17, జూన్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 78 (మరుఁడు మురిపించె)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 22
సమస్య -
"మరుఁడు మురిపించె యముఁడు కింకరులఁ జూపె"
తే.గీ.
భరతకులవీరుఁ డైనట్టి పాండురాజు
మాద్రిపై దృష్టిఁ బఱపిన మగువ యంత
వలదు వలదని వారింప వాంఛఁ గదియ
మరుఁడు మురిపించె యముఁడు కింకరులఁ జూపె.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

5 కామెంట్‌లు:

  1. సుతుడు జేసిన నాట్యమ్ము జూచి తిరిగి
    యింటి కేగుచు కారులో నొంట రిగను
    హత్య గాబడె, విధి నేమి యందు !తన కొ
    మరుఁడు మురిపించె; యముఁడు కింకరులఁ జూపె

    రిప్లయితొలగించండి
  2. బొమ్మ,పుత్తడి-యనుచును పూర్ణమనొక
    తాత పెండిలి యాడెను-ధనపు మదమొ,
    మరుడు మురిపెంచె!యముడు కింకరులఁ జూపె
    నమ్మ పూర్ణమకును! నీరు నాదు కంట!

    గురజాడ వారి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ చదివిన వారి కంట నీరు రాక మానదు.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి నమస్కారములతో
    తే: వరుడు వనమందు గనిపించె మరుడు వలెను
    మరులు గొలిపెడి మగువలు మురిసి బిలువ
    మరుడు మురిపించె , యముడు కింకరుల జూపె
    వాంఛ దీర వాపులు రాగ, వానిపైన |
    ( వాపులు = రోగములు)

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘కొమరుడు మురిపిందా’ డన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభనందనలు.

    మందాకిని గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘మరుడు వలెను" అన్నచోత ‘మరుని వలెను" అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి