7, జూన్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -356 (గొడ్డు టావు పాలు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గొడ్డు టావు పాలు కుండ నిండె.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

 1. కలి యుగమున జూడ కన్పట్టె చిత్రాలు !
  విన్నపాలు వినెడి విగ్రహములు
  పాలు త్రాగె! చూడ పాలొచ్చె వేపకు!
  గొడ్డు టావు పాలు కుండ నిండె!

  రిప్లయితొలగించండి
 2. ఎండమావినీరు ఎకరము దడిపెను,
  గొడ్డుటావు పాలు కుండనిండె
  నన్న, నమ్మిదిరిగె నమ్మలక్కలునేడు
  వరుసబెట్టి జెప్పు వివరములను!
  గురువుగారికి నమస్కారములతో

  రిప్లయితొలగించండి
 3. పాడిపైరుల దిగుబడి పెంచవలె నన్న
  మందు లెన్నొ గలవు మనకు నేడు
  మర్మ మెరిగి మంచి హార్మోనులను యివ్వ
  గొడ్డు టావు పాలు కుండ నిండె

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  వరప్రసాద్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
  "హార్మోనులను యివ్వ" అనేది "హార్మోనుల నొసంగ" అంటే నిర్దోషంగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 5. గొడ్డుటావుపాలు కుండనిండెననుచు
  యడ్డగోలు మాటలాడతగునె?
  గడ్డిమేయమఱిగి గద్దెనెక్కిన గొడ్డు
  పాలనిచ్చుననుట పాడియౌనె?

  రిప్లయితొలగించండి
 6. చంద్రశేఖర్ గారి పూరణ ....

  చందమామఁ జూపి అందమైన కవిత
  గట్టి గోరు ముద్ద లెట్టు అమ్మ
  కల్ల లాడెనేమొ, కప్పిజెప్పగనెంచి
  కల్ల లాడువారె కవులు గాదె!

  రిప్లయితొలగించండి
 7. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  అమ్మను కవయిత్రిని చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. శంకరార్యా !
  చంద్ర శేఖర్ గారి పూరణకు చోటిది గాదు !

  రిప్లయితొలగించండి
 9. వసంత కిశోర్ గారూ,
  నిజమే! నేను పొరబడి ఇక్కడ పేస్ట్ చేసాను. ఇప్పుడు సవరిస్తాను.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  __________________________________

  భూమి లేని వార్కి - భూము లిచ్చెద మింక !
  ఇళ్ళు లేని వారి - కిళ్ళు పెక్కు !
  రాజకీయు లిట్లు - రమ్యంబుగా జెప్పు !
  గొడ్డు టావు పాలు - కుండ నిండె !
  __________________________________

  రిప్లయితొలగించండి
 11. వసంత కిశోర్ గారూ,
  గొట్టుటావు ల్లాంటి నాయకుల విషయంతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
  "వార్కి"కి బదులు "ప్రజకు" అనీ, "రాజకీయు లిట్లు"కు బదులు "రాజకీయవిదులు" అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 12. శంకరార్యా ! బహు చక్కగా వుంటుంది ! సవరణకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి