ధన్యవాదాలు హనుమచ్చాస్త్రి గారూ ! మీ పూరణ కంచి గరుడ సేవ అర్థాన్ని, పరమార్థాన్నీ బోధిస్తూ వున్నది. అభినందనలు . మిస్సన్న గారూ ! మీ పూరణ కూడ బాగుంది . అభినందనలు.
గురువుగారికి నమస్కారములు. చక్కని వుదాహరణలతో నా సందేహ నివృత్తి చేసినారు.క్రొత్తవిషయం (మావరకు) తెలిసికొన్నాము. గోలి హనుమచ్చాస్త్రి గారికి ఇతర కవి మిత్రులకు ధన్యవాదములు. గురువుగారు ఇంకొక చిన్న అనుమానము. దయచేసి చిత్తగింప ప్రార్థన.కొంతమంది వట్రసుడి (కృ,నృ,తృ మొదలగు వాటి బదులు క్రు, న్రు, త్రు ఇలా వాడుతుంటారుకద. అలాంటప్పుదు వాటి ముందు అక్షరాల పరిస్థితి వివరించ ప్రార్థన. - శ్రీపతి శాస్త్రి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారూ, చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. కంచి గరుడసేవ మంచిదే, కాని ఫలితం లేని దంటారు.
నాగరాజు రవీందర్ గారూ, ప్రశ్నోత్తరరూప మైన మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని చిన్న లోపాలు. కథలు + అన్ని = కథలన్ని అవుతుంది.‘కలియును + ఎచ్చోట, బస్సు + ఏది’ అన్నప్పుడు యడాగమం రాదు. (బ్రాకెట్లలో) నా సవరణలు ... కథలు తుదకు (చేరఁగాఁ బోవు నె)చ్చోట ? మంచి బ(స్సదే)ది కంచి వెడల ?
ధన్యవాదములు. ఇంకా మెరుగైన పూరణల కొరకు ప్రయత్నిస్తాను. పద్య రచన లొ నాకున్న ఆసక్తిని మరియు నైపణ్యాన్ని పెంపొందించు కొనడానికి అధ్బుతమైన వేదికను కల్పించినందుకు శతథా ధన్యవాదములు.
మిస్సన్న గారు, హనుమచ్చాస్త్రి గారు,శ్రీపతి శాస్త్రి గారు లాంటి వారల సమక్షములొ పద్య రచన చెయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ! 16వ తేదీ నాటి మీ వ్యాఖ్య. గురువుగారు తరచూ అంటూ ఉంటారు. శంకరాభరణంలో అందరమూ నేర్చుకొనే వారమే. ఎవరూ యెక్కువ కాదు. మీరేమీ తక్కువ కాదు. గురు కృప అందరి పైనా ఉండాలని కోరుకొందాము.
ఫలిత మేమి లేని పరమాత్ము సేవండ్రు
రిప్లయితొలగించండికంచి గరుడ సేవ; మంచి దగును
కర్మ ఫలము వదలి కర్మనే జేయంగ,
కరుణ జూపు తానె కమల ధవుడు.
శ్రీగురుభ్యోనమ: - శ్రీపతిశాస్త్రి
రిప్లయితొలగించండిదాస్య శృంఖలములు తల్లికి తొలగింప
సురల గెలిచి తాను సుధలు తెచ్చె
హరిని భక్తిగొలచి హరివాహనుండయ్యె
కంచి గరుడసేవ మంచిదగును
*కథలు అన్ని తుదకు కలియును యెచ్చోట ?
రిప్లయితొలగించండిమంచి బస్సు యేది కంచి వెడల ?
మానవులకు సేవ మహిలోన యేమగు ?
కంచి ; గరుడ ; సేవ మంచి దగును
* పిల్లలకు కథ చెప్పడం ముగిశాక " కథ కంచికి, మన మింటికి "
అంటారు కదా పెద్దలు .
శ్రీపతి శాస్త్రి గారూ!మంచి పూరణ.
రిప్లయితొలగించండిరవీందర్ గారూ !గరుడ బస్సెక్కి కంచి వెళ్ళినంత ఆనందంగా వుంది.
ఉభయులకు అభినందనలు.
కామితములదీర్చు కామక్షి నిలయంబు,
రిప్లయితొలగించండిశేషశయనకునువిశేష సేవ,
యమ నియమము భక్తి యవలంబనముచేత,
కంచి, గరుడసేవ, మంచిదగును.
తిరుమ లేశునకును దివ్యమౌ స్నపనమ్ము,
రిప్లయితొలగించండినరహరికిని చంద నమ్ము, విష్ణు-
కంచి గరుడ సేవ మంచిదగును చూడ
దురిత హరణ మగును తొలగు భవము.
