13, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 74 (నూఱు న్ముప్పదియాఱు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 18
సమస్య - "నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె
న్రుద్రాణివక్షంబునన్"
శా.
రా రమ్మంచుఁ గుమారు నంకముపయిన్ రంజిల్లఁగా నుంచి వి
స్తారోద్యద్ఘనవక్త్రపంచకముతో శంభుండుఁ దత్కాంతయున్
ఆరూఢిన్ నవపంచరత్నపతకం బాలోకనన్ జేయఁగా
నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

8 కామెంట్‌లు:

  1. అభిమానులు తెచ్చిన నెమలికన్నులను సినిమా హీరోయిన్ గుత్తులుగా పట్టుకున్నప్పుడు కనబడే దృశ్యాన్నిఊహిస్తూ ...

    నూరున్రోజులు దాటి పోయె తెలియ న్రుద్రాణి హీరోయినై,
    చేరన్ బృందము, ఫ్యానులంచు నిడగా చేపట్టెగా ప్రీతితో
    వారల్ దెచ్చిన పించముల్;గుబురుగా వక్షంబు పై గప్పగా
    నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్

    రిప్లయితొలగించండి
  2. వీరోదగ్ర రుషానల జ్వలిత సంవిస్ఫారితాలోకయై
    శూరత్వమ్మున దానవాళి తెగటార్చున్ కాళి ; తచ్ఛీర్షముల్
    హారమ్మై మెడలోన ; రాక్షసుల నేత్రానీకముల్ నిండుచో
    నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్ !

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ నెమలికన్నుల పూరణ బాగుంది. వృత్తరచనలోనూ మీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    ఎంత అద్భుతంగా పూరించారు! సురసరిత్ప్రవాహంలాగా సాగించి మీ పద్యం. ధన్యోऽస్మి!

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా! ధన్యవాదములు.
    విష్ణునందన్ గారూ ! చాలా రోజుల తరువాత మాస్టారు గారు చెప్పినట్లు
    సురసరిత్ప్రవాహం లాంటి మీ పద్య ధార లో తడిసి ముద్దైనాము.
    వీలైనన్ని ఎక్కువ మార్లు మాకా అవకాశాన్ని కలిగించాలని మాకోరిక.

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్యగారూ , మీ ప్రశంసకు శతథా కృతజ్ఞతలు ... వినయపూర్వక నమస్సులు.
    హనుమచ్ఛాస్త్రి గారూ , ఈ మధ్యకాలంలో సమయం చిక్కని దుస్స్థితి. .శంకరయ్య గారి లాంటి విద్వత్కవుల ప్రోత్సాహం , మీ వంటి కవిమిత్రావళి సౌజన్యాభిమానమూ , పొందగలిగి ధన్యుడనైనాను . ధన్యవాద పూర్వక నమస్కారాలు .

    రిప్లయితొలగించండి
  6. విష్ణు నందన్ గారూ ఉగ్ర కాళికా స్వరూపాన్నికన్నులముందు సాక్షాత్కరింప జేసి అందర్నీ ధన్యులని చేశారు.

    రిప్లయితొలగించండి

  7. ధీరత్వమ్మును జూపి భాగ్యనగరిన్ తీండ్రించి వేసంగిలో
    వీరావేశము పొంగి పొర్లి ధనమున్ వెచ్చించి కవ్వించుచున్
    గారాబంబుగ లేసు బ్లౌసు కొనుచున్ గర్వించి లంకించగా
    నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరెన్రుద్రాణివక్షంబునన్

    రిప్లయితొలగించండి


  8. కంది వారు


    జిలేబి తరపున సమస్య ఒక్కటి


    కలయే యునికిని మరువగ కలగాంచె కదా !

    రిప్లయితొలగించండి