9, జూన్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 70 (కుటిలాలక యెడమకన్ను)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 14
సమస్య -
"కుటిలాలక యెడమకన్ను కుడిక న్నాయెన్"
కం.
నిటలమున నీవు దాల్చిన
పటుతర కస్తూరిరేఖ బహుగతి రతిచే
నటునిటు జాఱిన చెమటకుఁ
గుటిలాలక యెడమకన్ను కుడిక న్నాయెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

11 కామెంట్‌లు:

  1. ఇట హాస్పటలున జేరగ
    కటకమ్మును మార్తురంచు కంటికి; అకటా !
    కటకట! వికటంబాయెను
    గుటిలాలక యెడమకన్ను కుడిక న్నాయెన్!

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్ల వింతలు చాలా చదివాం. మంచి విషయాన్ని ఎత్తుకొని పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    అవును. వంకలు తిరిగిన జుట్టుకల అందమైన స్త్రీ.

    రిప్లయితొలగించండి
  3. కాటుకఁ దీర్చుచు కంటికి
    నటునిటు చూచుచుఁ ముకురము నడిగెను చెలియన్,
    చటుకునఁ జూడఁగ నందున
    కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్

    రిప్లయితొలగించండి
  4. గురువు గారికి ధన్యవాదములు తెలుపుతూ.
    ప్రస్తుత ఆంధ్ర రాజకీయములను ఈ రూపున
    క: నటునిటు గా రెడ్లుండగ
    చటుకున గొట్ట నధికార సారద్యమునన్
    పటుతర ప్రభుత్వముండగ
    కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్.
    ( కుటిలాలక = సొనియాగాంధి )
    ( భూమిక = మొదటి భార్య , నిన్నటి కందపద్యములో " భామాకుచమండలంబు భస్మం బాయెన్".
    )

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ,
    నే ననుకున్న అద్దంలో ప్రతిబింబపు పూరణ మీ నుండి వచ్చింది. బాగుంది. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    పద్యం నిర్దోషంగా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. మటుమాయ మగును మంటలు
    చిటికెను, కాటుకను బెట్ట చెల్లి కనులకున్,
    ఇటు జూడు విడచితేలనె
    కుటిలాలక యెడమకన్ను? కుడిక న్నాయెన్.

    రిప్లయితొలగించండి
  7. కట కట యెంతటి ఘోరము ?
    నిటలాక్షుని శిరము పైన జటలో గంగన్ !
    పటుతరమై నిలిచి చూడ
    కుటిలాలక యెడమ కన్ను కుడి కన్నాయెన్ !

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    చటులపు కంటికి సోకె, క
    సటు , ముందుగ నెడమ వైపు! - సాయంత్రముకే
    యిటుదటు వ్యాపించ కలక
    కుటిలాలక యెడమ కన్ను కుడి కన్నాయెన్ !
    __________________________________
    చటులము = అందమైనది .కసటు = కలక

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ.

    రాజేశ్వరి గారూ,
    మంచి పూరణ. కాని రెండవపాదంలో యతి తప్పింది.
    "నిటలాక్షుని శిరము పైన (నిలిచిన) గంగన్ !
    పటుతరమై (వీక్షింపగ)" అందాం.

    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణలోని చమత్కారం అలరించింది.

    రిప్లయితొలగించండి