మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 15
సమస్య -"పాతరలో సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్"
కం.ఈతఱిఁ గాపులఁ బిలువుఁడి
రాతిరి ప్రొద్దెల్ల జాత రాయెను ధాన్యం
బాతురముగఁ బోయింతము
పాతరలో; సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.
యాతన లేలా డబ్బుకు
రిప్లయితొలగించండిజాతరలో సరుకునమ్మ జాలవె? నేడే
పోతము తెమ్మిటు తేగలు
పాతరలో, సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్
ప్రీతిగ ధ్యానము జేయుము
రిప్లయితొలగించండిప్రాత: కాలమ్మునందు పరమేశ్వరునే !
ఈ తరి నిద్దుర నీలో
పాతర ! లోసూర్యుఁ డుదయపర్వత మెక్కెన్ !
లోసుర్యుడు = రాత్రంతా ఎక్కడో లోపలున్న సూర్యుడు అని నా భావం.
తాతలు ధాన్యము వోతురు
రిప్లయితొలగించండిపాతరలో, సూర్యుడుదయపర్వతమెక్కెన్
చూతమనుచుపాతర,నే
రీతిగ రవి తాఁ గనంగ లేడే, లోనన్!
పాతర = నేలమాళిగ ; అందులో చీకటి గా ఉంటుంది. సూర్యరశ్మి పడని చోటు. అందుకే సూర్యుడు పాతరలో ధాన్యమును చూద్దామని ప్రయత్నించీ, చూడలేకపోయాడని రాశాను.
రాతిరి పొలముకు కావలి
రిప్లయితొలగించండియాతన తప్పుటకుధాన్య రాశుల నంతా
మూతలు వేసెదమామన
పాతరలో, సూర్యుడుదయపర్వతమెక్కెన్.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
______________________________
రాతిరి గోతిని తవ్వగ
తాతల పాతర దొరికెను - తామరసముతో !
భీతిలి సురభిని గప్పితి
పాతరలో; సూర్యుఁ డుదయ - పర్వత మెక్కెన్ !
______________________________
తామరసము = సురభి = బంగారము
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిపాతరలోని తేగలు తెప్పించిన మీ పూరణ అద్భుతంగా ఉంది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నిద్దురను పాతిపెట్టుమన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది.
మందాకిని గారూ,
సూర్యుణ్ణే పాతరలోకి తొంగిచూచేట్లు చేసిన మీ మొదటి పూరణ చాలా బాగుంది.
రెండవ పూరణ బాగుంది. చిన్న సవరణలు (బ్రాకెట్లలో)
"రాతిరి (చేనుకు) కావలి
యాతన తప్పుటకుధాన్య రాశుల (నెల్లన్)
...... ‘పొలముకు’ అనికాక ‘పొలమునకు’ అనాలి కదా!
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీకు పాతర దొరికిందో, లేదో కాని మాకు మాత్రం మీ చక్కని పద్యాలు నిధి దొరికిందనడం అక్షరసత్యం. ధన్యవాదాలు.
గురువుగారూ,
రిప్లయితొలగించండిమీ సవరణలు (రెండు పూరణల్ల్లో) శిరోధార్యం. ధన్యవాదాలు.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి