22, జూన్ 2011, బుధవారం

సమస్యా పూరణం -371 (అందవికారమె బ్రతుకున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అందవికారమె బ్రతుకున నానంద మిడున్.
జాలపత్రిక "ఈమాట" సౌజన్యంతో ..

19 కామెంట్‌లు:

  1. అందమె ఆనందంబగు
    సుందర భావనలు బెంచు సొగసే; మాపన్
    పొందుగ కుత్సిత భావన
    లందవికారమె; బ్రతుకున నానంద మిడున్.

    రిప్లయితొలగించండి
  2. కందుము. బాబూ మోహను
    నందం బది వరమె తనకు. హాయిగ నటనన్
    పొందును తానానందం
    బంద వికారమె బ్రతుకున నానంద మిడున్.

    రిప్లయితొలగించండి
  3. పొందుగ కందెన పూయగ
    మందారము వంటి మోము మారెను,హోళీ
    సందడి నందున,సుందరి
    నందవికారమె బ్రతుకుననానంద మిడున్!!!

    (శంకరాభరణంలో ఇది నా 200 వ పూరణ నాకు ఈ సదవకాశాన్ని కల్పించిన గురువు గారికి .భరించిన కవి మిత్రులకు ,మరియు పాఠకులకు నా ధన్యవాదములు.)

    రిప్లయితొలగించండి
  4. ద్విశత సమస్యా పూరణ కర్త లయిన మంద పీతాంబర్ గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అందుకొని కుబ్జ చుబుకము
    నందాత్మజు డిట్లు పల్కె నవ్వుచు తరుణీ
    కుందెద వేలా నీయీ
    అందవికారమె బ్రతుకున నానంద మిడున్.

    రిప్లయితొలగించండి
  6. రెండు వందల పూరణలను కవి పండిత రంజితంగా పూర్తి చేసిన
    మంద పీతాంబరధరా! అభినందనల ద్విశతం.

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 22, 2011 11:03:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    సుందరమూర్తిని శివుడిని
    సుందరియగు నుమను గలుప సురలే కోరన్
    సుందరవదనుడు మదనుని
    అందవికారమె బ్రతుకున నానందమిడున్

    200 సమస్యాపూరణలు పూర్తిచేసిన మంద పీతాంబర్ గారికి శుభాకాం క్షలు.

    రిప్లయితొలగించండి
  8. మంద పీతాంబర్ గారూ,
    చాలా సంతోషం. ద్విశతాభినందనలు.
    ఉ.
    సంబర మయ్యె నయ్య! విలసత్పదభావవిలాస మొప్ప హృ
    ద్యంబుగ "శంకరాభరణ" మందు సమస్యలు రెండువంద లే
    కంబుగ పూరణల్ సలిపి గణ్యుఁడ వైతివి నీవ ‘మంద పీ
    తాంబర!’ శంకరయ్య నిదె యందఁగఁ జేతు శుభాభినందనల్.

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అంతస్సౌందర్యాన్ని గూర్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    చింతా రామకృష్ణారావు గారూ,
    అందవికారమే వరమైన ‘బాబూమోహన్’ను గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    వసంతోత్సవంలో రంగులవల్ల కలిగిన అందవికారం ఆనందమిచ్చిన మీ పూరణ సుందరంగా ఉంది. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    అందమైన మన్మథుడు తన రూపాన్ని కోల్పోయిన ఆ కథ ఆనందాన్నే ఇస్తుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా !ధన్యవాదములు.

    వందలు రెండుగ పూరణ
    లందముగా జేయ' మంద 'నా పద్యముచే
    అందముగా మెచ్చు కొనిన
    చందము కడు రమ్య మాయె, శంకర ! ఆర్యా !

    రిప్లయితొలగించండి
  11. ద్విశత సమస్యా పూరణోద్ధారకా !
    మంద పీతాంబరధరా !
    అభినందన సహస్రములు !

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మాతృ హృదయం దైవ స్వరూపము గదా :

    01)
    __________________________________

    కొందరి కొంకర కరములు
    కొందరి కొంకర పదములు - కూడిన; తల్లే
    అందరినీ ప్రేమించును !
    అందవికారమె బ్రతుకున - నానంద మిడున్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  13. అందవికారులకు(physically handicapped) నా విన్నపం !
    02)
    __________________________________

    కుందకు మదిలో ! వేదన
    జెందకు ! నీ ప్రఙ్ఞ జూపి - చేరుము శిఖరం !
    అందని యెత్తుల కెదుగుము !
    అందవికారమె బ్రతుకున - నానంద మిడున్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  14. గురువు గారికి ,అభినందించిన కవిమిత్రులకు కృతఙ్ఞతలు

    గాలిన తేలె,నా మనసు,గాంచిన వెంటనె మీదుపద్యమున్,
    గోలియు, మాన్యు లెల్లరును కూరిమి హెచ్చగ బ్రోత్సహించ ,దే
    వాలయమాయె నాకు కవి వర్యుల పూరణ తోరణమ్ము లే
    మేలోనరించె శంకరుడు మెచ్చియు దెల్ప శుభాభినందనల్!

    రిప్లయితొలగించండి
  15. rakshita yanundu sodari
    rakshaa bandhanam naadu raakhi todagan
    deekshaga palkan nennati
    raksha bandhanamu nadu raavaddanna

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాత గారూ,
    దీనిని పొరపాటున ఇక్కడ వ్యాఖ్యగా పెట్టారు. దీనిని 13-8-2011 నాటి పోస్టుకు షిఫ్ట్ చేస్తున్నాను. అక్కడ చూడండి.

    రిప్లయితొలగించండి
  17. అందమునే జూడ దగదు
    పందుల కాపరికి పంది భాగ్యశ్రీ యౌ
    కందల గడ్డల జూడగ
    నందవికారమె; బ్రతుకున నానంద మిడున్

    రిప్లయితొలగించండి
  18. విందును జేయుచు రమణుడు
    పందెపు శృంగారమందు పరువుల తోడన్
    మందలు పిల్లలనిడగా
    అంద వికారమె బ్రతుకున నానంద మిడున్

    రిప్లయితొలగించండి