10, జూన్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -359 (భారతీయత మన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
భారతీయత మనకిదే భారమయ్యె.
ఈ సమస్యను పంపిన వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

12 కామెంట్‌లు:

 1. భారతీయత లోనను పరగ భార
  తీ కరుణయు మరి కలదు 'తీయత' నము
  తీయ దనమును విడనాడి, తిరిగి చూడ
  భారతీయత ; మనకిదే 'భార' మయ్యె !

  రిప్లయితొలగించండి
 2. నీతి యన్నది గనరాదు నేత లందు,
  ప్రీతి లేదులే పేదకు భీతి దప్ప
  ప్రజలు గోరున దేమిటో ప్రభుత గనదు
  భారతీయత మనకిదే భారమయ్యె !

  రిప్లయితొలగించండి
 3. పెద్ద వారికి గౌరవం బేరు కైన
  లేదు, యతిథుల కిచ్చట లేదు ప్రేమ,
  సేద్యమన్ననిచటనిప్డు శీతకన్ను;
  భారతీయత మనకిదే భారమయ్యె.

  రిప్లయితొలగించండి
 4. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జూన్ 10, 2011 2:46:00 PM

  భరత దేశపు యువతకు భార్య వోలె
  దష్ట పాశ్చాత్య సంస్కృతి దాపురిల్లె
  ఇంకనేమని చెప్పుదు వంక, తల్లి
  భారతీయత మనకిదే భారమయ్యె

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  ______________________________

  వేల లక్షల కోట్లను - నిలువ దెచ్చి
  మెక్కు నాయకు లిట జూడ - ఎక్కు వయ్యె!
  అట్టి యవినీతి పరులకే - అందలాలు !
  తప్పు జేయుట నేడిట - గొప్పదయ్యె !
  సగటు సంపాదనకు మించె; - సంచితముగ
  తలకు మించిన అప్పులు - తరచి చూడ !
  భారతీయత మన కిదే - భార మయ్యె
  ______________________________
  నిలువ = అప్పు
  సగటు సంపాదన = సగటు పౌరుని సంపాదన

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  "భారతీయత" తో పదకేళి ఆడుకున్నారే. బాగుంది.

  మంద పీతాంబర్ గారూ,
  చాలా చక్కని పద్యం చెప్పారు.

  మందాకిని గారూ,
  భారతీయసంప్రదాయాలను చక్కగా గుర్తుకు తెచ్చారు. సంతోషం.
  "గౌరవం బేరుకైన" అన్నచోట "మన్నన పేరుకైన" అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 7. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  అందమైన పూరణతో పద్యం చెప్పారు. ఉత్తమంగా ఉంది.

  వసంత కిశోర్ గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది.
  కాని మొదటి పాదంలో యతి తప్పింది.
  "వేల లక్షల కోట్లను - (వీలు జూచి)
  మెక్కు నాయకు లిట జూడ - ఎక్కు (వైరి)!" అంటే బాగుంటుందేమో!

  రిప్లయితొలగించండి
 8. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 9. ఆర్ష ధర్మంపు పొడ మన కసలు పడదు
  మాతృ వందన మొనరింప నీతి గాదు
  హైందవము మించు నపరాధ మవని లేదు
  ' భారతీయత ' మనకిదే భారమయ్యె.

  రిప్లయితొలగించండి
 10. మిస్సన్న గారూ,
  ఉదాత్తమైన పూరణ మీది. ధన్యవాదాలు.
  హిందువుగా జన్మించినందుకు గర్విద్దాం.

  రిప్లయితొలగించండి