంధ్రీమాత సంతానమున్
    దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందుల్ పుట్టె నుగ్రాకృతిన్

    వసంతకిశోర్ గారూ, దోగ్ధ్రి అనే పదానికి ఈనిన ఆవు అనే అర్థం నిఘంటువు చూపిస్తున్నది.జగ్ధి, దగ్ధ అనే పదాల అర్థమే ఇక్కడ సరిపోతోంది.
    మిగిలిన పదాల్లో రేఫల గురించి నాకూ తెలీలేదు.

    రిప్లయితొలగించండి
  9. దగ్ధ+క్ష్మ+అనలుడు, యాగభుక్+జగ్ధి+ఈశుల్ అయితే అర్థాలు నిఘంటువు ప్రకారం సరిపోతున్నాయి అనిపిస్తుంది. మరి దగ్ధ్రాక్ష్మా, భుగ్జగ్ధ్రీ అని ఎందుకు వచ్చాయో తెలీలేదు.

    రిప్లయితొలగించండి
  10. బహుశా దగ్ధ = దహింప బడిన , దగ్ధ్ర = దహింపదగియున్న ; జగ్ధ్రి = తినదగియున్న
    ఇలా అర్థాలు వస్తాయంటారా?
    మన సంస్కృత గురువర్యులే తీర్చాలి సందేహాలు.

    రిప్లయితొలగించండి
  11. మందాకిని గారూ ! చాలా శ్రమించారు ! ధన్యవాదములు !
    అయినా సందేహం తీరలేదు !

    రిప్లయితొలగించండి
  12. మందాకిని గారూ,
    చాలా శ్రమ తీసికొని గరికిపాటి వారి పూరణలను ఇవ్వడమే కాక అర్థ చర్చను ప్రారంభించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రమకోర్చి పద్య శో'ధనమును ' మా కందిం చిన మందాకిని గార్కి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి