8, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 69 (భామాకుచమండలంబు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 13
సమస్య -
"భామాకుచమండలంబు భస్మం బాయెన్"
కం.
కామాతురుఁడై జంగము
ప్రేమంబున బూతిఁ బూసి ప్రియ మలరంగాఁ
గామినిఁ గౌఁగిఁటఁ జేర్చిన
భామాకుచమండలంబు భస్మం బాయెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

11 కామెంట్‌లు:

  1. కామారి ముఖము ముద్దిడి,
    శ్రీమాతను జేరి పాలు జీకుచు నుండన్
    ప్రేమలు మీరగ స్కందుడు;
    భామాకుచమండలంబు భస్మం బాయెన్ !

    రిప్లయితొలగించండి
  2. పాలు జీకుచు... అంటే బాగాలేదేమోనని చిన్న సవరణ...

    కామారి ముఖము ముద్దిడి,
    శ్రీమాతను పాల కొరకు జేరగ, ద్రావన్
    ప్రేమలు మీరగ స్కందుడు;
    భామాకుచమండలంబు భస్మం బాయెన్ !

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    శాస్త్రిగారూ బావుంది !

    01)
    _________________________________

    భామా మణి వేదవతియె
    ప్రేమగ తా నగ్నిని బడి - ప్రేతిని బొందెన్ !
    ఆమెను గాల్చిన నగ్నిని
    భామా కుచ మండలంబు - భస్మం బాయెన్ ! _________________________________
    ప్రేతి = మరణము

    రిప్లయితొలగించండి
  4. శంతనుని జన్మ కారణము.

    కామోద్దీపన జేసెను
    భామా కుచ మండలంబు, భస్మం బాయెన్
    ఏమందు వేల్పు సభ్యత
    భూమండల మందు పుట్టె భూపతియై తాన్.

    రిప్లయితొలగించండి
  5. ప్రేమించితినని జెప్పగ
    భామిని కళ్యాణమాడి భార్యగ మారెన్
    భూమికకు సవతినని దెలియ
    భామాకుచమండలంబు భస్మం బాయెన్.

    గురువుగారికి నమస్కారములతో

    రిప్లయితొలగించండి
  6. తామర గర్భుడు,కృష్ణుని
    నామమ్మునబుట్ట,వానినస్యముజేయన్,
    మామా బంపిన పూతన
    భామాకుచమండలంబు భస్మం బాయెన్!

    రిప్లయితొలగించండి
  7. లేమా నీ లేత యందము
    ప్రేరితమై పరితపింప పరిణయ మాడన్ "
    కామాంధుడు కనుగానక
    భామా కుఛ మండలంబు భస్మంబా యెన్
    [ఇలా వ్రాయాలనుకుని పొరబడ్డాను పై పద్యము చెరపడానికి రాలేదు }

    రిప్లయితొలగించండి
  8. రమడవ పాదం " ప్రేరితమై పరితపింప ప్రాణము బోవన్ ! " అంటే సరి పోతుందేమో ?

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    లెస్స అయిన పూరణ మీది. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు.
    "భూమికకు సవతినని దెలియ" .... ?

    మంద పీతాంబర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    "మామా బంపిన"ను "మామయె పంపిన" అంటే సరి!

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    మీ సవరణ కూడా సరిపోదు. "పెండిలి యాడన్" అంటే యతి సరిపోతుంది.

    రిప్లయితొలగించండి