3, జూన్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 64 (మార్తాండుం డపరాద్రి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 8
సమస్య - "మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో
మధ్యాహ్నకాలంబునన్"
శా.
కీర్తింపం దగు రామసాయక మహాగ్నిజ్వాల శుంభన్నిశా
వర్తిన్ రావణుఁ గాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె న
ట్లార్తిన్ జెంద మిమున్ జయించుఁ గద ము న్నత్యుగ్రుఁడై దైత్యరా
ణ్మార్తాండుం; డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

19 కామెంట్‌లు:

  1. మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో;మధ్యాహ్నకాలంబునన్
    కీర్తీ! నిన్నును నేనునమ్మి పనిఁనీకివ్వంగనయ్యో!నినున్
    గుర్తింపంకను,నే నుమూర్ఖముగఁనీ ఘోరంబునే చేసితిన్
    ఆర్తిన్ నేనుదయంబునన్ వడియముల్ ఆరంగఁబెట్టంటినే!

    "మధ్యాహ్నమే నిన్ను నమ్మి వడియాలు ఎండలో పెట్టమని చెప్తే పెట్టనే లేదా" అని తల్లి కూతురిని మందలిస్తూ ఎండంతా పోయిందే అని దిగులు పడుతున్నది.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. సంస్కృత భాషవలె గంభీరముగాను, మనోజ్ఞంగాను ఉంది రవిగారూ మీ పద్యం. అభినందనలు.
    నా సాహసం మన్నించెదరని నమ్మకంతో ఒక సందేహం. అపరాద్రి లోనే మునగాలి కదా ఇక్కడ, మబ్బులు మాటున గ్రుంకినట్టు ఉంటే పూర్వాద్రికి, అపరాద్రికి మధ్యలోనే ఉంటాడేమో ! :)

    రిప్లయితొలగించండి
  4. మందాకిని గారూ, :) అది కవిసమయంగా సరిపెట్టుకోవాలి మీరు. తప్పదు.

    రిప్లయితొలగించండి
  5. చిన్న మార్పు:-

    నర్తించెన్ గద ఫుల్లలాసకములున్నంభోదముల్ జూచి వ
    ర్షర్తారంభమునన్ బలాకచయముల్ రంజిల్ల నల్దిక్కు వ్యా
    వర్తంబాయె మనోజ్ఞరీతి యవనిన్ వందింపగన్ జల్లులే,
    మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్.

    రిప్లయితొలగించండి
  6. మాస్టారు గారు,
    ౧. ఫుల్లలాసకములు - ఈ సమాసం సరైనదేనా? ఫుల్లకలాపకలాపి అని పెద్దన వారు. ఫుల్ల తర్వాత పింఛం అర్థం ఉన్న శబ్దం రావాలా వద్దా?
    ౨. లాసకములంభోద/లాసకములున్నంభోద - రెండూ ఒప్పేనా?

    తప్పని అనుమానం ఉన్నా వ్రాశాను, తెలుస్తుందని.

    రిప్లయితొలగించండి
  7. భక్తీ టీవిని, నాట్యమున్ సలుపగా, బాగా కృషిన్ జేయగా!
    ఆర్తీ!ఎప్పుడు వత్తువీవు చెపుమా! ఆత్రంబు లేదేమిటో!
    మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో!మధ్యాహ్నకాలంబునన్
    నర్తింపంగను నాట్యశాల కెపుడున్ నాకంటె ముందుందువే!

    రిప్లయితొలగించండి
  8. ధూర్తంబౌ తన వేడిబాణములచే పుష్పంబులన్ వాడ్చి న
    మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో!మధ్యాహ్నకాలంబునన్
    మూర్తంబై జలరాశిమేఘములరూపున్దాల్చగానెక్కడో
    నర్తించేనుమయూరముల్ మరికనేనా నర్త నల్ సేయనా!

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శ్రీకృష్ణుడు చక్రాన్ని అడ్డము పెట్టగానే కౌరవ సేనలో
    "మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో"అని కలకలం రేగింది !
    పైకి తలెత్తి చూచిన సైంధవుని శిరమును గుర్తించిన పార్థుడు
    దాన్ని చీల్చి చెండాడేడు మధ్యాహ్నకాలంబునన్ !

    అదీ సందర్భం :

    01)
    ___________________________________________

    కర్తవ్యంబు దలంచి చక్రి తన, చ- క్రంపంప నడ్డంబుగా
    "మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో"- మధ్యాహ్న కాలంబునన్
    ఆర్తత్రాణ పరాయణున్ గరుణచే - ఆనాడు పార్థుండు తా
    గుర్తించెన్నట , సైంధవున్శిరమునే ! - గుండాడె వెన్వెంటనే !
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  10. మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    కాకుంటె కొన్ని చిన్నచిన్న లోపాలు.
    మొదటి పూరణలో "గుర్తింపంకను", రెండవ పూరణ మొదటి పాదం చివర "న" .. నాల్గవపాదంలో "నర్తించేను" .
    సమయాభావం వల్ల సవరణలు చేయలేక పోతున్నాను. సాయంత్రం వరకు వీలైతే సవరిస్తాను.

    రవి గారూ,
    మీ పూరణ ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
    "ఫుల్లలాసకములు" అనవచ్చు. దోషం లేదు.
    "లాసకము లంబోద" అంటే యతి తప్పుతుంది. "లాసకములు న్నంబోద" అనడమే సరి.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    నే నెదురు చూసిన పూరణ మీ నుండి వచ్చించి. సంతోషం. చాలా బాగుంది. అభినందనలు.
    "చక్రంపంప" అనేది "చక్రం బేయ/ చక్రం బంప" అంటే సరి.0

    రిప్లయితొలగించండి
  12. వసంత్ కిశోర్ గారు, నేను మొదట అనుకున్న పూరణ మీరు పూరించారు. చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  13. కార్తీకంబున దూర దర్శనములో కార్యక్రమమ్ముండెగా
    ఆర్తీ! ఎప్పుడు వత్తువీవు చెపుమా! ఆత్రంబు లేదేమిటో!
    మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో! మధ్యాహ్నకాలంబునన్
    నర్తింపంగను నాట్యశాల కెపుడున్ నాకంటె ముందుందువే?

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ఆద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. 2019 May 23:

    స్మృతి ఇరాని కల:

    వార్తన్ వొందగ గుండు కొట్టెననుచున్ బ్రహ్మాండమౌ తీరునన్
    కుర్తా పైజమ చిన్గిపోవగనుభల్ గొంతెండి మాట్రాకయో!
    నర్తించించెడి డింపులన్ గనగయో! నాకిట్లు తోచెన్ గదా:
    మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్

    రిప్లయితొలగించండి