ధన్యవాదాలు హనుమచ్చాస్త్రి గారూ ! మీ పూరణ కంచి గరుడ సేవ అర్థాన్ని, పరమార్థాన్నీ బోధిస్తూ వున్నది. అభినందనలు . మిస్సన్న గారూ ! మీ పూరణ కూడ బాగుంది . అభినందనలు.
రిప్లయితొలగించండిగురువుగారు,
రిప్లయితొలగించండినిన్న మీరు ఇచ్చిన గురు, లఘువుల వ్యాఖ్య చిరకాలముగా మాకు వున్న సందేహాలను నివృత్తి చేసినది. ధన్యవాదములు.
గురువుగారికి నమస్కారములు. చక్కని వుదాహరణలతో నా సందేహ నివృత్తి చేసినారు.క్రొత్తవిషయం (మావరకు) తెలిసికొన్నాము. గోలి హనుమచ్చాస్త్రి గారికి ఇతర కవి మిత్రులకు ధన్యవాదములు. గురువుగారు ఇంకొక చిన్న అనుమానము.
రిప్లయితొలగించండిదయచేసి చిత్తగింప ప్రార్థన.కొంతమంది వట్రసుడి (కృ,నృ,తృ మొదలగు వాటి బదులు క్రు, న్రు, త్రు ఇలా వాడుతుంటారుకద.
అలాంటప్పుదు వాటి ముందు అక్షరాల పరిస్థితి వివరించ ప్రార్థన. - శ్రీపతి శాస్త్రి.
కంచి కేగు నట్టి కధలన్ని యేమౌను ?
రిప్లయితొలగించండిగాంచు వారు లేరు కదలె తప్ప !
రాయి మొక్కినంత రాబోదు ఫలితమ్ము
కంచి గరుడ సేవ మంచి దగును !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
కంచి గరుడసేవ మంచిదే, కాని ఫలితం లేని దంటారు.
నాగరాజు రవీందర్ గారూ,
ప్రశ్నోత్తరరూప మైన మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని చిన్న లోపాలు. కథలు + అన్ని = కథలన్ని అవుతుంది.‘కలియును + ఎచ్చోట, బస్సు + ఏది’ అన్నప్పుడు యడాగమం రాదు. (బ్రాకెట్లలో) నా సవరణలు ...
కథలు తుదకు (చేరఁగాఁ బోవు నె)చ్చోట ?
మంచి బ(స్సదే)ది కంచి వెడల ?
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిక్రమాలంకారంతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
మనోహరమైన పద్యంతో అలరించారు. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
పద్యం నిర్దోషంగా బాగుంది. అభినందనలు. కాని అన్వయమే కాస్త ఇబ్బంది పెడుతోంది.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివట్రసుడిని అలాగే వాడాలి. అమృతాన్ని అమ్రుతంగా వ్రాయకూడదు. అమ్రుతంగా వ్రాసి ‘అ’ను గురువును చేయరాదు.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశంకరార్యా,
రిప్లయితొలగించండిధన్యవాదములు. ఇంకా మెరుగైన పూరణల కొరకు ప్రయత్నిస్తాను.
పద్య రచన లొ నాకున్న ఆసక్తిని మరియు నైపణ్యాన్ని పెంపొందించు కొనడానికి అధ్బుతమైన వేదికను కల్పించినందుకు శతథా ధన్యవాదములు.
మిస్సన్న గారు, హనుమచ్చాస్త్రి గారు,శ్రీపతి శాస్త్రి గారు లాంటి వారల సమక్షములొ పద్య రచన చెయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
అందరికి నా అభివాదములు.
సంపత్ గారూ!నేనూ మీ సహాధ్యాయినే ! కలసి సాగుదాం ..ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువుగారు ధన్యవాదములు. కంచి గరుడ సేవ ఫలితతమివ్వదను విషయం తెలియక ఇందులో వైరుధ్యం లేదని భావించి అలా పూరించినాను.-- శ్రీపతిశాస్త్రి
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారూ! 16వ తేదీ నాటి మీ వ్యాఖ్య.
రిప్లయితొలగించండిగురువుగారు తరచూ అంటూ ఉంటారు.
శంకరాభరణంలో అందరమూ నేర్చుకొనే వారమే.
ఎవరూ యెక్కువ కాదు. మీరేమీ తక్కువ కాదు.
గురు కృప అందరి పైనా ఉండాలని కోరుకొందాము.
కిశోర మహోదయా యెలా ఉన్నారు?
రిప్లయితొలగించండిఆరోగ్యం బాగానే ఉందా?
మూర్తి మిత్రమా మీరు బిజీగా ఉన్నారా?