8, జూన్ 2011, బుధవారం

సమస్యా పూరణం -357 (చీమ కుట్టగఁ జచ్చెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చీమ కుట్టగఁ జచ్చెను సింహ బలుడు.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

 1. ఆఫ్రికా దేశ మందున్న అడవి జూడ
  నేగి నాడొకండు తనదు నేస్త ములతొ
  వింటి చీమ దోమల కాటు విషము యచట
  చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  net పనిచేయక పోవడం వలన రెండు రోజులనుండి
  మిత్రులకు దూరమయ్యా !

  శాస్త్రిగారూ ! బావుంది !

  01)

  ___________________________________

  వీర విక్రమము గలుగు - భీష్ము గెలువ
  తాతయని నెంచకుండగ - తప్పు దారి
  అంబ నడ్డము గాగొని - యమ్ము నేయ
  చీమ కుట్టగఁ జచ్చెను - సింహ బలుడు !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. రామ పత్నినాశించిన రావణుండు
  రాము గొట్టగ జచ్చెను రణమునందు !!
  కోమలమ్మైన మానిని గోరి ,కామ
  చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు!!!

  రిప్లయితొలగించండి
 4. మల్ల యుద్ధము జేసెడి మల్లి నాథు,
  మేను వాల్చగ నిదురను, మెడను జేరి
  చీమ కుట్టగ జచ్చెను; సింహ బలుడు
  చరచి యరచేత నలుపగ చక్కగాను!

  రిప్లయితొలగించండి
 5. కోరి చదివితి మందరు కూర్మి తోడ
  శతకమందున చచ్చెను సర్పమొకటి
  విర్రవీగుచు బలమున వెర్రియగుచు
  చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు!!!

  బలవంతుడ నాకేమని చలిచీమలచేత జిక్కి చచ్చిన సర్పము కథ సుమతీ శతకము నందు చదివియుంటిమి కదా!

  రిప్లయితొలగించండి
 6. చీమలేగదా యవి తానుజెప్పినట్లు
  నాట్యమాడునులేయని, నాయకుండు
  నిద్రలోనుండ, జిక్కిన నలుసు తోడ
  చీమ కుట్టగ, జచ్చెను సింహ బలుడు.
  ( చీమలు = తాపెంచిన ఉగ్రవాదులు,నాయకుడు = అమెరిక, నలుసు= విమానము)
  అమెరికపైన ఆల్ ఖైదా దాడిని ఈరూపమున వ్రాసితిని.

  రిప్లయితొలగించండి
 7. తన తపోదీక్షభంగపు హాని వలన
  ముని పరీక్షిత్తునకు శాప మొసగి చనియె
  యేడు దినములలొ చావు కూడుననుచు,
  చీమరూపము ధరియించె పాము, వినగ
  చీమ కాటుకు జచ్చెను సింహ బలుడు

  రిప్లయితొలగించండి
 8. పెట్టి పుట్టలో వేలును పిల్ల డేడ్చె
  చీమ కుట్టగ ; జచ్చెను సింహబలుడు
  భీమసేనుడు కొట్టగ భీకరముగ -
  చేప కథ భారత కథలు చెప్పుచుంటి !

  రిప్లయితొలగించండి
 9. దోమ కాటుకు బలియైన దొరలు కలరు
  తేలు విషమెక్కి మనుజులు తునుగు గాదె ?
  విషపు కన్యను ముద్దాడి విటుడు జచ్చె
  చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు
  -----------------------------
  తునుగు = చచ్చు , తెగు ,,విరుగు
  విషము + ఎక్కి = [ ము + ఎ ] విషమెక్కి " యెడాగమం " వస్తుందా ? సంధి విడదీసి నప్పుడు మొదటి పదానికి చివర , రెండవ పదానికి మొదలు ఏ అక్షరాలు వస్తే " యెడా " గమం వస్తుంది ? ఎన్నో సార్లు చెప్పారు అయినా మతిపరుపు . గురువులు మన్నించ గలరు.
  .

  రిప్లయితొలగించండి
 10. కవిమిత్రులందరి పూరణలు బాగున్నాయి. చక్కటి విరుపులు, భావాలూ ప్రకటించారు. ధన్యవాదాలు. పిపీలికాది బ్రహ్మాండాలన్నిట ఈశ్వరుడున్నాడని మరచి, హిరణ్యకశ్యపాది రాక్షసులు కోరిన కోరికలు విచిత్రము. దానిని దృష్టిలోపెట్టుకొని, నా పూరణ:
  హీరమందు సహితముండు ఈశ్వరునెరుఁ
  గ నసురబలుఁడు కోరెను, గామచేత
  దప్ప చావురా కూడ దనుచు, తుదకు
  చీమ కుట్టగఁ జచ్చెను సింహ బలుడు.
  సూచన: హీర=గామ=చీమ

  రిప్లయితొలగించండి
 11. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, జూన్ 08, 2011 10:34:00 PM

  రాజేశ్వరి గారు, మీరు వ్రాసిన పద్యం చాలా బాగున్నది. కాని రెండవ పాదములో యతి మైత్రి తప్పినది. అన్యధా భావించ వలదు.

  రిప్లయితొలగించండి
 12. సంపత్ కుమార్ గారూ ! పొరబాటును తెలియ జెప్పినందుకు ధన్య వాదములు. ఎం రాయాలో తట్ట లేదు .అదన్న మాట అసలు సంగతి

  రిప్లయితొలగించండి
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఆఫ్రికా అడవుల్లో మనిషిని చంపగలిగే చీమ లున్నాయని విన్నాను. దానినే విషయంగా చేసి మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
  ద్వితీయపాదాంతమంచు నేస్తముల"తొ" అని హ్రస్వాంతంగా వ్రాసారు. అది తప్పు. "హితులతోడ" అందాం.
  "కుట్టగానే చావాలని" వరం పొందిన చీమ కథను గుర్తు తెచ్చింది మీ రెండవ పూరణ. అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. వసంత కిశోర్ గారూ,
  స్వేచ్ఛామరణవరం పొందిన భీష్ముని ముందు అర్జునుడు చీమలాంటి వాడే. మంచి పూరణ. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  "రాము గొట్టగ" అనడం కంటే "రాముతో పోరి" అనీ, "కామ చీమ" కంటే "మరులు చీమ" అనడం సరి!

  మందాకిని గారూ,
  సుమతీ శతక నీతితో మీ పూరణ శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.

  వరప్రసాద్ గారూ,
  మంచి విషయాన్ని ఎత్తుకొని పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో యతి తప్పింది. "నిద్రలో నుండ" కు బదులు "మెలకువను వీడ" అంటే సరి!

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ రాక సంతోషదాయకం. వస్తూ వస్తూనే చక్కని పూరణను ఇవ్వడమే కాక సాటి కవిమిత్రుల పూరణల నిశితపరిశీలన చేసి సూచన నివ్వడం ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  రెండు కథలను జోడించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  "విష మెక్కి" అన్నప్పుడు యడాగమం రాదు. మీ ప్రయోగం సరైనదే.
  రెండవ పాదంలో యతిదోషం. "తేలు విషమెక్కి మనుజు లందిరి మరణము" అంటే సరి!

  రిప్లయితొలగించండి
 16. చంద్ర శేఖర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి