అందరికీ వందనములు !01)_____________________________మెచ్చి యివ్వగ మణితోడ - మించు బోడిజాంబ వంతుని కూతురు - జాంబ వతియెకపిని కల్యాణ మాడెను ! - గౌరి కొడుకుకరుణ చేతను తొలగెను - కలత లపుడు !_____________________________
గౌరి పెద్దన్న, పేరేమొ కనకరాజు 'కనక' మామయ్య పిల్లను 'కపి ' యననుచు నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు కపిని కళ్యాణ మాడెను, గౌరి కొడుకు.
గురువుగారికి నమస్కారములతో కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు దైత్య వర్గమెల్లను అరు దెంచి నేమి పెండ్లి మెచ్చునే పదుగురు ? పలుకులువిన స్వప్నము గరగి యతడును, సంతసించె.
లక్ష్మి యెవనిని ముదముగ లగ్నమాడె?ఇనకులజుఁడు విల్లు విఱిచి యేమి జేసె?విఘ్న నాయకుడెవ్వఁడు? వివరమేమి?కపిని, కళ్యాణ మాడెను, గౌరి కొడుకు!!కపి = విష్ణువు
ఆంజ నేయుని రూపము నదియె గనుము!వధువు నేమిటి జేసెను వరుడు నపుడు?ప్రథమ పూజల నందెడి బాలుడెవరు?కపిని, కళ్యాణ మాడెను, గౌరి కొడుకు.
నాగభూషణుండు యల వినాయకునకుసిద్ది బుద్దులతో బెండ్లి సేయనెంచి పిలిచె నింద్రాది బృందారకులను, విధిని, కపిని; కల్యాణ మాడెను గౌరి కొడుకు సిద్ది బుద్ది = వినాయకుని భార్యల పేర్లు విధి = బ్రహ్మ ; కపి = విష్ణువు
వసంత కిశోర్ గారూ,మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,మేనరికపు పెండ్లి జరిపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. "అని + అనుచు" అన్నప్పుడు యడాగమం వస్తుంది. "కపి యటంచు/ కపి యనుచును" అంటే సరి!వరప్రసాద్ గారూ,మీ స్వప్నవృత్తాంతపు పూరణ బాగుంది. అభినందనలు. జిగురు సత్యనారాయణ గారూ,మీ ప్రశ్నోత్తర రూపమైన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. మందాకిని గారూ,ప్రశ్నోత్తర రూపంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. నాగరాజు రవీందర్ గారూ,ఉదాత్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
ధన్యవాదములు. మాస్టరు గారూ !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
_____________________________
మెచ్చి యివ్వగ మణితోడ - మించు బోడి
జాంబ వంతుని కూతురు - జాంబ వతియె
కపిని కల్యాణ మాడెను ! - గౌరి కొడుకు
కరుణ చేతను తొలగెను - కలత లపుడు !
_____________________________
గౌరి పెద్దన్న, పేరేమొ కనకరాజు
రిప్లయితొలగించండి'కనక' మామయ్య పిల్లను 'కపి ' యననుచు
నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు
కపిని కళ్యాణ మాడెను, గౌరి కొడుకు.
గురువుగారికి నమస్కారములతో
రిప్లయితొలగించండికపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు
దైత్య వర్గమెల్లను అరు దెంచి నేమి
పెండ్లి మెచ్చునే పదుగురు ? పలుకులువిన
స్వప్నము గరగి యతడును, సంతసించె.
లక్ష్మి యెవనిని ముదముగ లగ్నమాడె?
రిప్లయితొలగించండిఇనకులజుఁడు విల్లు విఱిచి యేమి జేసె?
విఘ్న నాయకుడెవ్వఁడు? వివరమేమి?
కపిని, కళ్యాణ మాడెను, గౌరి కొడుకు!!
కపి = విష్ణువు
ఆంజ నేయుని రూపము నదియె గనుము!
రిప్లయితొలగించండివధువు నేమిటి జేసెను వరుడు నపుడు?
ప్రథమ పూజల నందెడి బాలుడెవరు?
కపిని, కళ్యాణ మాడెను, గౌరి కొడుకు.
నాగభూషణుండు యల వినాయకునకు
రిప్లయితొలగించండిసిద్ది బుద్దులతో బెండ్లి సేయనెంచి
పిలిచె నింద్రాది బృందారకులను, విధిని,
కపిని; కల్యాణ మాడెను గౌరి కొడుకు
సిద్ది బుద్ది = వినాయకుని భార్యల పేర్లు
విధి = బ్రహ్మ ; కపి = విష్ణువు
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మేనరికపు పెండ్లి జరిపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
"అని + అనుచు" అన్నప్పుడు యడాగమం వస్తుంది. "కపి యటంచు/ కపి యనుచును" అంటే సరి!
వరప్రసాద్ గారూ,
మీ స్వప్నవృత్తాంతపు పూరణ బాగుంది. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
మీ ప్రశ్నోత్తర రూపమైన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మందాకిని గారూ,
ప్రశ్నోత్తర రూపంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
ఉదాత్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిధన్యవాదములు. మాస్టరు గారూ !
రిప్లయితొలగించండి