21, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 82 (ఎలుకలు తమ కలుగులోని)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 26
సమస్య -
"ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్"
కం.
ఇలలో నిద్దఱు రాజులు
మలయుచుఁ జదరంగ మాడి మాపటివేళన్
బల మెత్తి కట్ట మఱచిన
నెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

22 కామెంట్‌లు:

  1. కలవగ దలిచెను రావణు,
    దలపడి లంకను హనుమయె దనుజుల గూల్చెన్!
    కలబడనని నటియింపగ,
    ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
  2. సులభుండని భక్తులకున్
    కలడెల్లెడలంచు నమ్మఁ, గంబము వీడెన్
    వెలివడి లీలలఁ జూపెన్
    ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్

    ఏనుగంతటి దేవుని భక్తి కంబములోనికి రప్పించగలిగిందని భావము.

    రిప్లయితొలగించండి
  3. మరింత స్పష్టతకోసం-

    పిలిచిన బాలుని మెచ్చుచుఁ
    వెలువడె కంబముఁ ఘనుండు విష్ణువుఁ దానే
    కలడెల్లెడలంచుఁ; గనుము
    నెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్

    ఏనుగంతటి దేవుని భక్తి కంబములోనికి రప్పించగలిగిందని భావము.

    రిప్లయితొలగించండి
  4. చెలువము మీరగ నాడిరి
    వలపన్నియు మునిపనుపున వగలొలుకంగన్,
    యిలనేలు హరిశ్చంద్రుని,
    యెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్!

    రిప్లయితొలగించండి
  5. విలువలు మరచిరి యందరు
    అలిగిన హజరే! గెలుచుట అందని పండే!
    వెలుగును జూచునె ధర్మము!
    ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
  6. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంగళవారం, జూన్ 21, 2011 2:25:00 PM

    గురువు గారూ,
    మీ బాల్యమిత్రుని మరణానికి నా సంతాపములు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  7. పలు భర్తృహరి హితోక్తుల
    తెలిగించిన లక్ష్మణకవిదిగ్గజు బొమ్మన్
    వెలుపల మరచితి నకటా!
    ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.

    (భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అద్భుతంగా అనువదించిన
    ' ఏనుగుల లక్ష్మణ కవి' గురించి తెలియని తెలుగు వారుండరు కదా.)

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులకు,
    నమస్కారం. నా బాల్యమిత్రుడు బోయినపల్లి గో్పాల్ రావు గుండెపోటుతో మరణించాడు. మొన్ననే దారిలో కలిసి చాలాసేపు మాట్లాడాడు. వీలు చూసుకొని తొందరలోనే మా యింటికి వస్తానన్నాడు. ఇంతలో ఈ వార్త. వాడి జ్ఞాపకాలతో బాధాతప్తహృదయుణ్ణై ఉన్నాను.
    వాడికి ఇద్దరూ కూతుళ్ళే. ఒకరు న్యూయార్క్ లో, ఒకరు కెనడాలో. వాళ్ళు వచ్చాక అంటే ఎల్లుండి అంత్యక్రియలు జరుగవచ్చు. అప్పటిదాకా నేను బ్లాగును తరచు వీక్షించి, అందరి పూరణలకు వెంటవెంటనే స్పందించకపోవచ్చు. దయచేసి మీలో మీరే సాటి కవిమిత్రుల పూరణల గుణదోషాలను పరామర్శించండి. ప్రస్తుతానికి నన్ను మన్నించండి.

    రిప్లయితొలగించండి
  9. సృష్టి లొ స్నేహం కంటె మాధుర్యం మరొకటి లేదు అటువంటి బాల్య మిత్రుని కోల్పోవడం బాధా కరం. మీరు కాస్త తేరు కున్నాకే మన సమస్యా పూరణలు పరిశీలించ వచ్చును. తొందర ఏమి లేదు. ?

    రిప్లయితొలగించండి
  10. మీ మిత్రుని ఆత్మ ముక్తి కలగాలని ఆశిస్తున్నాము.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ బాల్య మిత్రుని కోల్పోవడం చాల బాధాకరం.
    మీ మిత్రునికి పరమేశ్వరుడు సద్గతులిచ్చు గాక.

    రిప్లయితొలగించండి
  12. మాస్టరు గారూ ! మీ బాల్య మిత్రుని మరణానికి చింతిస్తున్నాను.వారి ఆత్మకు శాంతి కలుగు గాక.

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులారా,
    నా బాల్యమిత్రుని మరణంపట్ల తమ విచారాన్ని వెల్లడించినందుకు అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఏనుగులాంటి హనుమంతుణ్ణి ఎలుకలకలుగులాంటి లంకలోకి లాగారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    మందాకిని గారూ,
    ఎలుక కలుగులాంటి స్తంభంలోకి విశ్వరూపుడైన భగవంతుణ్ణి ప్రవేశపెట్టారు. బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    బహుకాల దర్శనం! పూరణ బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. సుజన మిత్రులు బోయినపల్లి గోపాలరావు గారి అకాల మరణం సహృదయులైన మిమ్మల్ని, మీ మ్త్రులమైన మమ్మల్ని చాలా బాధ పెట్టింది.కాల గమనంలో అనివార్యమైనచరమాంకమిది. ఆ పరమాత్మను చేరుకొన్న గోపాల్రావుగారికి ఆత్మశాంతి చేకూరును గాక అని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
    మీకూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేసున్నాను.

    రిప్లయితొలగించండి
  17. నిలువక యమ దూతలు సద
    మల గోపాల్ రావు గొనియె మడియించి. కటా!
    తలచిన బాధగ నున్నది.
    "ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్"

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా !
    మీ మిత్ర వియోగము మీతో పాటూ మాకు కూడా బాధగా నున్నది !
    ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం !

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    చినుకులా రాలి
    నదులుగా మారి
    వరదలై పొంగి---------

    చినుకూ చినుకూ కలిస్తే ఉప్పెనే గదా !

    01)
    __________________________________

    చలి చీమల చిక్కిన ఘన
    విలోమమును లాగి ,జేర్చె - వివరము నందున్ !
    కలిసిన చినుకులె సంద్రము(కలిసిన చినుకుల చందము)
    ఎలుకలు తమ కలుగులోని - కేనుఁగు నీడ్చెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  20. పిలదాని బొమ్మ కొలువున
    పలువురు జేజలను గాంచి పరువుల తోడన్
    బిలబిల గణేశు లాగుచు
    నెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి