22, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 83 (మీనాక్షికిఁ గుచము లాఱు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 27
సమస్య -
"మీనాక్షికిఁ గుచము లాఱు మీనశరీరా!"
కం.
సూనశరుఁడు నారసమునఁ
బూనిక సుమకందుకములఁ బొసఁగించె ననం
గాను వెలసిల్లె నెంతయు
మీనాక్షికిఁ గుచము లాఱు మీనశరీరా!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

7 కామెంట్‌లు:

  1. కానగ పెద్దవటంచును
    పూనికతో మందులేల పూయుట? తప్పే.
    ఏణాక్షి సొగసు నొప్పెడి
    మీనాక్షికి కుచములారు మీన శరీరా!
    (కుచములు + ఆరు =కుచములు ఆరిపోవును, హరించిపోవును)

    రిప్లయితొలగించండి
  2. చింతా వారికి నమస్కారములు.ఆరును ఆరుటగా జూచి పూరణను ఉతికి ఆరేశారండీ !

    రిప్లయితొలగించండి
  3. మీనశరీరుడను చిత్రకారునికి చిత్రం యెలా వుండాలో చెప్తూ ...
    ఆనామము తగ్గట్టుగ
    కానగ వలె కళ్ళు, యెత్తుగా గీయవలెన్!
    దీనాక్షికి,కామాక్షికి,
    మీనాక్షికి, కుచములారు మీన శరీరా!!

    రిప్లయితొలగించండి
  4. చింతా రామకృష్ణారావు గారూ,
    బహుకాల దర్శనం. ఈ మధ్య మీరు మీ స్వస్థలానికి వెళ్ళివచ్చారట గదా! మిస్సన్న గారిని కలిసారని తెలిసింది. సంతోషం! నేను హైదరాబాదు నుండి స్వస్థలానికి మకాం మార్చాను. కారణాలు మీకు తెలిసినవే!
    చక్కని పూరణతో మీ పునర్దర్శనం ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చమత్కారభరితమైన మీ పూరణ అలరించింది. అభినందనలు.
    ‘దీనాక్షి’ ... ?

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా !ధన్యవాదములు.
    దీనముగా చూసే కళ్ళు కలది(దీనాక్షి) అనే అర్థం లో వాడాను.
    తప్పో ఒప్పో తెలియదు.దోషమయితే ప్రాస సరిపోయే వేరొక పేరు సూచించ వలసినదిగా ప్రార్థన.చింతా వారు చెప్పినట్లు ఏణాక్షిని వుంచవచ్చునా?అర్థము తెలుప వలసినదిగా మనవి.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    సోనాక్షి కొలను కెళ్ళిన
    మీనాక్షియె మునుక లాడి - మిద్దెకు జేరన్
    వేనలి కంటెను ముందుగ
    మీనాక్షికిఁ గుచము లాఱు - మీనశరీరా !
    __________________________________
    వేనలి = జడ

    రిప్లయితొలగించండి