1, జూన్ 2011, బుధవారం

సమస్యా పూరణం -350 (పాండురాజుకు పుత్త్రులు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పాండురాజుకు పుత్త్రులు వందమంది.

11 కామెంట్‌లు:

  1. మాస్టారూ, ఓరుగల్లు నీరు మీకు స్వస్థత చేకూర్చిందని తలుస్తూ,నా పూరణ:
    స్వప్నమందు నే గంటిని చక్కగాను
    పాండురాజుకు పుత్త్రులు వందమంది
    చీకురాజునకైదుగురౌ కుమారు
    లందరు గలసి రారాజు నంటి యుండె.

    రిప్లయితొలగించండి
  2. పంచపాండవు లనువారు - మంచివారు
    పాండురాజుకు పుత్రులు ; వందమంది
    కౌరవులనెడి వారలు - కాపురుషులు
    గుడ్డి రాజైన ద్రుతరాష్ట్రు కొమరు లనగ

    రిప్లయితొలగించండి
  3. చంద్రశేఖర్ గారూ,
    స్వప్నవృత్తాంతంతో పూరణ మంచి ఆలోచన. బాగుంది. కాని 2,4 పాదాల అర్థం సందిగ్ధంగా ఉంది.

    నాగరాజు రవీందర్ గారూ,
    శ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    కొడుకు లన్నకు , తనకును - కొడుకులు గద !
    ఆ విధంబున జూచిన - యవని లోన
    పాండు రాజుకు పుత్రులు - వంద మంది
    కాదు; నూటైదు, కలిపిన - కౌరవులను !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పంచ పాండవులే తెచ్చె మంచి పేరు
    పాండురాజుకు; పుత్రులు వందమంది
    చెడును కురురాజు కిచ్చిరి చివరికిలను
    మనసు,మంచియె ముఖ్యమ్ము మందిగాదు!

    రిప్లయితొలగించండి
  7. మాస్టారూ, కలలో పాండురాజు యొక్క వంద మంది పుత్త్రులు, చీకురాజు(ధృతరాష్ట్రుడు) యొక్క ఐదుగురు పుత్త్రులు కలసి రారాజు (దుర్యోధనుడు)ని అంటి పట్టుకొని వున్నారు. ఇందులో అన్ని వ్యతిరేకాలే. కలగాబట్టి సరిపోయింది(నవ్వుతూ).

    రిప్లయితొలగించండి
  8. ధృతరాష్ట్రుని స్వగతం

    పుణ్యమెంతయుఁజేసెనొ పుత్త్రు లట్టి
    వీరు లుఁగలిగిరి, తనదు వెనుక జన్మఁ
    పాండురాజు; కు పుత్త్రులు వందమంది
    కలుగఁ నేపాపమంతయుకలిసె నాకు?

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    ఇప్పుడు మీ భావం నాకు అవగతమయింది. ధన్యవాదాలు.

    మందాకిని గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. ముఖ్యంగా "పాండురాఉ - కుపుత్రులు" విరుపు చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  10. తే.గీ.సుతులు కొంచమైనను చాలు శూరు లైన  
             వారు భీమార్జునయముల యట్లు కలరు 
             పాండు రాజుకు  , పుత్రులు వంద మంది
             ఏల  కౌరవుల పగిది  చెడ్డ వారు(నీచు లధిప)

    డా.కోమలరావు బారువ 

    రిప్లయితొలగించండి